'రిజర్వేషన్ కవిత్వం"

14 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Nov 22, 2007, 2:16:38 AM11/22/07
to తెలుగు సాహిత్య వేదిక
'రిజర్వేషన్ కవిత్వం"





అవును మేము రిజర్వేషన్
గాళ్ళమే!
మా ప్రతిభను కొలవడానికి
మీరు పారేసే భిక్షపు
మార్కులు మా కక్కరలేదు
చిలుక పలుకులు,బట్టీలు పట్టడం
మాకు చాతకాదు!
సృజనాత్మకత మా పుట్టుకలోనే ఉంది
నా తండ్రి వ్యవసాయ పనిముట్లు
తయారు చేయడంలో ఉంది.
నా తల్లి పంట నూర్పిడిలో ఉంది
మీకు చేతనైతే ఒక అక్షరాన్ని
అందంగా చెక్కండి
వ్యాక్యాన్ని నల్లని దళిత
సౌందర్యవతిలా మార్చండి !
కాలం మారిన కొద్ది
కులం రూపు మారిపోతుందనుకున్నాను
కాని ...
ఉన్నత విశ్వ విద్యాలయాల్లో
కాల నాగై కాటేస్తుందనుకోలేదు!
మా ప్రతిభను కొలవడానికి
మీకున్న ప్రస్తుత కొలమానాలు సరిపోవు
అనంతమైన నా తెలివిని
మీ మోకాళ్ళతో కొలువలేరు!


(విశ్వవిద్యాలయల్లో కులవ్యవస్థ వికృత స్వరూపం చూసి...)
Reply all
Reply to author
Forward
0 new messages