gajal

106 views
Skip to first unread message

rajeshwari.n

unread,
Jan 19, 2016, 11:02:59 PM1/19/16
to సాహిత్యం
గజల్ మిత్రులకు చిన్న మనవి 
వ్రాయాలన్న ఉత్సుకతతో వ్రాసానే గానీ నాకేమీ రాదు .ఇదినా మొదటి ప్రయత్నం .పొరబాట్లు ఉన్నయెడల సరిజేయ మనవి 
నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన రాయవరపు లక్ష్మి గారికి ధన్య వాదములు 
------------------------------------------
అందమొలికే చందమామను పొంద కోరని దెవ్వరు ?
సొగసులీనెడు సుందరాంగుల వలపు తేరని  దెవ్వరు ? 
చంటిపాపల బోసినవ్వుల పులకరింతల హాయిలో 
మైకమందున పొంగిపోవుచు ముదము చేరని దెవ్వరు ? 
తల్లిదండ్రుల మమతలందున తన్మయములో మునిగినా 
యవ్వనములో జంటతోడుగ నడక మారని దెవ్వరు ? 
వలపు సీమలతేలి యాడుచు ప్రేమసుధనే గ్రోలగా 
పరిణయమ్మను పదముపాడుచు కలలపోరని దెవ్వరు ? 
సృష్టిలో గలప్రేమ బంధము మించినది యేమున్నది 
మధురమైనా వలపుధారల తడిసి ఆరని దెవ్వరు ? 

rajeshwari.n

unread,
Jan 23, 2016, 10:21:14 AM1/23/16
to సాహిత్యం
పల్లెసీమల సౌరులన్నీ మేనివంపులు ఒలకబోసెను 
వెండివెన్నెల జిలుగులన్నీ తళుకు సొంపులు ఒలకబోసెను 

కొమ్మకొమ్మను మావిచివురులు కొసరికొసరీ మెక్కెనేమో 
పరవసించిన గండుకోయిల వగరుకెంపులు ఒలకబోసెను 

మంచిముత్యపు చిప్పలన్నీ కనులబాసల నింపగా 
గండదర్పణ తలములందున వలపుతూపులు ఒలకబోసెను 

పొందుకోరుచు నిండుమనమున కలలతేలితి వెఱ్ఱినేనై   
మధువునిండిన హృదయవీణయె  చిలిపితలపులు ఒలకబోసెను 

పరునిదారగ నిన్నుచూపీ వలపుహేలగ కన్నుగీటితె 
జాలిగొలిపీ బూదికుప్పలు జాలిచూపులు ఒలకబోసెను  

 

Venkat Ramaiah

unread,
Jan 23, 2016, 10:21:15 AM1/23/16
to sahi...@googlegroups.com
రాజేశ్వరి గారికి - అభినందనలు.
మీరు రాసినది గజల్ అవునో కాదో అందులో తప్పొప్పులు ఏమిటో చెప్పేటంత విజ్ఞత నాకు లేదు గానీ, మీ లేఖనం చాలా బాగుంది. మీ "మధురమైనా కవిత ధారల తడిసి ఆరనిదెవ్వరు?"

--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

rajeshwari.n

unread,
Jan 26, 2016, 9:56:52 PM1/26/16
to సాహిత్యం
ప్రియునికన్నుల వెల్లివిరిసిన జిలుగువెలుగుల మెరుపు చూడు 
ఎదనుపొంగిన కలలనీడల కులుకుతళుకుల మరుపు చూడు  

సరసమాడిన సమయమందున మదినిపరవశ మొందెనేమొ
గాలిఈలలు సోకినంతనే నునుపుచెక్కిలి ఎరుపుచూడు 

దొంగకలువలు తొంగిజూసిన నింగిమబ్బులు మాటువేయగ 
అంబరమ్మున కలతచెందిన మినుకుతారల విరుపుచూడు 

ఏటిఒడ్డున కందిచేలో మంచెకాడను కలుసుకోమనె 
సందెచీకటి యలముకొనగా ఏటిగలగల నెరపుచూడు 

వలపుబాసలు వెళ్ళబోయగ చిలిపికోయిల పలకరించెను 
మామచెంతకు జేరిబోవగ అలిగివెలిగిన చఱపు చూడు 
  

Venkat Ramaiah

unread,
Jan 28, 2016, 9:24:48 AM1/28/16
to sahi...@googlegroups.com
బాగా రాస్తున్నారండీ...

