తడి ఆరని కవిత్వం-మంచుపూల వెన్నెల

20 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Feb 7, 2008, 10:46:16 AM2/7/08
to తెలుగు సాహిత్య వేదిక
తడి ఆరని కవిత్వం-మంచుపూల వెన్నెల

రెండవభాగం








ఆర్థిక సరళీకృత విధనాల వల్ల "మొబైల్ విప్లవం"బయలుదేరింది.సెల్ పోన్ లు
వచ్చిన తరువాత మనుషుల మధ్య దూరం పెరగసాగింది.మనుసులు విప్పి మాట్లాడటం
లేదు.ఉత్తరం ఎప్పుడో ఉత్తర దిక్కుకు పారిపోయింది."సెల్ పోన్
పలకరింతలు"ఎక్కువయ్యాయి.దీనినిచిత్రిస్తూ రచయిత అభివృద్ది మాటున మానవ
సంబంధాలు ఎలా చిధ్రం అవుతున్నాయో "ఎస్సెమ్మెస్"కవితలో ప్రతిభావంతంగా
వ్యక్తీకరించారు.

ఏ రంగుల ప్రపంచంలోనో విహరించే నేను
నా మాటల యత్రం శబ్దానికి
ఉలిక్కిపడి మేల్కొంటాను
సంకేతాల నందు కోవడంలో రాత్రిని మించిన జాణ లేదు

ఇలా కవితను ఎత్తుకొని హృదయంతో మాట్లాడుకోవాలని అంటాడు.

తుషారమంతా అమాయకంగా
ఇక హృదయంతో మట్లాడు కుందాం
ఒక అందమైన స్వేచ్చ భావ ప్రపంచంలోకి ఎగిరిపోదాం

అంటూ కవితను ముగిస్తాడు.


రచయితకు భాల్యం పట్ల మమకారం ఉంది. చిన్నప్పటి స్నేహాలను,దొంగిలించిన
గోలీలను "వరదపూలు" కవితలో చూపిస్తాడు.

తడవడం భావుంటుంది....!
నీళ్ళలోనైన...కవిత్యంలోనైన

అంటూ నూతన అభివ్యక్తిని వ్యక్తికరిస్తున్నాడు.

ఈ సంపుటిలో ఉత్తమ కవిత :పుట్టిల్లు".వస్తువు రిత్యా,శిల్పరిత్యా కొత్త
పుంతలు తొక్కిన కవిత.

అమ్మ వెళతానంటుంది
ఇష్టం లేని బల్లోకి పిల్లాడిని పంపిస్తే
అక్కడ వాడు మారాం చేసినట్టు
అమ్మ తన పుట్టింటికి వెళతానంటుంది.
......................

అన్ని క్షణాలు మాకోసం త్యాగం చేసి
చివరికిలా మిగిలిపోయిన అమ్మ ఋణాన్నేలా తీర్చుకోవడం
అమ్మకు నాన్ననై పుడితే తప్ప ....!



మొత్తానికి బెల్లంకొండ రవికాంత్ "మంచుపూల వెన్నెల" మనల్ని హృదయాంతరాల్ని
తాకుతూ మంచుపూల వెన్నెల్లో తడిపేస్తుంది. ప్రతి ఒక్కరు చదవవలసిన మంచి
కవితా సంపుటి ఇది.




(ప్రతులకు:ఎ-26 యూనివర్సిటీ ప్యాకల్టీ క్వార్టర్స్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
గచ్చిబౌలి -హైదరాబాద్)

Reply all
Reply to author
Forward
0 new messages