కథ - కథానిక

4,744 views
Skip to first unread message

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
May 30, 2007, 8:13:54 PM5/30/07
to sahi...@googlegroups.com
కథ కన్నా పెద్దది, నవల కన్నా చిన్నది ఐన వచనాన్ని నవలిక అంటారని విన్నాను.
కథ - కథానిక -- వీటిమధ్య తేడా ఏమిటి? కథ చిన్నదైతే కథానిక అనేస్తామా?
అలాగే, నాటిక - నాటకము.
రేడియోలో ఒకోసారి నాటిక అనీ ఒకోసారి నాటకం అనీ అంటారు,
విజ్ఞులు తమ అభిప్రాయాలను తెలుపవలసినది.

భవదీయుడు,
~ రానారె [ http://yarnar.blogspot.com ]

swathi

unread,
May 31, 2007, 12:09:35 AM5/31/07
to sahi...@googlegroups.com
పనిలో పని నా సందేహాలు కూడా బయట పెట్టేస్తా.

చారిత్రక నవల అని దేన్నంటారు.
చరత్రలో సంఘటనల్ని యధాతధం గా కొంత నాటకీయత జోడించి రాసిన వాటినా?
చరిత్ర లోని సంఘటనల నేపధ్యం లో రాసిన ఊహాజనితమైన కధల్ని ఏమని
పిలవచ్చు.(ఉదా: కొ కుటుంబరావు గారి 'చదువు')
తెన్నేటి సూరి గారి చంఘిజ్ ఖాన్‌ చారిత్రక నవలేనా?(దీని గురించిన
విశేషాలు కొంత చర్చించాలని ఉంది.)

గల్పిక అనడానికి ఉండవలసిన లక్షణాలేమిటి.

కధానిక అంటే గుర్తొచ్చింది. విజయవాడ ఆకాశవాణి లో కధానికల్ని ఎంతో హృద్యం
గా చదివి వినిపించేవారు.

--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

Prasad Charasala

unread,
May 31, 2007, 8:09:46 AM5/31/07
to sahi...@googlegroups.com

నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం అదే. కథానిక చిన్న కథ, నవలిక చిన్న నవల. కానీ అది నాటికకు వర్తిస్తుందో లేదో తెలియదు.
"కథానిక" అన్న పదం వాడింది మధురాంతకం రాజారావు గారేనా?

--ప్రసాద్
http://blog.charasala.com



kotta pali

unread,
May 31, 2007, 8:30:32 AM5/31/07
to sahi...@googlegroups.com
వారి పేరు మధురాంతకం రాజారాం!
 
ఆంగ్లంలో కథకి స్టోరీ అనే పదం మరీ విస్తృతమైన అర్థంలో ఉంటోంది అని సమకాలీన కథా రచనలకి మాడర్న్ షార్ట్ స్టోరీ అని పేరు పెట్టారు. క్లుప్తంగా షార్ట్ స్టోరీ అన్నారు.

అలాగే తెలుగులో కూడా కథ అనే పేరు చాలా విస్తృతమైన అర్థాలనిస్తుంది - నీతికథలు కావచ్చు, ఆత్మకథలు కావచ్చు, కాశీ మజిలీ కథలు కావచ్చు, కాకమ్మ కథలు కావచ్చు, సినబ్బ చెప్పే "కతలు" కావచ్చు - వీటన్నిటినించీ వేరుగా మాడర్న్ షార్ట్ స్టోరీని సూచించడానికి కథానిక అని వాడడం మొదలు పెట్టారు. అంతే గానీ కథల్లో చిన్న కథ అనే అర్థం లేదు నాకు తెలిసినంతలో. ఐతే ఈ విభజన, వివరణ సాహిత్య విద్యార్ధులు, ఆచార్యులూ పట్టించుకున్నంతగా పాఠకులూ, రచయితలూ పట్టించుకోవటంలేదని నేను గమనించాను.
 