--

rajeshwari.n

unread,
Jan 31, 2016, 10:06:22 AM1/31/16
to సాహిత్యం
మధువునిండిన వలపుతెమ్మెర చెఱకుగడయై గుచ్చు తోంది 
కలతచెందిన కన్నెమదినే గుండెదడయై గుచ్చుతోంది

పూలతోటను నడచి నడచీ ముళ్ళబాటలు అడ్డుకుంటే 
వొళ్ళుతెలియని మైకమందున పూలజడయై గుచ్చుతోంది

వెండిమబ్బున నిండుజాబిలి కనులకింపుగ కదులుతుంటే
పలుకరించని గండుకోయిల బరువుమెడయై గుచ్చుతోంది 

ఈసుజెందిన మేఘమాలిక తెరలుతెరలుగ దాటుతుంటే
మురిసిమెరిసే తీపికలలను కులుకుజడయై గుచ్చుతోంది 

చెలునిప్రేమకు దూరమైతె జగతినిండుగ శూన్యమే    
ప్రియునికన్నుల వేదనేమో మనసుయెడయై గుచ్చుతోంది    

 

 

  
 


 






   
 

nunepalli bharath

unread,
Jan 31, 2016, 9:16:44 PM1/31/16
to sahi...@googlegroups.com

Chala bagundi.

ఈసుజెందిన ane pada prayogaaniki artam telapamani praarthana.

--

rajeshwari.n

unread,
Feb 1, 2016, 9:55:32 PM2/1/16
to సాహిత్యం
వలపు వాకిలి తెరవలేదని అలిగినావా ప్రేయసీ 
మల్లెమాలలు అల్లలేదని తొలగినావా ప్రేయసీ 

సాగుబడనీ బీడుగుండెని వదలిపోయితి వేమొగానీ 
మనసువీణను మీటిపోవగ కదలినావా ప్రేయసీ 

కోటిదివ్వెల కాంతినీవని కలలుగంటిని వెఱ్ఱినేనై 
మమతపెంచీ మనసుదోచీ మరలినావా ప్రేయసీ 

గగనమంటిన ప్రేమనాదని తెలుసుకొని  మనమంటినే  
విరహవేదన పెంచిగుండెను దొలిచినావా ప్రేయసీ   

క్షణికమే మదినిలుపుకున్నామక్కువేగద చుక్కగా     
దివ్వెదివ్వెకు వెలుగునేనని తలచినావా ప్రేయసీ 




rajeshwari.n

unread,
Feb 3, 2016, 1:56:16 AM2/3/16
to సాహిత్యం

rajeshwari.n

unread,
Feb 7, 2016, 10:35:27 PM2/7/16
to సాహిత్యం
ఇంద్రధనుసు మనప్రేమకి మెరవబడెను అటు చూడు 
తెల్లమబ్బు మనకోసమె పరవబడెను అటు చూడు 

వికసించిన కలువలన్ని గుసగుస మంటున్నాయి 
తారలన్ని నునుసిగ్గులు ఒలకబడెను అటు చూడు 

ఆలసించిన అమృతమే విషజ్వాలగ ఎగసిపడును
క్షణములన్ని పదేపదే కలచబడెను అటు చూడు 

దారితప్పి సోయగాలు ఏపొంతను దాగినవో  
గుబులుబుట్టు సెగలురేగి వెలగబడెను అటు చూడు 

మబ్బుపట్టు గగనానికి అలముకొన్న చీకటిలో 
మగమనసులు తాకట్టున వెతలబడెను అటు చూడు 
 

rajeshwari.n

unread,
Feb 11, 2016, 1:06:44 AM2/11/16
to సాహిత్యం
మల్లెపూలు వసివాడని సందెలంటె కడుమోహం 
చందమామ వెల్లివిరియు విందులంటె కడుమోహం 

