ఆప్తుడు - ఆప్త వాక్యము

6 views
Skip to first unread message

sat sangamu

unread,
Apr 24, 2016, 5:00:30 AM4/24/16
to sat-sangamu

ఆప్త వాక్యము
అంటే మన మేలు కోరి చెప్పే వారి
వాక్యాలన్నమాట కానీ ప్రాపంచిక
విషయాలలోకాక ఆధ్యాత్మికంగా
ఆరితేరి సాధన సంపత్తిని
పూర్తిగా పొంది వేదార్ధాన్ని
గ్రహించి 
ఆద్యాత్మిక మార్గాన అనుభవాల
ను పొందియుండి మనమీద
అనుగ్రహం తో మనశ్రేయస్సుకై
పలుకబడిన వారి వచనాలే
ఆప్త వాక్యాలు
ఇవి కూడా వేదవాక్యాలే
అదృష్టం వుంటే కానీ వారి
దర్శనం కలుగదు
లభించినా వారి అనుగ్రహం
సంపాదించటం ఇంకా కష్టం

అట్టి అనుగ్రహరూప వాక్యాలే
ఆప్త వాక్యాలు
వేదాలు చెప్పి వూరుకుంటాయి
కానీ ఆప్తుడు చెప్పుతాడు
చేయిస్తాడు సవరిస్తాడు
ఆపత్కాలంలో రక్షిస్తాడు
అన్నివిధాలా తోడ్పడి
అభివృద్దికి తెస్తాడు

ఆప్తుడు తోడూ నీడా ఆప్తుడు
లభ్యం కావటం పూర్వ జన్మ
పరిపాకం

Reply all
Reply to author
Forward
0 new messages