అసలు కథ నిడివి ఎంత ఉండాలి అనేది ఎక్కడా (ఏ భాషలోనూ) నిర్ధారణ కాలేదు. శ్రీపాద తన వడ్లగింజల్నీ, కారామాస్టారు యజ్నాన్నీ కథలనే అన్నారు. అవి ఒక్కోటీ సుమారు వంద పేజీలుంటాయి. టాల్స్టాయ్ ప్రముఖ కథ "డెత్ ఒఫ్ ఈవాన్ ఈల్యిచ్" కూడా ఇలాంటిదే. ఇటుపక్క చూస్తే రెండూ మూడు పేజీలు దాటని అమరావతి కథలూ ఉంటాయి.
నాటికకీ నటకానికీ తేడా ఖచ్చితంగానే ఉంది. ఒకే అంకంతో ముగిసేది నాటిక - ఒకటికన్నా ఎక్కువ అంకాలు ఉన్నది నాటకం. రేడీయో వాళ్ళు ఈ మాటల్ని మార్చి వాడీతే - వాళ్ళ ఖర్మ, మన ఖర్మ.
ఇది కొన్ని సందేహాలు తీర్చిందని ఆశిస్తాను.
స్వాతిగారి జాబుకి జవాబు వేరేగా రాస్తాను.
కొ.పా.

 

Pinpoint customers who are looking for what you sell.

swathi

unread,
May 31, 2007, 8:34:51 AM5/31/07
to sahi...@googlegroups.com
నాటకం లో అంకం అంటే సన్నివేశం అనా?

kotta pali

unread,
May 31, 2007, 8:47:55 AM5/31/07
to sahi...@googlegroups.com
చారిత్రక నవలలో ముఖ్య పాత్రలు చరిత్రలో నిజమైన వ్యక్తులు అయి ఉండాలి, కేవలం సంఘటనలే కాదు. అలాగని వ్యక్తుల్ని తీసుకుని అభూతకల్పనలు అల్లటమూ కాదు - ఆ వ్యక్తుల గురించి నిజంగా చరిత్రలో నమోదైనవో, లేక జనశ్ర్తిగా ప్రచారమైనవో సంఘటనలని జోడించి, ఆ రెండిటికీ సమన్వయం చెయ్యటం. ఉదాహరణకి పోతనని గురించి కొన్ని కథలున్నై. ఐతే ఆ కథలు పోతన యొక్క ఒక పార్శ్వాన్నే చూపిస్తై - పరిపూర్ణంగా ఆయన ఎటువంటి వాడు? ఆయన్ ఇంట్లో పరిస్థితులేంటి? ఆయన శాంతమూర్తా, కోపిష్టా? పెళ్ళాం అనుకూలవతా, గయ్యాళిదా? ఇలా ఊహించుకుంటూ, ఆయన గురించి మనకి తెలిసిన కథలని (సంఘటనలని) ఆ పాత్రలతో అన్వయిస్తూ ఒక సంపూర్ణ చిత్రం రూపొందించడం అవుతుంది.
 
చదువు చారిత్రక నవల కాదు, చారిత్రక నేపథ్యాన్ని బాగా చిత్రించినా. కాస్త శ్రద్ధపెట్టి రాసే ఏ రచనలోనైనా ఆ కథకి సంబంధించిన సామాజిక నేపధ్యం ఉంటూనే ఉంటుంది. - అంత మాత్రాన అది చారిత్రక నవల కాదు.
 
చంఘీజ్ ఖాన్ చాలా కాలం క్రితం చదివాను, ఇప్పుడు పుస్తకం అందుబాటులో లేదు. మీరు చెప్పండి, వింటాము.
 
గల్పిక అనేది కొకు సృష్టించిన పేరు అంటారు. ఐతే ఆ ప్రక్రియ ఎప్పణ్ణించోనే ఉంది. ప్రహసనము, రూపకము, వ్యాయోగము అనే వారు. లక్షణాలు

 - క్లుప్తత
 - ఏదో ఒక పాయింటు (నీతి?) నొక్కి చెప్పడం ప్రధానం
 - పాత్ర చిత్రణ సంపూర్ణంగా ఉండదు - ఒక స్కెచ్ లాగా ఉంటుంది.
 - సాధారణంగా వ్యంగ్య ప్రధానంగా ఉంటాయి.

చాన్నాళ్ళక్రితం నేను రాసిన ఓ రెండు గల్పికలు ఇక్కడ చదవచ్చు.
 
కొ.పా.

Prasad Charasala

unread,
May 31, 2007, 9:19:30 AM5/31/07
to sahi...@googlegroups.com

"వారి పేరు మధురాంతకం రాజారాం!"

చ్చొ చ్చొ నాలిక్కరుచుకున్నా. తప్పు సరిదిద్ది నందుకు కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.

