తడి ఆరని కవిత్వం-మంచుపూలవెన్నెల

33 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Feb 6, 2008, 5:35:11 PM2/6/08
to తెలుగు సాహిత్య వేదిక
తడి ఆరని కవిత్వం-మంచుపూలవెన్నెల


చరిత్రను చదివే ముందు చరిత్రకారుడిని చదవమన్నాడు ఇ.హెచ్.కార్.అలాగే
కవిత్వం చదివే ముందు కవిని చదవాలి.కవిని చదివేముందు కవికాలం నాటి
సామాజికతను చదవాలి.అప్పుడు ఏ కవి కవిత్వాన్నైన విశ్లేషించుకోవడానికి ఒక
నిర్ణయానికి రావడానికి వీలు ఏర్పడుతున్నది.సాధారణంగా పాఠకుడు కవిత్వాన్ని
కేవలం కవిత్వం కోసమే చదవడు.కవి తన కవిత్వంలో ఏమి చెప్పాడో,ఎలా
చెప్పాడో,ఎందుకు చెప్పాడో అర్థం చేసుకునేందుకు చదువుతాడు."కవిత్వమంతా
దాని లోతైన స్థాయిల్లో ఒక నిర్దిష్టమైన చారిత్రక విభాత సంధ్యల్లో రచయిత
రూపొంది చైతన్యాన్ని పొంది వ్యక్తికరిస్తాడు"అని స్టాన్ స్మిత్ చెప్పిన
అంశాలు యువకవి "బెల్లంకొండ రవికాంత్"కు సరిగ్గా సరిపోతాయి.


బెల్లంకొండ రవికాంత్ మృధుస్వభావి కాస్త మొహమాటస్తుడు.ఈయన తాజాగా
వెలువరించిన కవిత సంకలనం"మంచుపూల వెన్నెల".ఇందులో 30 కవితలు
ఉన్నాయి.వస్తువు రిత్యా విలక్షణత ఈ కవితల సుగుణం.రచయిత శైలి మృదుమధురంగా
ఉంటుంది.విడవకుండ చదివించే నైజం ఈ కవితలలో ఉంది.ఇందులోని కవిత్వం
ప్రధానంగా బాల్యం,జీవితం,ఉద్వేగం,తత్వం,ఏకాంతంతో ముడిపడి ఉన్నాయి.


ప్రస్తుత విద్యవ్యవస్థలో పరీక్షలు ఒక నరకాన్ని తలిపిస్తున్నాయి.ఈ
ఒత్తిడిని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు
చేసుకొంటున్నారు.ఈ పరిస్థితిని గమనించిన రచయిత పరీక్షల
తీరుతెన్నులను,వాటి లోటుపాట్లను "కాపలా" అను కవితలో సమర్థంగా
వ్యక్తీకరించాడు.


ఈ మూడు గంటలు
గడుయారంలో క్షణాలకు ముళ్ళు మొలుచుకొస్తాయ్
గది మొత్తానికి నేనొక్కడినే చక్రవర్తిని
కాపలా కు....క్క....ని కూడ....!
మనిషిని మనిషే నమ్మకూడదనే సిద్దాంతాన్ని
వాడికిక్కడి నుంచే అలవాటు చేస్తున్న/ నా ముఖం మీద ఎవడన్న ఖాడ్రించి
ఉమ్మితే బాగుండు" అని వ్యవస్థ వైపల్యాన్ని ఆత్మాశ్రయం చేసుకుంటూ
ప్రశ్నిస్తాడు.


గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు యూనివర్సిటీలలో ఇంగ్లీషు రాక పడుతున్న
ఇబ్బందుల్ని రవికాంత్ శక్తిమంతంగా అక్షరీకరించారు "అంతా ఆంగ్లమే" అను
కవితలో.ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ ఇప్పుడు తప్పని సరి అవసరం.ఈ కవితలో
తెలుగు భాష పట్ల మమకారం వెల్లడిస్తున్నాడు.



"అన్ని వదిలేశాక
ఇంకా తెలుగుతో పనేముంది
ఇక్కడ నవ్వినా ఏడ్చినా.....అంతా ఆంగ్లమే"
ఇలా సాగుతుంది కవిత....
నాకెవరన్నా ఆంగ్లం నేర్పండయ్యా.....!
నావాళ్ళ మధ్యే నేను అపరిచితుడనైతున్నాను

అని రవికాంత్ తెలుగు మీద ప్రేమను చంపుకోలేక అటు ఇంగ్లీష్ రాక ఇబ్బందులు
పడె
విద్యార్థుల భాధలను కవిత్వీకరిస్తున్నాడు.





(మిగత బాగం రేపు రాస్తాను)









































Reply all
Reply to author
Forward
0 new messages