ప్రభుని మరచితివేలే పాపపు మనసా...!
- కీ.శే. శ్రీ ఆదిపూడి సోమనాథరావు
ప్రభుని మరచితివేలే పాపపు మనసా, శుభ దృష్టితో నిన్ను జూచును గదవే?
why have you forgotten God, you sinful mind, while He looks after you so tenderly?
1. విభు దయ లేకున్న విశ్వములోన, విభవములేవైన విలసిల్ల గలవే?
Without the compassion of the Lord can anything great exist in the world?
ప్రభుని మరచితివేలే పాపపు మనసా...!
2. నీవు పుట్టకమున్నె నీకై దయతో కావలసినవెల్ల కల్పించె గదవే?
Even before you were born has He not out of love for you created every thing that you need?
ప్రభుని మరచితివేలే పాపపు మనసా...!
3. శరణని యా ప్రభు మరుగున జేర దరిలేని దుఃఖాబ్ధి దాటించు గదవే?
When one seeks His refuge, does He not help one cross this endless ocean of sorrow?
ప్రభుని మరచితివేలే పాపపు మనసా...!
4. తలపులోపల నుండి ధర్మమే జూపి పలు తెరంగుల నిన్ను పాలించు గదవే?
Does He not protect you in so many ways from within, showing you the right path always?
ప్రభుని మరచితివేలే పాపపు మనసా...!
5. కరుణాది సద్గుణగణమణి ఖనియై పరి పరి విధముల భాసిల్లు గదవే?
Being a treasure house of virtues such as compassion, is He not glorious in numerous ways?
ప్రభుని మరచితివేలే పాపపు మనసా...!