మలయానిల వీచికలకు మేనుపులక రించునంటి  
గులాబీల పరిమళాల చిందులంటె కడుమోహం 

అనురాగము లొలికించెడి ప్రేయసితెలి నగుమోమున 
విరహమందు మైమరచెడి పొందులంటె కడుమోహం 

లేతమేని వంపులందు అజంతాల అందాలకు  
చిరుసవ్వడి గిలిగింతల అందెలంటె కడుమోహం 

విరహతాప మందుమునిగి అభిసారిక నీవైతే
రేరాజును గెలిపించే పందెమంటె కడుమోహం 

గెలిచిఓడి మురిపెమంటె నీకెంతటి  వినోదమో 
ఓడిగెలిచి సాధించెడి చందమంటె కడుమోహం  
 
 
 

 

rajeshwari.n

unread,
Feb 12, 2016, 8:50:52 PM2/12/16
to సాహిత్యం
gajal 
బిగికౌగిలి ఒదిగిపోవు ప్రేమొక్కటి చాలదా 
ప్రణయనౌక సాగిపోవు పదమొక్కటి చాలదా 

పిడికెడంత గుండెలోన పదిలపరచు మమతలకై    
కడివెడంత పాలపుంత మెరుపొక్కటి చాలదా
 
వికసించే విరజాజుల పరిమళాల సౌరులందు 
సేదతీరి అలిగినంత విరుపొక్కటి చాలదా 

విశ్వమంత ఏలుచున్న రేరాజువు నీవైతే  
రేరాణిగ మదినిండిన గెలుపొక్కటి చాలదా 

ఝల్లుమన్న పేదగుండె పిడికెడంత ప్రేమతప్ప 
ఏమిచ్చును తీరిపోని బాధొక్కటి చాలదా 


 


rajeshwari.n

unread,
Feb 15, 2016, 12:55:19 AM2/15/16
to సాహిత్యం
మావితోట తోపులోన మెరుపేదో మెరిసె నంట 
చిన్నదాని గుండెలోన తలపేదో విరిసె నంట 

వస్తాననీ నారాజూ రాలేదే ఇంతవరకు 
వేచివేచి విరహమందు కనులనీరు కురిసె నంట 

విరులవనము నుండిపరిమ ళించుగాలి వలపుమోజు  
రెచ్చగొట్టి నామదినే ఎగతాళిగ మురిసె నంట 

ఎదసవ్వడి వినిపించగ పొదమాటున దాగెనేమొ 
వగరుమేసి కోయిలమ్మ పొగరుచూపు మరిసె నంట 

తోటకంత నీరుపోసి పాటలందు ప్రేమతెలిపె 
ఎగసిపడిన భావలహరి పూలవాన దిరిసె నంట 


 
 







  


anand

unread,
Feb 18, 2016, 4:50:39 AM2/18/16
to sahi...@googlegroups.com
అక్షరాలా అద్భుతం !!

నెనర్లు

ఆనంద్

rajeshwari.n

unread,
Feb 19, 2016, 11:04:47 PM2/19/16
to సాహిత్యం
చేనుమేసే కంచలుండిన రక్షణెక్కడ జగతిలోన 
పెరిగిపోయిన స్వార్ధముంటే మనసులెక్కడ జగతిలోన ? 

మిటనంటిన ధరలముంగిట చంటిదానికి పాలుకరువే 
కరువుజీతపు బడుగుజీవికి శాంతమెక్కడ జగతిలోన ? 

మోసగించిన వలపురేనికి శృంఖలంబులు వేయరెవ్వరు 
కన్నెమనసును కృంగదీయని వారలెక్కడ జగతిలోన 

మూడుముడులకు ప్రాణమిచ్చెడి సతినివీడుచు పోదురెటకో 
మమతపెంచే పసిడిపిల్లల పితరులెక్కడ జగతిలోన 

వలపువానలు చిలకరించీ బాసలందున ముంచితేల్చీ 
తోకముడిచీ వెన్నుజూపెడి సాధువెక్కడ జగతిలోన ?  








