ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు.
రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది. భార్యకి ఈ-మెయిల్
పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి
పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే
తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప
సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్
చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు. ఆ ఈ-మెయిల్ సారాంశం.
ప్రియమైన భార్యామణీ!
విషయం: నేను చేరుకున్నాను.
తేది:10th ఆగస్ట్, 2009
నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన
ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు
కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను.
రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు
కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా
జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ…
నీ ముద్దుల రేడు
xxxxxxxxx