లే పెన్స్యూర్
శుక్రవారం, సెప్టెంబర్ 28 2007, 14:18 Hrs (IST)
వెంకట్
కందుకూరి రమేష్ బాబు ఇటీవల రచించిన "లే పేన్స్యూర్"సామాన్య శాస్రం వరుస
ప్రచురణలలో తొమ్మిదవది.సామాన్య శాస్త్రం పేరిట జీవితంలో సామన్యంగా
బ్రతుకుతూనే ఇతరులకు చేతకాని,గొప్పవాళ్ళమని చెప్పుకునే అసమాన్యుల
ఆలోచనలకు కూడ అందని,సాద సీదా జీవితం లోని ఉన్నత విలువలను
అక్షరీకరిస్తున్నారు.ఈ సందర్బంగా రమేష్ బాబుని మనస్పుర్తిగా
అబినందిస్తున్నాను.విషయంలోనికి వెళితే ఇది ఒక అంధ గాయకుని జీవిత
చిత్రణ.ఇతడు గత ముప్పై సంవత్సరాలుగ ఒకే ప్రదేశంలో తన పిల్లన గ్రోవితో
బాటసారులకు సేదతీర్చుతున్నాడు.ఈయనకు చాల మంది అభిమానులు ఉన్నారు.తమకు
నచ్చిన పాట పాడించుకొని జేబులోంచి చిల్లర వేస్తారు.
ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యె అతని దినచర్య చుట్టుపక్కల వారికి
సుప్రభాతంలా తోస్తుందని తన పుస్తకంలో రాసాడు.కాబట్టి ప్రతివారికి ఏదొ ఒక
పేరు కావాలి కాబట్టి ఇతని పేరు లింగయ్య పుట్టిన ఊరు రేపల్లే.ఇది
పాలమూరులో ఉంది.పుట్టుక తోనె లింగయ్యకు అంధత్వం వచ్చింది.అప్పటి నుండి
అతని భాగోగులు అతని మేనమామ చూస్తున్నాడు.లింగయ్య కడుపు కోసం కళకారుడు
అయ్యాడు.పిల్లన గ్రోవితో అతను పాడే పాట కడుపులోంచి,ఆకలి నుండి
పుట్టింది.అందుకేనేమో లింగయ్య పాట వింటే మీరు ఒక్క క్షణం తప్పకుండా
ఆగుతారు.ఆ పిల్లన గ్రోవి లోంచి వచ్చే ప్రతిపాట మిమ్ము మైమరపిస్తుంది.పాత
పాటల నుండి కొత్త పాటల వరకు లింగయ్యకు వచ్చు ఏ పాట కావలంటె ఆ పాట
క్షణాలలో మీకు వినిపిస్తాడు.ఈ పాటలన్ని ఎలా నేర్చుకొన్నావని ప్రశ్నిస్తే
వారి ఊరిలో టేప్ రికార్డర్ ఉన్నదట ఊరికి వెల్లినప్పుడు కొత్త పాటలన్ని
నేర్చుకొంటానని సమాదానం చెప్పాడు.నల్లకుంట లోని ప్రతి ఒక్కరికి లింగయ్య
తెలుసు అతను ఒక్కరోజు పిల్లనగ్రోవి పట్టలేదంటే వారికి ఏమి తోచదు.
ఒక పేద కళకారుడు ఇంతమంది ప్రేమను పొందడంలో కారణం ఒక్కటే
కనిపిస్తుంది.అది హృదయం లోంచి వచ్చే ఆకలి పాట,ఆత్మ విశ్వాసం లోంచి వచ్చే
బ్రతుకుధార.రమేష్ బాబు తన పుస్తకంలో ఒక చోట ఇలా అంటాడు. "అతడు
పాడుతున్నప్పుడు ఊగిపోయే రైలు మరి పాడనప్పుడు ఒంటరి పట్టాలు".లింగయ్యలో
కేవలం కళకారుడు కాకుండ మంచి కవి ఉన్నాడని,అతనిని చూస్తుంటే రోడిన్ మలచిన
"లే పెన్స్యూర్" గుర్తుకు వస్తాడని కవి అభిప్రాయం.ఇంత గొప్ప కళకారునికి
ప్రభుత్వం తగిన సహాయం చేయాలి. నిస్తేజంగా ఉండెవారికి తప్పకుండా అతని పాట
జీవితాన్ని ఎలా ఉన్నతంగా మార్చు కొవచ్చో చెబుతుంది.