నూతన సంవత్సరం...

22 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Jan 16, 2008, 12:39:55 AM1/16/08
to తెలుగు సాహిత్య వేదిక
నూతన సంవత్సరం
అన్ని పాతవే
మారిందల్లా గోడ మీది
క్యాలెండర్ మాత్రమే!


చీకటంటే ఒకటే భయం
దెయ్యాలొస్తాయని కాదు
ప్రేయసి కలలోకి వస్తుందని!


ఒకే స్వప్నంలో అనేక కలలు
ఏరుకుంటున్నాను...
మట్టిలో కూర్చబడ్డ
జీవిత మర్మలని!


నిశ్శబ్ద సంగీతంలో
అపశృతుల వికృత హేళ
యాంత్రిక జీవితం నుండి
సహజత్వం వైపు నన్ను
ప్రయాణించనివ్వండి!


సమాంతర రేఖలెప్పుడు
శూన్యంలోనే కలుస్తాయి
జీవితం లోని వక్రతలన్ని
ఒక విజయంతో మటుమాయమైతాయి!


గ్లోబల్ గదిలో
కీ బోర్డ్ కిటికీలతో
రహస్యాలన్ని బట్టబయలు పడి
భారంగ నిట్టూర్చుతాయి!


కనులు మూసిన
మిరుమిట్ట్లు గొలిపే
వెలుతురును భరించడం
ఎంతకష్టం!

హృదయం భారమై
స్పందన కరువైనపుడు
జీవితం లోని అనుభవాలన్ని
చరిత్ర గానే మిగిలిపోతాయి!

Reply all
Reply to author
Forward
0 new messages