గపుడే తెలారుతున్నది.కోళ్ళు "కొక్కొరొకో" అని అరుస్తూ జనాలను
మెల్కోలుపుతున్నయి.రైతులు పలుగు,పార పట్టుకొని పొలాల వైపు నడక
సాగిస్తున్నారు.ఆడంగులు ఇల్లలికి పశువుల పేడను ఎత్తి శుభ్రం
చేస్తున్నారు.సూర్యుడు బద్దకంగా ఆవలించుకుంటు మెల్లిగ వస్తున్నడు.లచ్చమ్మ
పొయ్యి లోకి ఇన్ని బియ్యము గింజలు వేసి ఉడకబెడుతున్నది. కట్టెలు పచ్చిగా
ఉండడం వలన అవి సరిగా రాజు కొనడం లేదు.లచ్చమ్మ ఊదురు గొట్టం సహాయంతో ఆ
పచ్చి కట్టెలను ఊదుతూ ఉంది.అపుడపుడు దగ్గుతు ఉంది.రాత్రనక పోయిన సమ్మయ్య
ఇంక తిరిగిరాలేదు.జొన్న చేనుకు కావలికి బోతనని చెప్పి సద్ది కూడు సంకన
పెట్టుకొని బయల్దేరిన మనిషి ఇంక రాకపోయెసరికి లచ్చమ్మ ఎదలో గుబులు
చుట్టుకుంది.అయినా తన పెనిమిటికి ఎం గాదులె అని తనలోనె తాను దైర్యం
చెప్పుకుంది.ఉడికిన బియ్యాన్ని వార్చి ఉమ్మగిల
బెట్టింది.గొడ్డుకరం,ఉల్లిగడ్డ,పచ్చిమిర్చి వేసి కూడు తయారు చేసింది.తనం
చేసి తన మొగుడి కోసం ఎదురుచూస్తున్నది. అర్దరాత్రి అయినా సమ్మయ్య జాడ
తెలియకపాయె?లచ్చమ్మ గుండెలో అపసకునం తొంగిజూసింది.కొంపదీసి పోలిసోల్లు
కాని పట్టుకుపోయారని అనుమానంగా ఉంది.ఒక్కసారిగా గతంలోకి తొంగిచూసింది
లచ్చమ్మ.పిచ్చయ్య,రాధమ్మల ఒకనొక గారాలపట్టి లచ్చమ్మ.తను ఆడింది
ఆట,పాడిందె పాట అంత సొతంత్రంగా పెంచారు లచ్చమ్మ తల్లితండ్రులు.తాము కూలి
నాలి చేసిన కూతురికి ఏ లోటు రానిచ్చే వారు కాదు.తాము గంజినీళ్ళు తాగి
బిడ్డకు వరి అన్నం తినిపించారు.తమ పానాల కన్న ఎక్కువగా
చూసుకున్నారు.యుక్తవయసు రాగానే తమ మాదిగ కులస్తుడైన సమ్మయ్యను ఏరికోరి
లగ్గం జేసారు.లచ్చమ్మ సిగ్గుల మొగ్గయింది.అంతమంచి మొగడు దొరికినందుకు
సంతోషించింది.ముచ్చటగా తాటాకు గుడిసెలో కాపురం పెట్టారు లచ్చమ్మ సమ్మయ్య
దంపతులు.ప్రతిరోజు వారికి వసంతరాత్రే.ప్రతిక్షణం ఒకరిని విడిచి ఒకరు
ఉండెవాళ్ళు కాదు.వీరి సంసారానికి ఊరంత ఆసూయ పడేది .దంపతులు అంటె ఇలాగ
ఉండాలి అనుకొనెవారు.ఏడాది తిరిగెలోగా వారికి పండంటి కొడుకు పుట్టాడు.ఆ
ఆలుమగల సంతోషానికి అవధులు లేకుండ పొయింది.తమ వంశాకురం జన్మించినందుకు
వారి మది పులకరించింది. సమ్మయ్య తన కొడుక్కి పెపంచంలోని ఉన్న పేర్లలో తన
కొడుకు పేరు బాగుండాలని "రామరాజు" అని పేరు పెట్టడు.తన కొడుకు రాముని వలె
ఉంటాడని,తనకు తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపిస్తాడని
ఆశపడ్డాడు.రామరాజు స్వతహాగా తెలివితేటలు గలవాడు.ఐదేండ్లు రాగానే ప్రభుత్వ
పాటశాలలో జాయిను చేసినారు. ఆ ఆలుమగలు కూలినాలి చేసి డొక్కలు వెన్నుకు
ఆనించుకొని రామరాజును చదివించారు.ఆ బడి పంతులు వీరభద్రయ్య "మీ రామరాజు
బాగ తెలివైనవాడు ఏలాంటి చిక్కు ప్రశ్నలకైన సమధానం చిటికెలో చెపుతాడు.కానీ
దురదృష్టం కొద్ది రామరాజు "మాదిగ" కులంలో పుట్టకపొయింటే ఇంకా ఎదిగేవాడు"
అని లచ్చమ్మ,సమ్మయ్యలకు చెబుతుండే వాడు.రామరాజు పదవతరగతిలో
రాష్ట్రస్తాయిలో ప్రతముడుగా పాసయినాడు.