రాళ్ళతో
కొడితే పారి పోయెను ఒకడు
ఆ
రాళ్ళనే ఏరి దుర్గాన్ని కట్టె నొకడు
రాళ్ళతో
కొడితే పారిపోయేవాడు పిరికివాడు
ఎదురు
తిరిగే వాడు మొండివాడు
ఆ
రాళ్ళనే ఏరి విజయం అనే దుర్గాన్ని కట్టేవాడు నిజమైన నాయకుడు
ఇతరులను
దోచుకొని సంపాదించటం రాక్షస తత్వం
తనచుట్టూ
గిరిగీసుకొని బ్రతకటం స్వార్ద తత్వం
తనివ్వ
గలిగినది పంచుకొని జీవించటం మానవత్వం
సేవా
తత్వాన్ని నింపుకొని అందరినీ ఆదుకోవటం దైవత్వం
మానవత్వం
దైవత్వం కలిసి ఉండటమే నాయకత్వం
నిద్రలో
వచ్చే కలలకు తృప్తి పడేవాడు నిద్ర బోతు
పగటి
కలలతో కాలక్షేపం చేసేవాడు సోమరిపోతు
కలలను
కర్తవ్యాలుగా మార్చుకొనేవాడు కాల జ్ఞాని
కలలకోసం
నిద్రనే త్యాగం చేసేవాడు మార్పు ప్రతినిధి
కర్తవ్యాన్ని
మంచి మార్పుకోసం కొనసాగించేవాడు సంఘ సంస్కర్త
నీవు
ఉన్నతంగా ఎదగటానికి నీకు ఈ సమాజం కావాలి
నీవు
ఎదిగిన తరువాత ఈ సమాజానికి నీవు కావాలి
నీ
ముందుతరాలకు నీవు మంచి సమాజాన్ని అందించాలి
నీవు
పోయినతరువాత కూడా ఈ సమాజం నిన్ను గుర్తుంచుకోవాలి
అందుకే
ఈ సమాజం నీకోసం ఎదురు చూసేలా నీవు ఎదగాలి
---- ప్రొ. వంగపల్లి విశ్వనాధం
మరియు శ్రీ. సయ్యద్ రఫీ గార్ల ఉపన్యాస స్పూర్తి తో...