విగ్రహాలు --- జీవితాలు
కే. లోకేందేర్ రావు 20-3-2011
10-3-2011 నాడు తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగు తున్న సమయం లో హైదరాబాద్ చెరువు గట్టు పై జరిగిన సంఘటనల పై ఒక వర్గం ఛే తెలంగాణా సంస్కృతి సభ్యత పై జరిగినా దాడి సందర్భం లో మనసులోనుండి పెల్లుబికిన భావ పరంపర ఈ కవిత .
1. చావ లేక బ్రతుక లేక
దోపిడీ లతో వేగలేక
మనసులోని భాధనంతా
శిలల పైన తీర్చుకుంటే
నేరమమేమిటి ద్రో హమేమిటి ?
2. కృష్ణరాయల పెరుపెట్టిన
రాతినోక్కటి నీట ముంచిన
కృష్ణరాయల కీర్తి మకుటం
విరిగిపోవున తరిగిపోవున ?
3. “అన్నమయ్య” అను పేరు రాసిన
శిలా ఫలకం నేలకొరిగిన
అతని కవితలు అంతరించున ?
అతని కీర్తీ సమసిపోవున ?
4. పలిగిపోయిన విరిగి పోయిన
శిలలనన్నిటి తిరిగి పేర్చి
చెరువుగట్టున పొదగ వచ్చు
వారి కీర్తిని పొగడ వచ్చు
కాని
4. ఉద్యమం లో నేలకొరిగిన
యువత ప్రాణాల్ తిరిగివచ్చున ?
తల్లిదండ్రుల పుత్రశోకం
మాన్ప వచ్చున? తీర్చవ చ్చున ?
కనుక
5. మానవత్వపు విలువలున్న
మనుషులందరు ఏకమై
పగిలిపోయిన శిలల కొరకు
వ్యర్థ వాదన మానుకోంటూ
6. యువకిశోరుల త్యాగనిరతిని
తలచుకొంటూ పోగడుకొంటు
వారి ఆత్మల శాంతి కొరకు
రాష్ట్ర సాధన చేసుకుందాం.