పంచ యఙ్ఞాలు : Collected From www.srichalapathirao.com

0 views
Skip to first unread message

Jnani

unread,
Aug 23, 2018, 10:43:34 PM8/23/18
to

Om Sri Gurubhyonamaha

To Subscribe to our Whatsapp Group : https://chat.whatsapp.com/9F8HwCWfWlH4s4QvleNX00

పంచ యఙ్ఞాలు 
ఈ లోకంలో జన్మించిన అందరూ 5 ఋణాలతో ఉంటారు.  ఆ ఋణాలు తీర్చుకుంటేనే ఋణవిముక్తి - లేకపోతే ఆ ఋణాలు తీర్చుకోవటానికి మళ్ళీమళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే.   అంటే ఇవి ముక్తికి బంధకాలు, ముందరికాళ్ళకు బంధాలు.  

ఎవరెవరికి ఋణపడిఉన్నాము ?
దేవతలకు - ఋషులకు - తల్లిదండ్రులకు - తోటి మనుష్యులకు - భూతాలకు

ఎందుకు ?

1. దేవతలు - మనకు కావలసిన వాటిని ఇచ్చి పోషిస్తున్నారు.  భూమి, అగ్ని, వరుణ, వాయు, సూర్య, చంద్ర దేవతలు ఆహారాన్ని, శక్తిని, నీటిని, ప్రాణాన్ని, ప్రకాశాన్ని,... ఇస్తున్నారు.
2. ఋషులు - మనం తరించటానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చారు.  వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, .....
3. పితృ దేవతలు - తల్లిదండ్రులు శరీరాన్నిచ్చి పోషించారు.  అభివృద్ధిని కోరారు.  తల్లి 9 మాసాలు తన కడుపులో బిడ్డను మోస్తుంది.  కష్టం అనుకోదు.  ప్రసవవేదన భయంకరం, పుట్టిన తర్వాత మలమూత్రాలను అసహ్యించుకోకుండా అన్ని సమయాల్లో రక్షణ - తాము తినకుండా బిడ్డలకు పెట్టాలని చూస్తారు.  బిడ్డ భవిష్యత్తు కోసం ఎన్నింటినో వదులుకుంటారు.  వారికి ఋణం.
4. మనుష్యులు - తోటి మనుష్యులు కుండలు, బట్టలు, ఆహారం, .... ఇలా ఎన్నింటినో అందించి సహాయం చేస్తున్నారు
5.  భూతాలు - జంతువులు పొలాల్లో.. - పాలు పెరుగు నెయ్యి .... ఇస్తున్నాయి 

మరేం చేయాలి ఋణం తీర్చుకొనుటకు ?

1. దేవయజ్ఞం : పూజాదికాలు - యజ్ఞయాగాదులు
2. ఋషి యజ్ఞం : వేద విజ్ఞానం తెలుసుకోవాలి.  అందుకు గురువును చేరి శాస్త్రాలను శ్రవణం చేయాలి. వారు చూపిన మార్గాన్ని అనుసరించాలి.  గ్రంధ పఠనంలోను, గ్రంధ ప్రచురణలోనూ, గ్రంధ విక్రయంలోను, ప్రచారంలోనూ సాయపడాలి
3. పితృ యజ్ఞం : తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వారికి ఏలోటు లేకుండా చూడాలి.  వారి కోరికలను నెరవేర్చాలి.  వారికి సేవ చేయాలి.  భార్యా బిడ్డలతో సేవ చేయించాలి.  తనకు ఎంత కష్టమైనా ఇష్టంతో ఆనందంతో సేవించి సంతోషపరచాలి. మరణానంతరం శాస్త్రవిధి ప్రకారం కర్మకాండ జరిపించాలి.  పరలోకంలో వారితృప్తి కొరకు చేయవలసిన విధిని నిర్వర్తించాలి.
4.  మనుష్య యజ్ఞం : అతిధి సత్కారం - తోటి వారికి చేతనైనంతగా - ఏ రంగంలోనైనా సాయపడాలి.  డబ్బు - చదువు - వైద్యం - ఆత్మ జ్ఞానం - ఇలా సేవ చేయాలి
5.  భూత యజ్ఞం : పశువులకు గడ్డి - పక్షులకు ధాన్యపు గింజలు, మొక్కలకు నీరు ..... అందించటం.

Regards

ca...@srichalapathirao.com

Reply all
Reply to author
Forward
0 new messages