ఒక తాత్వికుడు

26 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Mar 31, 2008, 3:30:54 AM3/31/08
to తెలుగు సాహిత్య వేదిక
ఒక తాత్వికుడు


రెండు కన్నీటి చుక్కలు
కళ్ళలోకి దిగులు ఒంపుకొన్న చూపులు
బక్క చిక్కిన శరీరం
భారమైన హృదయం
కఠినమైన జీవితపు నడక
వెరసి వీదిలో బ్రతికే కళేబరం
చేతిలో సత్తు గిన్నెతో
చిల్లర నాణేల నాట్యం
దర్మాత్ముల హృదయాల లోకి నిశ్శబ్ద ప్రసారం
చేసే అసహాయపు ఆకలికేకలు
ఎవరిని నోరుతెరిచి అడగని సంస్కారం
పేవ్ మెంట్ నె నమ్ముకొన్న జీవితపు ఏకాకితనం
అతడేం బిక్షకుడు కాదు
అనుభవాల సారంలో పండిన ఆత్మ
అందకారాన్ని వెక్కిరించే నిలువెత్తు పుస్తకం
అటువైపు నేనెప్పుడు వెళ్ళినా
ఒక మంచి తాత్వికుడిని చూస్తాను
నా నాగరికతను సహాలు చేసే
ఒక అతీంద్రియ శక్తి అతని కనుల్లో
నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది
అతడు జీవితపు తత్వాన్ని నిశ్శబ్ద సంగీతంలా
ప్రసారం చేస్తునే ఉంటాడు.

Reply all
Reply to author
Forward
0 new messages