For those who can read Telugu

2 views
Skip to first unread message

R V Rao

unread,
Jul 15, 2026, 2:33:51 AM (yesterday) Jul 15
to societyforservingseniors
🔔 *సరదాగా...* 🔔

*అవధానంలో అప్రస్తుతం*

🙂🙂🙂

అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా  సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను. మీరూ ఆనందిస్తారు కదా అని.



*1.ప్రశ్న* :-అవధానం చేసే వారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో.. 
*జవాబు* :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు కారం అట్లంటేనే ఇష్టం* 

*2. ప్రశ్న* :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి? 
*జవాబు* :- పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే *స్లో...కమ్* కదా 

*3 ప్రశ్న* : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది. 
*జవాబు* :– పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’ 

*4. ప్రశ్న* :-ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారు. 
*జవాబు*:- ఇంతకీ ఏ కవి *'తలను'* తీసికెళ్తున్నారు 

*5.ప్రశ్న* :-పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి? 
*జవాబు* :-అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం.  

*6 ప్రశ్న* :-అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు? 
*జవాబు* :-దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను 

*7. ప్రశ్న*:- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, అశ్రువులు ఎప్పుడొస్తాయి. 
*జవాబు* :- ప్రశ్నవేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే అశ్రువులు వస్తాయి. 

8. ప్రశ్న* :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు? 
*జవాబు :-* రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి. 

9. ప్రశ్న* :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? 
*జవాబు* :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు (రంభాఫలం) అని అర్థం. 

*10. ప్రశ్న* :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా...
*జవాబు* :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. 

*11. ప్రశ్న* :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు. 
*జవాబు* :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమంటాను. 

*12. ప్రశ్న* :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా. 
*జవాబు* : - ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు 

*13 ప్రశ్న*:-అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడు ధరించే వస్త్రం ఏమిటి? 
*జవాబు* :- ఈశ్వరుడు కనపడేలా  కో 'బ్రా' ను మెడలో ధరిస్తాడు 

*14. ప్రశ్న* :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట.. నిజమా? 
*జవాబు* :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది. 

*15. ప్రశ్న* :- పావురం అంటే మీకు ఇష్టమా...
*జవాబు* :- పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు 

*16. ప్రశ్న* :- మీరు సారా త్రాగుతారా.
*జవాబు* :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను. 

*17. ప్రశ్న* :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? 
*జవాబు* :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి. 

*18. ప్రశ్న* :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా.. 
*జవాబు* :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద కాబట్టి.


*19. ప్రశ్న*: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? 
*జవాబు*:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి. 

*20. ప్రశ్న*:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు? 
*జవాబు*:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా. 

*21. ప్రశ్న*:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు? 
*జవాబు*:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’ 

*22. ప్రశ్న*:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు?
 *జవాబు*:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను. 

*23. ప్రశ్న*:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?
*జవాబు*:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి మీదే పురుషులు ఆధారపడుతారు గనుక. 

*24. ప్రశ్న*:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు.
*జవాబు*:- గొడవపడితే మాట్లడదేమోనని
భయపడేవాడు ప్రేమికుడు..
మాట్లాడితే గొడవ పడుతుందేమోనని
భయపడేవాడు భర్త...

*25 ప్రశ్న*:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?
*జవాబు*:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే... 
'కీర్తి' అమ్మాయి పేరు, 
'శేషు' అబ్బాయి పేరు.

*26. ప్రశ్న*:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరు గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? 
*జవాబు*: - *‘ఆపిక’* వెంటనే అవధాని సమాధానం.

దీనితో చాలిక…..

🙏🏻🙏🏻🙏🏻🙂🙂🙂🙏🏻🙏🏻🙏🏻

Seshadri Vellimedu

unread,
Jul 15, 2026, 9:31:59 AM (yesterday) Jul 15
to R V Rao, societyforservingseniors
😇😆😉😀😊😄
Thanks to Rao for sharing.

--
You received this message because you are subscribed to the Google Groups "societyforservingseniors" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to society4servingse...@googlegroups.com.
To view this discussion, visit https://groups.google.com/d/msgid/society4servingseniors/CAPVuisXLe45RLYuyKk0vYPCsfZCHJOiu1y9i3EG%3DFRBCMtudQA%40mail.gmail.com.
Reply all
Reply to author
Forward
0 new messages