[అన్నమాచార్య కీర్తన] నెయ్యములల్లో...

1,108 views
Skip to first unread message

Sowmya V.B.

unread,
Jul 2, 2008, 8:54:08 AM7/2/08
to sahi...@googlegroups.com
అందరికీ నమస్కారం...

"శుభలేఖ" సినిమా లో ఉన్న అన్నమాచార్య కీర్తన - "నెయ్యములల్లో నేరేళ్ళో"
పాట కి కాస్త ఎవరన్నా అర్థం చెప్పగలరా?

Lyrics:

నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో

పలచని చెమటల బాహుమూలముల-
చెలమలలోనా చెలువములే
థళథళమను ముత్యపు చెఱగు సురటి
దులిపేటి నీళ్ళాతుంపిళ్ళో

తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళ
చిటిపొటి యలుకలు చిరునగవే
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో

గరగరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు(లే)
మరునివింటి కమ్మనియంప విరుల-
గురితాకులినుపగుగ్గిళ్ళో

Source: http://annamacharya-lyrics.blogspot.com

Regards
S.

--
---------------------------------------------------
V.B.Sowmya
M.S.(by research) in CSE-Second Year
Search & Information Extraction Lab,
IIIT-Hyderabad
my blog:http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Jabalimuni putrevu

unread,
Jul 2, 2008, 10:58:07 AM7/2/08
to sahi...@googlegroups.com
Thanks for a very nice link to listen to Annamayya keerthanas.
Jabalimuni


--
Jabalimuni putrevu

రాకేశ్వర రావు ఆచంట

unread,
Jul 3, 2008, 4:25:01 AM7/3/08
to sahityam
ఈ పాట ఒక సంవత్సరం పాటుగా వింటున్నాను.
అందులో చాలా పదాలు బ్రౌణ్యంలో వెదికి తెలుసుకున్నాకూడా నాకు ఇందా దీని
అర్థం సరిగా తెలియదు.

ఈ వాళ ప్రొద్దుటే ఈ పాట పాడుకుంటూ
వటఫలంబు నీ వన్నెల మోవికి
గుటుకలలోనా గుక్కిళ్ళో
గుఱించి ఆలోచించి, అందమైన గొంతు (larynx) ని వర్ణించడానికి దాన్ని walnut
వంటి దానితోఁ బోల్చవచ్చు కదా అని అనుకున్నాను. ఆహా ఏఁవి సాహిత్యం
అనుకున్నాను. (నేను అర్థం చేసుకోగలిగినంతలో నాకు అర్థమైనదంత).

ఇంకెవరైనా బాగా అర్థంచెబితే బావుండు.

రాకేశ్వర

Sriram

unread,
Jul 3, 2008, 4:54:16 AM7/3/08
to sahityam
అన్నమయ్య కీర్తనలలో ఒక అద్భుతమైన శృంగారకీర్తన ఇది. భావనా సౌందర్యం, పదాళ
పోహళింపు వివరిస్తూ పప్పు నాగరాజు గారి లాంటి వాళ్ళు ఒక పెద్ద వ్యాసం
రాయగలరు దీని మీద. నాకున్న పరిమితుల దృష్ట్యా కేవలం మక్కికి మక్కి అర్ధం
మాత్రం రాస్తున్నాను. ఇది ఈ కీర్తనకి న్యాయం చేస్తుందని నేను
అనుకోవట్లేదు.

> Lyrics:
>
> నెయ్యములల్లో నేరేళ్ళో
> వొయ్యన వూరెడి వువ్విళ్ళో
(ఓ వేంకటపతీ!) ప్రణయాలలో నీ(చతురత)కు వందనం. మధురంగా నన్ను
పురికొల్పుతున్నావు.

> పలచని చెమటల బాహుమూలముల-
> చెలమలలోనా చెలువములే
> థళథళమను ముత్యపు చెఱగు సురటి
> దులిపేటి నీళ్ళాతుంపిళ్ళో

నా బాహుమూలాలలోని పలుచని చెమటల అందాలే, నా ముత్యాల చీర కొంగు తో నీకు
వీవన విసిరేప్పుడు నీళ్ళ తుంపరలుగా నీ పైన పడుతున్నాయి.


> తొటతొట కన్నుల తొరిగేటి నీళ్ళ
> చిటిపొటి యలుకలు చిరునగవే
> వటఫలంబు నీ వన్నెల మోవికి
> గుటుకలలోనా గుక్కిళ్ళో

ప్రణయకోపాలలో నా కన్నుల్లోంచి కారే కన్నీళ్ళే మర్రిపండు రంగుగల నీ
చిరునవ్వునవ్వే పెదవుల గుటకలలో మింగుబడుతున్నాయి.

> గరగరికల వేంకటపతి కౌగిట
> పరిమళములలో బచ్చనలు(లే)
> మరునివింటి కమ్మనియంప విరుల-
> గురితాకులినుపగుగ్గిళ్ళో

ఎంతో జాగరూకుడవైన నీ కౌగిలి యొక్క సుగంధములో, చెరకుగడతో చేసిన మన్మధుని
వింటి కమ్మని బాణాల తాకిడి భరించలేకుండా ఉంది.

Sowmya V.B.

unread,
Jul 3, 2008, 5:28:18 AM7/3/08
to sahi...@googlegroups.com
@Sriram:
Thanks a lot!

ఆన్లైన్ బ్రౌణ్యం లో శోధన సరిగా పనిచేస్తుందా? అన్నది నాకు పెద్ద
అనుమానం. చాలా సార్లు పదాలకి అర్థాలు దొరక్క చిరాకొచ్చింది నాకు.

