మా కన్న తల్లిని దోచుకుని
మీరు కడుపులు నింపుకున్నారు
పాలు తాగాక రొమ్ములు గుద్దారు
నా తల్లిప్పుడు కళా విహీన ముఖముతో
అంపశయ్యపై పడుకుంది!
మాకు కావలసింది వాగ్దానాల
నీటిమూటలు డబ్బుసంచులు కాదు
మా అక్షరాలు ఆత్మవిశ్వాసంతో
తల ఎత్తుక తిరుగాలి
చీము నెత్తురు కలిసి సజీవమై
అన్యాయాన్ని ప్రశ్నించాలి!
నా భాషను విధూషకున్ని చేసి
వీధిలో నగుబాట్ల పాలు చెశారు
నా సహనం చచ్చింది
నేను ఇక ఊరుకోను
సమరశంఖం పూరిస్తున్నా...
ఇక నా తెలంగాణలో ...
విప్లవ వీరుల పురిటి గడ్డపై
రక్తపు టేరుల రహదారిపై
మృతవీరుల కళేభరాలపై
తెలంగాణ తల్లిని ప్రతిస్థాపిస్తాం
ఆధిక్యాన్ని భూస్థాపితం చేస్తాం!