కదలి సాగుదాం..కలసి సాధిద్దాం...అద్బుతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం..
ప్రపంచాన్ని తన లోతైన ప్రవచనాలతో కదిలించిన కొదమ సింహం.. విద్వేషాలతో విడిపోతున్న జనులకు విశ్వమానవ మతాన్నిపరిచయం చేసిన విజ్ఞాన విహంగం..
మనిషి ఎలా జీవించాలో ఎలా ఆలోచించాలో నిగ్గు తేల్చిన నిప్పు రవ్వ..
బానిసత్వంలో అలసత్వంతో మగ్గుతున్న భారత యువతను స్వాతంత్ర సాధన వైపు నడిపిన స్ఫూర్తి ప్రధాత.. ముప్పైతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించి మూడువందల తొంబై సంవత్సరాల సమానమైన సేవ చేసిన మహా నాయకుడు... ఆయనే..అనన్య అసమాన్యుడు.... ఆయనే..స్వామి వివేకానంద..... ఆయన పేరు వింటేనే ఆత్మ విశ్వాసం నిద్ర లేస్తుంది.. ఆయన వ్రాసిన అక్షరాలు చదివితేనే సాధించాలనే ఉద్రేకం ఉప్పెనవుతుంది.. ఊహ కందని మేదస్సు అయన సొంతం.. పరిపూర్ణమైన దేశభక్తి అయన ఆసాంతం.. దనానికి దాసుడవ్వలేదు... మోహాలకు తావివ్వలేదు.. దురలవాట్లకు బానిసవ్వలేదు... యువశక్తి ఈ దేశాన్ని మారుస్తుంది అని ఎలుగెత్తి చాటిన పరమహంస ప్రియ శిష్యుడు.. శిధిలమవుతున్న భారత సంస్కృతిని తన అమృత వాక్కులతో నిలబెట్టిన ఆరాధ్య పురుషుడు.. అటువంటి స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనందరి అదృష్టం.. ఆయన రచనలలో ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం.. ఆయన సలహాలలో ఎన్నో సమస్యలకు సమాధానం.. ప్రతి భారతీయుడు తప్పక చదివి పాటించాల్సినవి అయన సూచనలు.. ప్రతి యువకుడు విధిగా నేర్చుకోవాల్సినవి అయన నిర్దేశాలు.. మనము ఆచరించవలసిన జీవన శైలికి... మన ప్రతి జాతీయ సమస్యకు... భారతీయ యువత ఔన్నత్యానికి.. విశ్వానికి నాయక గా మన దేశాన్ని నిలపటానికి.. కావలసిన నిఘంటువు...స్వామి వివేకానంద..... ఇకనైనా కళ్ళు తెరుద్దాం.. అయన మనకిచ్చిన అపార విజ్ఞాన సంపదను గుర్తిద్దాం.. ఆ మహానుబావుని కలలు నిజం చేద్దాం... కదలి సాగుదాం..కలసి సాధిద్దాం...అద్బుతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం..