నా పేరు వెంకట్. పోయిన వారం కృష్ణగారితో మాట్లాడాను. కె.డి.ఇ ఫాంటు గురించి అడగ్గా, మీ పేరు చెప్పారు. మీరు పంపిణీ చేస్తున్న లేఔట్ని /usr/share/m17n లో పేట్టమన్నారు, కాని లినక్స మింట్లో లేఔట్లు /usr/share/X11/xkb/symbols లో ఉన్నాయి. అదే కాక, *.mim ఫైళ్ళు ఎలా ఇంస్టాల్ [ తేలుగులో దీనికి పదం తేలియలేదు :) ] చేయాలో తెలియలేదు. కనుక కె.డి.ఇ కి ఒక లేఔట్ తయారు చేద్దామయని నిస్చయించుకున్నాను.
ఆ ప్రయత్నం దాదాపు పూర్తి కావచ్చింది. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తుండగా, కృష్ణా గారి లేఔట్ కీ te-sarala.mim కీ కొన్ని తేడాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు క్రింద వివరిస్తాను.
దీర్ఝ వీరం, పూర్ణ వీరం అక్షరాలను మీరు ౨,౩ అంకెలకు జోడించారు. కృష్ణగారి లేఔట్లో ఆ రెండు అక్షరాలు \ | అక్షరాలకు జోడించబడ్డాయి.
ఆ రెండు అక్షరాలను అక్కడనుంచి \ | అక్షరాల పైకి మారిస్తే, అంకెల పైన చోటు ఖాళీ అవుతుంది. భిన్నాక్షరాలను, రూపాయి అక్షరాన్ని అంకెల పైకి మార్చొచ్చు.
సోది కోడుతున్నాడు అనుకోకపోతె, ఈ తేడాల వల్ల వినియోగదారులకు వచ్చు సమస్యోకటుంది. మేధాజననం వెబ్సైట్ లో ఉన్న కీబోర్డు ద్రుశ్యం చుసి తేలుగులో రాయడం నేర్చుకోడం వీలుకాదు. ఈ విషయం మీ దృష్టికి తీసుకురావడం సరని భావించి, ఇలా రాస్తున్నాను.
వెంకట్