S

2008/7/3 Sriram <sriram.ka...@gmail.com>:

--

Dileep Maddukuri

unread,
Jul 3, 2008, 2:00:18 PM7/3/08
to sahi...@googlegroups.com
పద్య కవిత అంటే భయపడి పారిపోయే నాకు, ఈ కవితను చూసి ఆసక్తి కలిగింది... ఈ ఆసక్తి మరిన్ని పద్య కవితలను చదివిస్తుందేమో...
పరిచయం చేసిన సౌమ్య గారికి, అర్ధం వివరించి చెప్పిన శ్రీరాం గారికి  ధన్యవాదాలు.

2008/7/3 Sowmya V.B. <vbso...@gmail.com>:

sudhakar valluri

unread,
Jul 5, 2008, 1:34:04 PM7/5/08
to sahi...@googlegroups.com

శ్రీరాం గారికి  ధన్యవాదాలు. మరిన్ని అన్నమయ్య కవితాకుసుమాలను విడమర్చి అర్ధతాత్పర్యాలు చెప్పగలరు.



--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

కొత్తపాళీ

unread,
Jul 7, 2008, 12:27:21 PM7/7/08
to sahityam
ఎవరేమనుకుంటారో అని పట్టించుకోకుండా నేను గొంతెత్తి పాడుకునే రోజుల్లో
కూడా ఈ పాటకి మీనింగేటబ్బా అని ఎప్పుడూ అనుకోలేదు. ఈ చర్చ మొదలైనాక
మాత్రం ఈ పాట విడవకుండా మనసుని అల్లకల్లోలం చేసింది అంటే అతిశయోక్తి
కాదు.

అన్నమయ్య జానపదబాణీల్లో, ముఖ్యంగా ఆడవారి పాటల శైలిలో రాశులకొద్దీ పదాలు
సృష్టించాడు. దంపుళ్ళ పాట, ఏలపాట, కోలాటం, అత్తాకోడళ్ళ సంవాదం, ఉయ్యాల
పాటలు, జోలపాటలు, మంగళ హారతులు .. ఇలాగ. వీటిల్లో కొన్ని బాలకృష్ణుని
లీలల్ని తల్చుకుని మురుసుకునేవి కాగా చాలా పాటలు మాంఛి రసవత్తరమైన సంభోగ
శృంగారాన్ని సూచించేవి. వీటిల్లో చాలావాటిల్లో గొంతు నాయికని
ఆటపట్టిస్తున్నట్టుగా ఉంటాయి.

నేరేడు పళ్ళల్లోనే అల్లోనేరేళ్ళని ఒక రకం. అదేదో కమలహాసను సినిమాలో పాట
కూడా ఉంది కదా. ఎలా వచ్చిందో తెలీదు గానీ, మొత్తానికి ఈ "అల్లో నేరేళ్ళు"
అనేది ఒక స్త్రీల పాటల మకుటంగా ప్రసిద్ధి పొందింది అని బౌణ్య నిఘంటువు
చెబుతోంది.

నెయ్యములు అల్లో నేరేళ్ళో
తొయ్యనను ఊరెడి ఉవ్విళ్ళో

ఈ ప్రేముంది (నెయ్యము) చూశావూ చిన్నదానా .. దానిలో పడ్డవాళ్ళకి ఇహ
వొళ్ళూపై తెలియదే ఓయమ్మా! ఈ అమ్మాయినే (తొయ్యలి) చూడు ఎట్లా
ఉవ్విళ్ళూరిపోతోందో!

పాటని నాయిక చెలికత్తెలు ఏ తోటలోనో సయ్యాట లాడుతూ, ఆమెని ఆటపట్టిస్తూ
పాడుతున్నారని ఊహించుకుంటే అన్వయం సరిపోతుందని నాకు అనిపిస్తోంది. నాకు
తోచిన పద్ధతిలో ఇదీ సీను. ఆయన వచ్చేస్తాడు ఇప్పుడో ఇంకాసేపట్లోనో. ఆమెకి
అనురక్తుడు. ఈమెకూడా స్వాధీనపతిక. ప్రియసమాగమం కోసం ఉవ్విళ్ళూరుతోంది. ఆ
సూచనలన్నీ ఆమె వొంటిమీదనే కనిపిస్తున్నాయి .. బాహు మూలాలు చెమర్చడం,
కళ్ళలో సన్నగా నీటి పొర, పెదాల మీద అలుకతో కూడిన చిరునవ్వు, ఇత్యాది. ఇహ
చెలికత్తెలు ఆమెని ఉడికిస్తూ పండగ చేసుకుంటున్నారు.
ఇలాంటి పాటల్లో అసలు కిటుకంతా అన్నమయ్య గుప్పించే బహు కమ్మని తెలుగు
నుడికారాల్లో ఉంటుంది. మరుని వింటి నించి అంప విరులు వెలువడ్డాయిట. అవి
కమ్మగా ఉన్నాయిట. ఎంత అంప విరులైనా, ఎంత కమ్మగా ఉన్నా, బాణాలు బాణాలు
కాకుండా పోవుగదా .. వాటి గురి తాకులు .. ఇనుప గుగ్గిళ్ళుట! అదీ
సంగతి. :-)


@ Sowmya - before you search for individual word meanings from
annamayya padams, you should parse the words properly. You might have
been misled by the repeated use of గసడదవాదేశ సంధి or సరళ సంధి and
other such.

రిగార్డులతో,
కొత్తపాళీ

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jul 16, 2008, 1:19:02 PM7/16/08
to sahi...@googlegroups.com
ఆహా.... కడుపు నిండింది...
 
కృతజ్ఞతలతో
--
కృష్ణ మోహన్ కందర్ప
భాగ్యనగరము
http://telugutheepi.blogspot.com/
http://manikyaveena.blogspot.com/
http://idikathakadu.blogspot.com/
http://abhagyanagaram.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages