మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు
--------------------------------------------------------
సరదాల సంక్రాంతి వచ్చేసింది.. తెలుగులోగిళ్లు పండుగ శోభతో... కళకళలాడుతున్నాయి.. తొలిరోజైన భోగి వేళ ఊరూవాడా మంటలు వేసి.. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు.
బోగి మంటలు : బోగి పండుగ రోజు తెల్లవారుజామున ప్రతి ఇంటిముందు బోగిమంటలు వేస్తారు. ఈమంటలలో పాత అంతటిని తుడిచి పోగేసి తగలేసి ''ధుని'' లేక యజ్ఞకుండమే ఈ బోగిమంటలు. అంటే! పాతను విసర్జించి కొత్తకు స్వాగతం పలుకుతాయి. ఈ మంటలలో వేసిన గోమయంతో చేసిన గొబ్బి పిడకలు పొగ ఉపిరితిత్తుల వ్యాధిని నిరోధిస్తాయంటారు వైద్యులు. ఈ రోజు గొబ్బి పిడకలు మంట వద్ద శరీరమును కాచుకొని, నల్ల నువ్వుల ముద్దతో నలుగు పెట్టుకొని తలంటిస్నానం చేసి, కొత్తబట్టలు ధరించాలి. దగ్గరలో ఉన్న దేవాలయమునకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, నల్ల నువ్వుల దానమివ్వాలి.
-----------------------------------------------------------------------------
బోగిపళ్ళు: బోగిరోజున బోగిమంటల్లాగే సాయంత్రం చంటి పిల్లలు ఉన్నవాళ్ళు పళ్ళెంలో రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, పూలరేకులు కలపి పిల్లలకు దిష్టితీసి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపళ్ళు పోయించుకున్న చిన్నారులు కలకాలం బోగబగ్యాలతో తులతూగుతారని మన పూర్వికుల నమ్మకమైన ఆచారం. పసిపిల్లలకు తలపై రాగి దమ్మిడీలు (రాగి పైసలు) పెట్టి నుదుట, బొట్టు పెట్టి దీవించి ఈ బోగిపళ్ళు పోస్తారు.
--