తెలంగాణ బతుకులకు"మూలకం"

30 views
Skip to first unread message

వెంకటేష్

unread,
Feb 15, 2008, 2:45:05 PM2/15/08
to తెలుగు సాహిత్య వేదిక
తెలంగాణ బతుకులకు"మూలకం"









హృదయాన్ని స్పందింపచేసే కవులు కొందరే ఉంటారు.వారిలో కొందరు మాత్రమే
ప్రత్యేక భావజాలంతో,నూతన అభివ్యక్తితో కవిత్వాన్ని రాస్తారు.వారు
మనుషులను జాగృతం చేస్తారు. వారి లక్ష్యం సమ సమాజ నిర్మాణం.విశ్వమానవ
కళ్యాణం.ఈ రకం కవులలో చెప్పవలసిన కవి ఎస్.హరగోపాల్.నిశితమైన చూపు,పదునైన
భావజాలం ఉన్నవాడు.


హరగొపాల్ కవిత సంకలనం "మూలకం" ఈ విషయాన్ని మరింత ముందుకు
తీసుకువెలుతుంది.మనిషి తన స్వప్నమని ప్రకటిస్తూ వస్తున్న కవి,ఆధునికుడు
హరగోపాల్ .కవి అంటే గాయం గుండే.కవిత్వం అంటే గాయాల గొంతుక.హరగోపాల్ గుండే
గాయాన్ని గురుతుపట్టిన కవి.ఈ కవి తన కవిత్వానికి మనిషిని కేంద్రబిందువుగా
చేసుకున్నాడు.మనషే తన కల అంటున్నాడు.హరగోపాల్ పల్లెల మట్టి వాసన తెలిసిన
వాడు.పల్లెలను కళ్ళార చూస్తున్నవాడు.


వట్టిపోయినా పల్లెలను,ఎడారిగా మారిపోతున్న పల్లెవిషాదాలను తెలంగాణ
వలసలను,పొట్టచేత పట్టుకొని వలసవెళ్ళే నిత్య సన్నివేషాలను చిత్రిక
పట్టాడు.

"ఊరికి తలుపులెక్కడి విప్పుడు
చప్పుడు చేయడానికి?
అంతా వలసేనాయే!
దిగులుపరచుకుపోయిన దిబ్బెనాయే!
కరువు మీద కరువు దెబ్బేనాయే!"


ఈ కవిత సంపుటిలో మొదటి కవిత "తలుపు చప్పుడు".మాట స్పర్ష కోసం ఎదురుచూసే
మూగవేదనంతా ఆవిష్కృతమైంది ఈ కవితలో.....
"పాలిచ్చేయాల్లకు అమ్మొచ్చిన సంతోషం
కాడ మల్లెపూలు ఒల్లో దాసుకున్నంత మురిపెం
నువ్వొస్తె!!"

"నువ్వొచ్చి కండ్లముందర
ఒక్కఒద్దన్న వుంటేనే నాకు నిమ్మళం"

"కుక్కపిల్లై నామనసు నిన్ను పసిగడ్తు
దినాలు గడుపుతుంటుంది"

నువ్వొస్తవో.....రావో.....

యుగళగీతం అను కవితలో కొత్తగా,పదునైన కత్తిలా సత్యాన్ని ఎలా
ప్రతిపాదిస్తున్నాడో చూడండి.

"పాదాలు రెండు కుక్కపిల్లలు
దారినెపుడు మరిచిపోవు
మనసు ప్రవహించగానే విశ్వాసంగా
గమ్యానికి చేరుస్తాయి"








Reply all
Reply to author
Forward
0 new messages