సరళ లినక్స్ లేఅవుట్

6 views
Skip to first unread message

Venkatram Akkineni

unread,
Apr 27, 2017, 3:53:14 AM4/27/17
to Sarala Keyboard, krish...@yahoo.com
కృష్ణగారు.

మీతో మాట్లడిన కొన్ని నెలల తరువాత లినక్స్ లో సరళ లేఅవుట్ పూర్తిచేశాను. అప్పటి నుండీ అదే లేఅవుట్ను వాడుతున్నాను. చూస్తూనే మూడేళ్ళు గడిచిపోయాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ సమయం దొరకడం వల్ల ఈ లేఅవుట్ను xkeyboard-config లోకి చెకిన్ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. దానికి సంబంధించిన కోడింగ్ ఇప్పుడే పూర్తయ్యింది. xkeyboard-config వారు నా పుల్ రిక్వెస్టును స్వీకరిస్తారో లేదో తెలియదు కాని పుల్ రిక్వెస్టు పంపిన తరువాత మార్పులు చేయడం సమయం వ్యర్థం చేస్తుందని ముందే మీకొక మాట చెబుదామని ఇలా రాస్తున్నాను. కొన్ని ప్రశ్నలున్నాయి, మీ కొంచం సమయం ఉన్నప్పుడు సమాధానం చెప్పండి. 

  • మీకు సరళ అన్న పేరు మీద కాపీరైట్ ఉందా ? ఈ లేఅవుట్ కు కూడా సరళ అని పేరు పెట్టొచ్చా ? లేదా వేరే పేరు పెట్టమంటారా ? 
  • మేధాజననం వెబ్సైట్లో Creative Commons Attribution-NonCommercial-ShareAlike License. అని ఉంది. లినక్స్ వారు జీ.పీ.ఎల్ అడుగుతారేమో. అవసరమైతే లినక్స లేఅవుట్ను జీ.పీ.ఎల్ కు మార్చడానికి వెసులుబాటు ఉందా ? 
  • కీబోర్డు లేఅవుట్ కోడ్ను ఈ ఉత్తరానికి జోడించాను. దానిలో మీ పేరు ఉంది. మీ ఈమెయిల్ కూడా ఉంటే బావుంటుంది. వీలైతే మీ ఈ మెయిల్ పంపండి.
  • లినక్స లో కంట్రోల్, ఆల్ట్ జతను షార్ట్ కట్ గా వాడతారు. కనుక కొన్ని మార్పులు చేశాను. అందులో ముఖ్యమైనది ఆల్ట్, షిఫ్టులను మాత్రమే వాడడం. దానికి సంబంధించిన వివరాలు ఈ ఉత్తరానికి జోడించిన పీ.డీ.ఎఫ్ లో ఉన్నాయి. 

ఇప్పటి వరకూ ఉన్న కోడు, యూనీకోడ్ 8.0 ను సపోర్టు చేస్తుంది. యూనీకోడ్ 9.0 లో ఒక్క కొత్త అక్షరం () మాత్రమే జోడించారు. దానిని ఎలా పలకాలో తెలయదు కానీ ఇంగలీషులో (LLLA) గా రాశారు. 

ఇట్లు
వెంకట్.
LayoutText
SaralaKeyboardLayout.pdf
Reply all
Reply to author
Forward
0 new messages