Saadhana chathushtayam లో ఏది ముఖ్యం ..

7 views
Skip to first unread message

sat sangamu

unread,
Mar 21, 2016, 1:10:45 PM3/21/16
to sat-s...@googlegroups.com

SWAMY: నిత్య అనిత్య వస్తు వివేకం .. ఇహాముత్రార్ధఫలభోగ విరాగం ..
శమాదిషట్కసంపత్తి ..
ముముక్షత్వం ..
వీటిలో ఏది ముఖ్యం .. ఇవి ఒకటి మరొక దానికి పూరకం ఎలా .. ఆలోచించండి

నిత్యానిత్య వస్తు వివేకం వలన జీవభావం తాత్కాలికమని .. శాశ్వతము ఆత్మ యని దృఢీకరణ గురువాక్యం చేత నిర్ణయించి .. ఆరూఢం అగుటకు .. నిత్య జీవితం లో ఇహాముత్రార్ధఫలభోగ విరాగం చేత రాగద్వేషాలకు అతీతంగా .. గురుకృపావిశేషం చేత శమాదిషట్కసంపత్తిని పొంది .. శమించిన అంతఃకరణముతో .. దమించిన జితేంద్రియత్వముతో .. ఉపరతి చే సదా  ఆత్మచైతన్యాన్నే గుర్తిస్తూ భేదబుద్ధి విడనాడి .. తితీక్షచే ఆగామి రహిత పధ్ధతి గా ప్రారబ్ధం అనుభవించి రద్దు చేసుకునే విధానం ఆశ్రయించి .. సాక్షీభావమైన ఆత్మ యందు లక్ష్యించిన ఉత్తమ మైన .. సాత్వికం అయిన శ్రధ్ధచే ఆధార ఆధేయ విమర్శ చే జనన మరణ పర్యంతమూ చక్కగా శీలించి .. తాను సర్వ సాక్షి .. సర్వ వ్యాపకుడు .. పరిణామం లేని శాశ్వతము అయిన ఆత్మ అని సమాధానం పొంది .. సాయుజ్యము అనే ఉత్తమ ముక్తి ని పొందాలి అనే లక్ష్యం తో తీవ్ర మోక్షేఛ్ఛచే బ్రహ్మాకారవృత్తి ని ఆశ్రయించుట ముముక్షత్వం .. ఇట్లు  తిరిగి రాని పధ్దతి ని సాధకుడు అనుసరించి కైవల్యమందుటకు ఈ సాధన చతుష్టయం పునాది .. హరిఃఓం

Reply all
Reply to author
Forward
0 new messages