పునరపి జననం పునరపి మరణం

180 views
Skip to first unread message

sat sangamu

unread,
Mar 27, 2016, 9:23:59 PM3/27/16
to sat-sangamu

పునరపి జననం పునరపి మరణం
జనన మరణ జన జీవన చక్రభ్రమణం
హరితొ సఖ్యం హరితొ లౌక్యం హరిలొ ఐక్యం

హరి నామ స్మరణకై జీవం ఆగమనం
హరి పాద సేవకై జీవితం సంసిద్దం
పూర్వ జన్మ భవ భయ హరణం
సంసారసాగర బంధ ధుఖ దివ్యపదం ||పున||

అహం క్రోధం మోహం శత్రు సంహారె
జ్ఞానం శాంతం బ్రహ్మం మిత్ర విహారె
సకల జీవులెల్ల సమభావ సేవాతత్పరం
సత్యం ధర్మం శివం ఆదర్శ జీవనం ||పున||

చివర శ్రీహరి శరణార్ధం శ్రీ సేవా సన్నిధానం
ఆత్మ తర్పనం పరమాత్మ సంతర్పణం
హరికై పయనం హరికై అర్పితం హరిలొ లీనం

హరీ... హరే...... హరే...... హరే......
... అన్నమయ్య




భజగోవిందం - 21

పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనం |
ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా౭పారే పాహి మురారే ||

మళ్లీ జననం, మళ్లీ మరణం, మళ్లీ మాతృగర్భంలో పడి ఉండడం. ఈ జన్మ సంసారచక్రభ్రమణం తప్పించుకోలేనంత దుస్తరమైనది. ఓ మురారీ! అపారకృపతో నన్ను ఈ సంసారంనుండి రక్షించు ప్రభో. !

జననమరణరూపమైన ఈ సంసారచక్రం జీవుని బంధించివేసి నిర్విరామంగా తిప్పుతూనే ఉంటుంది. జీవుడు తనంతట తానే వెళ్లి ఆ చక్రభ్రమణంలోకి ఆకర్షితుడై పూర్వకర్మ బంధనాలనబడే దారాలతో ఆ చక్రానికి కట్టేసుకుంటాడు. కర్మఫలాన్ని అనుభవిస్తుంటే ఆ దారపుపోగులు తెగుతున్నా కొత్త కర్మల వలన కొత్త దారపుపోగులు చేరుతుంటాయి. ఈ విధంగా బంధము కొనసాగుతూనే ఉంటుంది. దీనినుండి బయట పడడానికి మూడే మార్గాలున్నాయి..

ప్రారబ్ధకర్మలను ఈశ్వరానుగ్రహం భావంతో  అనుభవిస్తూ, భగవదర్పణ భావంతో, లోకకళ్యాణం గురించి నిష్కామకర్మలు చేస్తుంటే, పూర్వవాసనలు ఖర్చయి, కొత్త వాసనలు చేరకుండా ఉండి, వాసనాక్షయమవగానే సంసారచక్రం నుండి బయటపడవచ్చు.. "ఇది కర్మ యోగమార్గము"...

శ్రీహరి పాదపద్మాలకు నవవిధ భక్తి సాధనలతో
శ్రవణం,కీర్తనం,స్మరణం,అర్చనం, వందనం,సఖ్యం, దాస్యం, పాదసేవనం,ఆత్మనివేదనలతో
సేవజేసి భగవదనుగ్రహం వలన పూర్వకర్మల బంధం నుండి విముక్తి పొందడం ...
     " భక్తి యోగమార్గము"

వేదాంతశాస్ర్తాధ్యయనం అనగా ప్రస్థాన త్రయమనబడు భగవద్గీత, ఉపనిషత్తులు,బ్రహ్మసూత్రభాష్యం ద్వారా శ్రవణ, మనన, నిధిధ్యాసాది సాధనలతో నిరంతరం ఆత్మధ్యానం చేస్తూఉంటే ఆ జ్ఞానాగ్ని లో సకలకర్మలు కాలిపోయి, ముక్తిని పొందడం "జ్ఞానయోగమార్గము "....

జివునికి మాతృగర్భంలో పడినప్పుడు ప్రారంభమైన వేదనలు, మరణం తరువాత కూడ వెంటపడ్తూనే ఉండాయి. జన్మ దఃఖం, ఆధి వ్యాధులు దుఃఖం, వృద్దాప్యం దుఃఖం, రోగపీడలు దుఃఖం, మరణ దుఃఖం ఇవి కాకుండా అహంకార మమకారాల వలన కలిగిన దుఃఖాలు, దారిద్ర్యం, ఈతిబాధల వలన కలిగిన దుఃఖాలు, ఈ విధంగా దుఃఖ పరంపరలు జీవిని చిత్రహింసలకు గురిచేస్తాయి. అందుకే పునరపిజననం, పునరపి మరణం,ఒద్దుబాబోయ్  అని ప్రార్థిస్తాడు. "జన్మతోనే వస్తున్న ఈ దుఃఖాలు జన్మలేకుండా చేసుకుంటే కాని విడిచిపెట్టవు."  ఈ దుఃఖసాగరాన్ని దాటడానికి భగవానుని శరణు వేడడమే ఏకైక మార్గం..
భజగోవిందుని భజించు గోవిందుని భజించు అన్నారు.... అచార్యులవారు...

జై శ్రీరామ...

Reply all
Reply to author
Forward
0 new messages