--ప్రసాద్
http://blog.charasala.com


--
Prasad
http://blog.charasala.com

kotta pali

unread,
May 31, 2007, 9:28:02 AM5/31/07
to sahi...@googlegroups.com
కాదు. కొన్ని సన్నివేశాల కలయిక.
ఆంగ్లంలో అంకాన్ని act అంటారు. సన్నివేశానికి సరైన పారిభాషిక పదం రంగం అనుకుంటా. దీన్ని ఆంగ్లంలో scene అంటారు.
నాటకంలోని కథని నడిపించడంలో ఒక అంకంలోని సన్నివేశాలన్నీ ఒక పొందికగా, ఒక వొరవడిలో ఉంటాయి. ప్రతి అంకానికీ కథ నిర్వహనలో ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. మామూలుగా మొదటి అంకం ప్రధాన పాత్రలని పరిచయం చేసి ప్రతిష్టిస్తుంది. రెండో అంకంలో కథకి మూలమైన సమస్య (conflict) తలెత్తుతుంది. మూడో (చివరి) అంకంలో conflict resolve అవుతుంది.

సినిమాలూ అంతే. ఉదాహరణకి .. శంకరాభరణం సినిమాలో - శంకర శాస్త్రి పూర్వ వైభవం, తులసి ఆయన్ని అభిమానించడం - ఇది మొదటి అంకం.
తులసి హత్య చేసినాక, శంకర శాస్త్రి ఆమెకి ఆశ్రయమివ్వడం, తరవాత జరిగే గొడవంతా రెండో అంకం.
పదేళ్ళ తరవాత శంకరశాస్త్రి పరిస్థితి దిగజారడం, తులసి తిరిగి రావడం, కూతురి పెళ్ళీ, క్లైమాక్సు - ఇది మూడో అంకం.
 
కొ.పా.
----- Original Message ----
From: swathi <swathi...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Thursday, May 31, 2007 8:34:51 AM
Subject: [సాహిత్యం] Re: కథ - కథానిక

నాటకం లో అంకం అంటే సన్నివేశం అనా?

sudhakar valluri

unread,
May 31, 2007, 11:10:57 AM5/31/07
to sahi...@googlegroups.com



చాన్నాళ్ళక్రితం నేను రాసిన ఓ రెండు గల్పికలు ఇక్కడ చదవచ్చు.
 
కొ.పా.

మీరు వ్రాసిన రెండు గల్పికలు "కళాకారుడికి కావల్సింది" మరియు "కూపస్థ మండూకం" చదివాను, చాలాబాగున్నాయీ. ఈ మధ్య ఇంకేమైనా వ్రాసినవుంటే తెలియచేయగలరు.
 ....వల్లూరి
--
Sudhakar    
vskar08gmail.com

sudhakar valluri

unread,
May 31, 2007, 11:21:51 AM5/31/07
to sahi...@googlegroups.com
నాటకము, అంకం, సన్నివేశం మెదలైన వాటిగురించి విపులంగా, అరటిపండు వలిచిపెట్టినట్లు అర్ధవంతమైన ఉదాహరణతో విడమర్చి చేప్పినందులకు థాంక్స్.
....వల్లూరి
--
Sudhakar    
vskar08gmail.com

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
May 31, 2007, 8:19:48 PM5/31/07
to sahi...@googlegroups.com
అంటే కథ-కథానిక ఈ రెంటికీ వ్యత్యాసాన్ని నిర్దిష్టంగా ఎవ్వరూ నిర్వచించలేదన్నమాట. మీ వివరణ కొన్ని సందేహాలను తీర్చింది. థాంకులు. రేడియోలో కథాస్రవంతి అనే పేరిట నవలలు ధారావాహికంగా చదివేవారు. పది-పదహైదు నిముషాల్లో చదవగలిగిన కథలను కథానిక అనేవారు.
"నీతికథలు కావచ్చు, ఆత్మకథలు కావచ్చు, కాశీ మజిలీ కథలు కావచ్చు, కాకమ్మ కథలు కావచ్చు, సినబ్బ చెప్పే "కతలు" కావచ్చు - వీటన్నిటినించీ వేరుగా మాడర్న్ షార్ట్ స్టోరీని సూచించడానికి కథానిక అని వాడడం మొదలు పెట్టారు." అన్నారు కదా, అంటే అది పైన చెప్పిన అన్ని రకాలకంటే భిన్నమైనదై ఉండాలా మోడ్రన్ షార్ట్ స్టోరీ? సినబ్బా కత మోడ్రన్ షార్ట్ స్టోరీ అనిపించుకోదా? ఇంతకీ మోడ్రన్ షార్ట్ స్టోరీ అని దేన్నంటారు? లాంటి సందేహాలు వచ్చాయి గురూగారూ. :)

 
On 5/31/07, kotta pali <kott...@yahoo.com> wrote:



--
Reply all
Reply to author
Forward
0 new messages