రహదారిపై ఎర్రటి ఎండలో
ఏడో నంబరు మైలురాయిపై
ఎవరో కూర్చొన్నారు...
శరీరాన్ని ముద్దలా మడిసి
గుండ్రంగా సున్నాల కనిపిస్తున్నారు!
అర్దనిమీలిత నేత్రాలతో
ఆత్రంగా వెతుకులాట
అక్కడో,ఇక్కడో,మరెక్కడో
నిను వెతుకుంటున్నాను!
సూదూర తీరాన్నుంచి
నీ గద్గద స్వరం
మలయమారుతంలా తాకింది
నా మనోహర నేత్రం విచ్చుకుంది సంతోషంగా!
రెండు రక్తపు బొట్లు
నేలపై రాల్చి
పెను వృక్షమై ఎదిగినా...
నాపై వాలే పావురాలు
కూడ నీ జాడ చెప్పలేదు!
కన్నీటి తెరలలో
నీ అస్పస్ట రూపం
కనులు మూసి తెరిచేలోగా
మాయమై పోతున్నది!
చిక్కటి చీకటిలో కూడ
ఎక్కడివో వెలుతురు జాడలు
మనస్సులోకి దూరి దైర్యానిస్తున్నాయి!
కనిపించక పోవడం తత్కాలికమే
కనుమరుగవడమే భరించలేనిది!
(మరిన్ని కవితల కోసం దర్శించండి www.venkateshuoh.blogspot.com)