మరక మంచిదే...

16 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Feb 6, 2008, 10:55:27 AM2/6/08
to తెలుగు సాహిత్య వేదిక
మరక మంచిదే...
బట్టలపై నైన్నా
జీవితంలో నైనా!


పండినే చెట్టుకే
రాళ్ళ దెబ్బలు
జీవితం అంటే
మరకయొక్క
శాశ్వతగుర్తే కదా!


కళ్ళలోకి నిండిన
కన్నీటి కుండలు
దేహం మొత్తం కాలినా
చితిమంటల
రక్తపు కాసరాలు!


మేఘపు సమూహాలు
రమ్మని బలవంతం చేస్తూ
వర్షపు చినుకుల్ని అతిధులుగా
పంపుతున్నాయి!


చినుకుల్ని రాలుస్తూ
ఆకాశం గర్బస్థమైంది
మనుషులు అహాన్ని రాలుస్తూ
రాక్షసులు అవుతున్నారు!


కష్టాల కొలిమిలో వేడిక్కినా
జీవితం కడు రక్తపు
కవిత్వాలు రాస్తున్నది!


సంస్కారం ఒక రాచపుండు
నటనకు ఆస్కార్ ల పంట
ఇపుడు మనం నాగరికులం అట!


ప్రపంచీకరణ ఎండినా డొక్కలో
తన్నిన దున్న కాలు
నా కారం రొట్టేను గుంజుకున్న
పిచ్చికుక్క!



నాకు కావలసినదంతా
టీవి ఇస్తునప్పుడు
నాక్కొంచం జీవితం పట్ల
నమ్మకం కావాలి!


ఎవరన్నారు అభివృద్ది
జరగలేదని
పల్లె పల్లె లో కేబుల్ టీవీలు
కోకాకోలాలు, పెప్సీలు!


ప్రస్తుతం అభివృద్ది అంటే
మార్కేట్ నిర్దేశించే
వస్తువుల్ని సమీకరించు
కోవడమే!






Reply all
Reply to author
Forward
0 new messages