కంచి పరమాచార్య భోజనం చేస్తూ బాగుంది అన్నారు ఒకసారి .. తోటకూరపప్పు బాగుంది అన్నారు అని వంటచేశేవారు వరుసగా వారం అంతా తోటకూరపప్పు వండారు .. మఠం లో అందరూ ప్రశ్నించడం .. పరమాచార్య కు ఇష్టం అన్నారు .. కడకు పరమాచార్య ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది .. ఒకసారి బాగుంది అంటేనే .. ప్రకృతి తో సంగత్వం .. స్మృతి .. బంధం ఏర్పడి పునరావృత్తి కలిగిస్తుంది .. మన జీవితం లో ఎన్నింటిని ఎన్నిసార్లు బాగుంది అని అనుభవించి .. ద్వంద్వాతీతము అవ్వాలంటే ఏస్థాయి వైరాగ్యం ఉండాలి .. జీవితం ఎలా ఉండాలి ?