సమత్వస్థితి

6 views
Skip to first unread message

sat sangamu

unread,
Mar 23, 2016, 1:06:37 AM3/23/16
to sat-sangamu

సమత్వస్థితి

మానవులు అందరు కోరుకోనేది సుఖమునే. కాని సుఖము, శాంతములేక లభించదు. శాంతము సమత్వభావన వలన ప్రాప్తిస్తుంది. సమత్వభావన దైవీసమర్పణ భావనతో జీవించుట వలన అలవడుతుంది. అజ్ఞానముతో మానవులు సుఖము జగత్తులోని బాహ్యవస్తువుల వలన లభిస్తున్నది అని భ్రమిస్తున్నారు. నిజమునకు ఆ సుఖము మనలో జ్ఞాపకముల రూపములో లేక స్మ్రుతి రూపములో ఉన్నది. అవి వ్యక్తమవుటకు  అనుకూల వాతావరణము లభించిన వెంటనే  వ్యక్తీకరించ బడుచున్నవి.  మనలోని భావనల దృష్ట్యా జగత్తులోని వస్తువులను చూస్తూ, ఆ వస్తువుల ద్వారా సుఖము లభిస్తున్నది అని భ్రమిస్తున్నాము. మన స్మృతిని పరిశీలించి, సమత్వభావనను నెలకొల్పిన ఈ భ్రాంతి నుండి  బయటపడతాము.

సమత్వము సృష్టి ధర్మము. మనము సాధన ద్వారా మొదట సమత్వమును సాధించవలెను.  వ్యతిరేకమైన పరిస్థితిలో జీవించుట ద్వారా సమత్వమును సాధించుట సులువు. వ్యతిరేఖ పరిస్థితులలో నీ బలహీనతలు  నీకు   స్పష్టముగా తెలియబడతాయి,  నీవు వాటిని గుర్తించి సరిదిద్దుకోగలుగుతావు.  కనుక నీకు వ్యతిరేఖ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా అవి దైవము లేక సృష్టి నీకు అనుగ్రహించిన వరముగా భావించి, నీ బలహీనతలను సరిదిద్దుకొని, సమత్వమును అలవరచుకో. సత్వగుణము కలవారికి అనుకూల పరిస్థితులు కల్పించుట ద్వారా, రజో తమో గుణములు కలిగిన వారికి వ్యతిరేఖ పరిస్థితుల కల్పించుట  ద్వారా సృష్టి పరిణామమును  కలుగజేస్తుంది. వ్యతిరేక పరిస్థితులలో నీవు ఇబ్బంది పడతావు గనుక నీవు విచారణ చేసి  త్వరగా వాటినుండి బయట పడటానికి ప్రయత్నిస్తావు. అనుకూల పరిస్థితులు పుణ్యఫలము వలన కలుగుతాయి మరియు సుఖమును కలుగజేస్తాయి. సుఖాపేక్షచే వాటిలో పడి కొట్టుకొని పోబడతావు.  ఎంతో అప్రమత్తముగా ఉంటే తప్పించి  అనుకూల పరిస్థితుల ద్వారా గుణపాఠము కలుగుట కష్టము. ఎక్కువ మంది విషయములో అనుకూల పరిస్థితులలో జీవిస్తున్నంతకాలము  బలము బలముగానే ఉంటుంది, బలహీనత బలహీనతగానే ఉంటుంది.

గుణములు, స్వభావమును గుర్తించి, ఎదిరించి అధిగమించిన వాడు సాధకుడు అవుచున్నాడు. గుణ, స్వభావ ప్రేరణలచే నడిపింపబడి జీవించుచున్న వాడు అజ్ఞానిగానే మిగిలిపోవుచున్నాడు. కనుక నీలో ఉన్న స్వభావమును, అందులోని బలములను, బలహీనతలను మొదట గుర్తించాలి. బలహీనతలకు వ్యతిరేఖమైన ఆచరణను ఆచరించుట ద్వారా వాటిని  అధిగమించి సమత్వస్థితిని అందుకోవాలి.

Reply all
Reply to author
Forward
0 new messages