 

rajeshwari.n

unread,
Feb 22, 2016, 8:45:12 PM2/22/16
to సాహిత్యం
dhanya vaadamulu 


On Tuesday, January 19, 2016 at 11:02:59 PM UTC-5, rajeshwari.n wrote:

rajeshwari.n

unread,
Mar 1, 2016, 10:45:00 AM3/1/16
to సాహిత్యం
మబ్బుతెరల మాటునుండి వలపుపిలుపు ఆపలేవు  
కంటికొసల దొంగనవ్వు చిలిపికులుకు ఆపలేవు 
 
ఊగిఊగి తెరచాపట కడలియంచు ముద్దులిడగ  
అలసియలసి కదలనంటె కలతమలుపు ఆపలేవు 

వెండిమబ్బు తెల్లదనం మదినిండుగ చల్లదనం
నీమమతల ప్రేమవనం విరులతలపు ఆపలేవు 

అలలుపొంగి విరహమందు గుండెబరువు మోయలేక 
గిలిగింతల సరసాలకు సిరులవొలుకు ఆపలేవు 

ప్రియునివొడి జేరుటకని దూరమునే కొలిచికొలిచి 
తాపమింక తాళలేక మరులబలుపు ఆపలేవు 
  



 

 

  

rajeshwari.n

unread,
Mar 5, 2016, 3:40:58 AM3/5/16
to సాహిత్యం
చెలిమనసును తెలుసుకొనుచు నడచుకున్న వారెవరో 
కలతబడక జీవితమే తెలుసుకున్న వారెవరో 

ఆడదంటె అంగడిలో ఆటబొమ్మ కాదటంచు 
తెలిసికూడ వనితమనసు పంచుకున్న వారెవరో 

సంసారపు సాగరాన ఎదురీదుచు నిలచినంత 
అలలతేలు ప్రేమనౌక అడ్డుకున్న వారెవరో 

ప్రేయసిగా ప్రేమగీతి పాడిపాడి అలసిపోయి  
జీవితమే పంచుసతిని హత్తుకొన్న వారెవరో 

మకరందపు ప్రేమఝరిలొ మైకమందు ఆదమరచి 
వికటించిన ప్రేమవిరుపు నింపుకున్న వారెవరో 

గుండెబరువు తాళలేక జ్ఞాపకాలు వీడలేక 
రాజీపడి బతుకుబండి నడుపుకున్న వారెవరో  
 



 

  

rajeshwari.n

unread,
Mar 9, 2016, 7:33:37 AM3/9/16
to సాహిత్యం
మబ్బుకన్నె అలిగిందా నీలిజల్లు కురిసింది 
గగనమెంత మురిసిందో వలపుజల్లు కురిసింది 

