నవరాత్రి - 6 - షష్ఠీ విభక్తి #navarAtri - 6 - shashThI vibhakti#

7 views
Skip to first unread message

J K Mohana Rao

unread,
Oct 8, 2024, 5:36:13 AM (13 days ago) Oct 8
to Telugu Chandassu
నవరాత్రి - 6 - షష్ఠీ విభక్తి
*
మ. వరవీణామృదుపాణికిన్, వరదకున్, - భాషాపయోరాశికిన్,
నరనారీహృదయాబ్జదేవమణికిన్, - నానాకళారాజ్ఞికిన్,
పరమానందము లిచ్చు మాతృకకు, నా - బ్రహ్మాణి గీర్దేవికిన్,
సరసీజాక్షి సరస్వతీరమణికిన్, - సాక్షాన్నమస్కారముల్!
*
కళిక - ద్విరదగతి రగడ
*
మఱియు దేవప్రియకు - మధురగతి గీతికకు
పఱగు నామాలినికి - భావినీవిలసితకు
భైరవికి భారతికి - పద్మమాలాధరకు
చారుమతి స్రగ్ధరకు - సామగానప్రియకు
మందార వల్లికకు - మధురాక్షరాకృతికి
ఇందువదనకు లలిత - హేమహాసద్యుతికి
లయవృత్త రంజనకు - లాలిత్య లాలసకు
నయమాలినికి దేవ - నారాయణికి నుషకు
*
ఉత్కళిక
*
ఛందముల గంధములు
బంధముల యందములు
గీతముల రాగములు
చేతముల యోగములు
పుస్తకపు పద్యములు
మస్తకపు చోద్యములు
బమ్మ సతి శారదకు
అమ్మకు విశారదకు
*
విభక్త్యాభాసము
*
లలితమగు నంబిక కు
వలయముల శారద కు
ధరముల విలాసిని కి
వరముల సుమాధురి కి
రణముల విరాజిత కు
జనముల జయప్రద కు
తలముల నడచు సతికి
లలితరవ రాగిణికి
*
విధేయుడు - మోహన
# navarAtri - 6 - shashThI vibhakti
*
ma. varavINAmRdupANikin, varadakun, - bhAshApayOrASikin,
naranArIhRdayAbjadEvamaNikin, - nAnAkaLArAj~nikin,
paramAnaMdamu lichchu mAtRkaku, nA - brahmANi gIrdEvikin,
sarasIjAxi sarasvatIramaNikin, -  sAxAnnamaskAramul!
*
kaLika - dviradagati ragaDa
*
ma~riyu dEvapriyaku - madhuragati gItikaku  
pa~ragu nAmAliniki - bhAvinIvilasitaku
bhairaviki bhAratiki - padmamAlAdharaku
chArumati sragdharaku - sAmagAnapriyaku
maMdAra vallikaku - madhurAxarAkRtiki
iMduvadanaku lalita - hEmahAsadyutiki
layavRtta raMjanaku - lAlitya lAlasaku
nayamAliniki dEva - nArAyaNiki nushaku
*
utkaLika
*
ChaMdamula gaMdhamulu
baMdhamula yaMdamulu
gItamula rAgamulu
chEtamula yOgamulu
pustakapu padyamulu
mastakapu chOdyamulu
bamma sati SAradaku
ammaku viSAradaku
*
vibhaktyAbhAsamu
*
lalitamagu naMbika ku
valayamula SArada ku
dharamula vilAsini ki
varamula sumAdhuri ki
raNamula virAjita ku
janamula jayaprada ku
talamula naDachu satiki
lalitarava rAgiNiki
*
vidhEyuDu - mOhana
#

Reply all
Reply to author
Forward
0 new messages