మెహెర్‌ బాబా వారి నవజీవన సారం... పాట రూపంలో....

5 views
Skip to first unread message

sat sangamu

unread,
Aug 29, 2017, 1:18:31 AM8/29/17
to sadhakudu, sat-sangamu
మెహెర్‌ బాబా *నవజీవనము* సారం

*ఆలకించు మెహెరు బాబా*

ఆలకించు మెహెరు బాబా,
మౌనవాణి ప్రేమిక !
అందులోన గలదు సుమా, 
సాధకుల కథామాలిక !!

నవజీవనమును గడుపుటయే 
నిశ్చయముగా నీ ఆశయమా...?
త్యజియించును క్షణ భంగురమౌ...
అస్తిత్వము హృదయము నుండి!

!! ఆలకించు మెహెరు బాబా !!

దేవునిపై భారం వేసి,
నీ జీవన గతిని వరించా!
ప్రమాణాల శక్తియే అండ...
ప్రాప్తించగా మా ఆశయం!! - 2

ఆపాదలను ఆహ్వానిస్తూ
ఆనందంగా పాడుతున్నాం - 2
ఆశా రహిత స్థితిని వరించి...
ఆలోచనలు మానుకున్నాం !!

!! ఆలకించు మెహెరు బాబా !!

తీరని వాగ్దానం మరిచాం,
కరిగిన ఆశలను సహించాం!
ఆశించము సత్కారాలను,
గర్హించము అవమానాలను!! - 2 

పరనిందల పదమే మరచి,
భయమును యెద పారద్రోలాం -2 
ఇదియే నవజీవన వర్ణం
ఎంచుకున్న మానవ మార్గం 

!! ఆలకించు మెహెరు బాబా !!

మనసుల్లో మౌఢ్యం లేదు,
వెంటపడే బంధాల్లేవూ!
గర్వము, అత్యాశ, క్రోధము...
కామమంటే ఏమో తెలియదు!! - 2

మతము లేదు, మంత్రము లేదు
ఛాందసాల ఛాయలు లేవు - 2
బ్రాహ్మణుడు, ముస్లిం ఒకటై...
ఒకే పడవ పయనించారు 

!! ఆలకించు మెహెరు బాబా !!

అధికులెవరు? అల్పులు ఎవరు?
అసలు మాకు తేడా లేదు!
గురుశిష్యులు, దైవత్వం అను...
ప్రశ్నలకిక తావే లేదు!! - 2

సమభావం, సౌభ్రాతృత్వం..
అవే మమ్ము కలిపే బంధం - 2
బాధలలో సంతోషంగా...
ఉంచడానికవే ఆధారం!!

!! ఆలకించు మెహెరు బాబా !!

ఇహం-పరం, స్వర్గ-నరకముల...
ఆరాటాలసలే లేవు!
అద్భుతాలు, శక్తులు, సిద్ధుల...
ఆలోచనలే ఇక రావు!! - 2 

అసత్యమగు ఆలోచనలను...
మనసు నుండి మాయం చేశాం - 2
వర్తమానమందే మనుగడ
పటిష్ఠంగా స్వీకరించాం!! - 2 

!! ఆలకించు మెహెరు బాబా !!

మీ అందరి స్థాయికి చేరి,
మీతో ఇపుడొకటై ఉన్నా..
సత్వరమే... సంకోచించక...
నా ఆజ్ఞను పాలించాలి!!

ఓ ప్రేమికులార!
బాబా చెప్పు ఈ మాటలను,
జాగరూకులై గమనించుము!
మెహెరుబాబా మాటలను... 
జాగరూకులై గమనించుము!!

మీ అందరి స్థాయికి చేరి,
మీతో ఇపుడొకటై ఉన్నా!
సత్వరమే... సంకోచించక...
నా ఆజ్ఞను పాలించాలి!!

మంచి చెడు మీకసాధ్యమను...
భావన మది చేరనీయక - 2
ఫలితము భగవంతుని పరముగా వదిలి, 
ఆజ్ఞ పాలించాలి!!

!! ఆలకించు మెహెరు బాబా !!

మిన్ను విరిగి మీపై బడినా
విడువకెపుడు సత్యాధారం!
జీవనమును బీడుగ మార్చిన...
నిరాశ, నిస్పృహలలిమి!! - 2

రుక్తియు సంవృద్ధుల నీయడు
బీజములను మళ్ళీ నాటి - 2
బీడును చిగురింప జేసి,
పచ్చని అందాలను నింపును - 2

!! ఆలకించు మెహెరు బాబా !!

చిరునవ్వే పెదవుల చిందని,
గుండె కోతలకు గురియైనా...
దాగి ఉంది తెలియని పెన్నిధి
నిరుపేదవు నీ చేతుల్లో!! - 2

రాజులకును ఈర్ష్యాస్పదమై...
రాజిల్లును నీ జీవితమే! - 2
భిక్షాటన చేసి గడిపిన
నామాటిది విశ్వసింపుడు!!

!! ఆలకించు మెహెరు బాబా !!

దేవుని అస్తిత్వము సత్యము
ప్రవక్తలు నిజమని తెలియుము!
ప్రతిక్షణాన 'వలి' యొకడుండు
ప్రతియుగానికి ఒక అవతారుడు!! - 2

అయినా మా అందరి పాలిట 
ఆశారహిత నిస్సహాయతే - 2
అలాగాక నవజీవనమును...
ఎలాంటిదని నీతో చెప్పను?

ఆలకించు మెహెరు బాబా,
మౌనవాణి ప్రేమిక !
అందులోన గలదు సుమా, 
సాధకుల కథామాలిక !!

నవజీవనమును గడుపుటయే 
నిశ్చయముగా నీ ఆశయమా...?
త్యజియించును క్షణ భంగురమౌ...
అస్తిత్వము హృదయము నుండి!

ఆలకించు మెహెరు బాబా....!!

Reply all
Reply to author
Forward
0 new messages