STU Warangal
unread,Jan 21, 2013, 1:09:12 PM1/21/13Sign in to reply to author
Sign in to forward
You do not have permission to delete messages in this group
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to stu...@googlegroups.com
నియామకపు ఉత్తర్వులు అందిన 15 రోజు ల్లో విధుల్లో చేరాలి.
విధుల్లో చేరిన వెంటనే సర్వీస్ రిజిస్టర్‌ను ప్రారంభించాలి.
ఇదివరకే ఎస్జీటీ తత్సమాన క్యాడర్‌లో పనిచేస్తూ స్కూల్‌అసిస్టెంట్‌గా నియమితులైన వారు సంబంధిత క్యాడర్ నుంచి రిలీవ్ అయి కొత్త పోస్టుల్లో చేరాలి.
నూతన ఉపాధ్యాయులకు ఎస్జీటీ, పీఈటీలకు రూ.10,900-రూ.31,550 పే స్కేల్ ఉంటుందని, ప్రారంభ వేతనం రూ.10,900 ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860-రూ.39,540 పేస్కేల్‌తో రూ.14,860 మొదటి నెల వేతనం ఉంటుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం.
ఏటా (జనవరి, డిసెంబర్)సాధారణ సెల వులు 15రోజులు, ప్రత్యేక సెలవులు 7రోజులు, మహిళలకు అదనపు సెలవుల కింద 5రోజులు ఉంటాయి. నూతనంగా విధుల్లో చేరినప్పటి నుంచి సర్వీస్‌ను దమాషా ప్రకా రం పితృత్వ సెలవులు, ప్రత్యేక సాధారణ సెలవులు ఇస్తారు. క్యాజువల్ లీవ్‌ను అసిస్టెంట్ టీచర్లకు ప్రధానోపాధ్యాయులు, హెచ్‌ఎంలకు, ఎంఈవో లేదా ఉప విద్యాధికారి మంజూరుచేస్తారు.
సంవత్సరానికి 20అర్ధవేతన సెలవులు, రెం డేళ్ల తర్వాత సర్వీసు క్రమబద్ధీకరణ చేస్తారు.
{పతీ ఆరుమాసాలకు రెండు రోజుల చొప్పున ఏడాదికి నాలుగు ఆర్జిత సెలవులు ఇస్తారు. సర్వీసు క్రమబద్ధీకరణ జరిగిన తర్వాత మిగిలిన రోజులు జమ అవుతాయి.
{పత్యేక సందర్భాల్లోనూ సెలవులు వినియోగించుకునే అవకాశ ముంది.
180 రోజులు ప్రసూతి సెలవులను ఇద్దరు పిల్లల వరకు మంజూరు చేస్తారు. ఈ కాలంలో ఏ నెలకు ఆ నెల వేతనం చెల్లిస్తారు. ఇందుకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
భార్య కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స సమయంలో భర్తకు ఏడురోజులపాటు వేతనంతో కూడిన సెలవు మంజూరుచేస్తారు.
ఉద్యోగంలో చేరిన అనంతరం ఉద్యోగి అతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు నిమ్స్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందితే రూ.2లక్షల గరిష్ట పరిమితిలో రీయింబర్స్‌మెంట్ వస్తుంది.
విధుల్లో చేరిన వెంటనే ఉద్యోగులు ఐడీ కోసం మూడు సెట్లను ట్రెజరీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.