కడలికెంత ఆనందం అలలువెల్లు వైనాయి 
పాదాలను ముద్దుబెట్టి ప్రేమజల్లు కురిసింది 

గుండెమండు బాధలన్ని గాలిలోన కలసిపోయి
దిక్సూచిగా వెలుగురేఖ మెరుపుజల్లు కురిసింది 

జ్ఞాపకాల తెరలుపొంగి ఎదనుగాయ మౌతుంటే 
పదేపదే మరవాలని మంచుజల్లు కురిసింది 

మొగ్గలోనె రాలినట్టి మధురభావ వలయాలకు
గుండెరాయి చేసికొనగ చేదుజల్లు కురిసింది 

వెక్కిరించు కాలమంత ఎదుటనిలచి నవ్వుతుంటె 
కసికసిగా రోషమందు ఈసుజల్లు కురిసింది 

కరుడుగట్టు తీపికలలు కరగలేక మొరాయిస్తె 
నిస్పృహతో నిట్టూర్పుల వేడిజల్లు కురిసింది 
 

మబ్బుకన్నె అలిగిందా నీలిజల్లు కురిసింది 
గగనమెంత మురిసిందో వలపుజల్లు కురిసింది 

కడలికెంత ఆనందం అలలువెల్లు వైనాయి 
పాదాలను ముద్దుబెట్టి ప్రేమజల్లు కురిసింది 

గుండెమండు బాధలన్ని గాలిలోన కలసిపోయి
దిక్సూచిగా వెలుగురేఖ మెరుపుజల్లు కురిసింది 

జ్ఞాపకాల తెరలుపొంగి ఎదనుగాయ మౌతుంటే 
పదేపదే మరవాలని మంచుజల్లు కురిసింది 

మొగ్గలోనె రాలినట్టి మధురభావ వలయాలకు
గుండెరాయి చేసికొనగ చేదుజల్లు కురిసింది 

వెక్కిరించు కాలమంత ఎదుటనిలచి నవ్వుతుంటె 
కసికసిగా రోషమందు ఈసుజల్లు కురిసింది 

కరుడుగట్టు తీపికలలు కరగలేక మొరాయిస్తె 
నిస్పృహతో నిట్టూర్పుల వేడిజల్లు కురిసింది 
 










rajeshwari.n

unread,
Mar 9, 2016, 7:33:37 AM3/9/16
to సాహిత్యం
మధురమైన జీవితాన మరపురాని ఆరోజులు 
అందమైన చెలిమిపంట తిరిగిరాని ఆరోజులు 

వోణీలను విడిచిపెట్టి చీరలనే కట్టికట్టి
సొంపులతో సింగారపు నడకలందు ఆరోజులు 

భువినేలెడు రాణులవలె గగనానికి నిచ్చెనేసి 
విహంగాల విహరించెడి నిజంకాని ఆరోజులు 

కొసరుకొసరు చూపులతో కసరివిసరు వాలుజడలు 
వలపుగెలుపు దొరకనీక కనులలోని ఆరోజులు 

చెలిమంటే జీవితమని ఎన్నటికీ  విడిపోమని 
ప్రమాణాలు చేసుకున్న దరికిరాని ఆరోజులు  

rajeshwari.n

unread,
Mar 11, 2016, 7:38:17 AM3/11/16
to సాహిత్యం
కూలిపోవు పేకమేడ లేకడుతూ ఉంటానూ 
రాలిపోవు జీవితాన కలబడుతూ ఉంటానూ 

అందమంత నాదేనని రాయంచను నేనేనని 
కులుకువంపు లొలకబోసి తెగబడుతూ ఉంటానూ 

మదినిపూయు విరజాజుల మాలలెన్నొ కట్టికట్టి 
వాడిపోవు విరహమందు దిగబడుతూ ఉంటానూ 

పగలంతా కసరివిసరు ఇనబింబము వెంటతరిమి 
రేరాజును కలువనెంచి వెశబడుతూ ఉంటానూ 

నిన్నలోన కలసిపోవు కంటికొసల కలవరింత 
ఎన్నడేని తీరునంచు ఒడిబడుతూ ఉంటానూ  

ప్రేమపూల వర్షమందు తడిసితడిసి అలసిసొలసి 
మమతలందు మదినినిలిపి వెలిబడుతూ ఉంటానూ  
  
    

purnanand.y Anand

unread,
Mar 13, 2016, 11:34:13 AM3/13/16
to sahi...@googlegroups.com
very good

--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
 WITH WISHES ANAND

rajeshwari.n

unread,
Mar 15, 2016, 1:33:32 PM3/15/16
to సాహిత్యం
దూరదేశ మేగితివే వెలపదిలము జాగ్రత  
మదిచెదిరీ వలపుపొంగు కలపదిలము జాగ్రత 

నన్నుమరచి మాటకలిపి వసంతాలు గడచిపోయె 
చట్టుచేమ గాలితెరల అలపదిలము జాగ్రత 

శ్రావణమిది పెండ్లియని మదినెత్తురు మరుగుతుంటె 
కలబోయని మూగదైన శిలపదిలము జాగ్రత 

దొరసానుల రాజ్యంలో నీవుదొరవు కాబోకుము 
ప్రియురాలి మదినెరుగుట ఇలపదిలము జాగ్రత 

రాజీపడి బతకలేను నినుమరచుట వశముకాదు 
నావాడే రేరాజను నెలపదిలము జాగ్రత 

పారావా రములుదాటి పరుగిడితివి శిరివెంటను 
మరుజన్మకు నైనగాని మిలపదిలము జాగ్రత 
Reply all
Reply to author
Forward
0 new messages