నాకుమాత్రం ఎందుకో కాళిదాసుని మేఘసందేశం గుర్తొచ్చింది. ఏదో కధగా వినడం
తప్పితే ఈ కావ్యాన్ని ఎప్పుడూ చదవలేదు. ఇందులోని మందాక్రాంత వృత్తాలు అతి
మనోహరంగా ఉంటాయని చెప్పగా విన్నాను. ఈ కావ్యానికీ, ఆషాఢానికీ ఏమైనా
సంబంధం ఉందా?
చదివిన వారూ, విజ్ఞులూ మనగుంపులో ఉన్నారని నమ్మకం. ఎవరైనా దయచేసి ఈ
కావ్యం విశేషాలు వివరిస్తే నాలాంటి వారికి చాలా మేలుచేసినవారౌతారు.
అన్నట్టు, ఈ కావ్యానికి తెలుగువ్యాఖ్యానం వావిళ్ళవారు కానీ లేక వేరెవరైనా
ప్రచురించారా?
మేఘదూతం లో పూర్వమేఘమనీ, ఉత్తరమేఘమనీ రెండు భాగాలు ఉన్నాయి. పూర్వమేఘంలో
యక్షుడు తానున్న ప్రదేశం (ఇప్పటి నాగపూర్ దగ్గిర ఉన్న 'రామటేక్' అన్న
ప్రాంతం) నించి తన ప్రేయసి ఉండే అలకానగరానికి దారిని నిర్దేశిస్తాడు.
రెండవ భాగంలో అలకానగర వర్ణన, యక్షపత్ని నివాసం, ఆమె సౌందర్యం వగైరా
వర్ణించ బడ్డాయి.
మేఘదూతంలో ప్రకృతి వర్ణనలు, యక్షుని విరహోత్కంఠతలు అద్బుతంగా
వర్ణించబడ్డాయి. ఈ మేఘదూతానికి వ్యాఖ్యానాలు ఇప్పటిదాకా సంస్కృతంలో చాలా
వచ్చాయి(ట). తెలుగులో మహీధర నళినీమోహన్ రాసిన "మాత్రా ఛందస్సులో మేఘ
సందేశం" నేను కొన్నాళ్ల క్రితం విశాలాంధ్రలో (కాబోలు) కొన్నాను.
మేఘదూతా కావ్యానికి తెలుగులో అతి చక్కని, సరళమైన వ్యాఖ్యానం రాసింది
రామవరపు శరత్ బాబు, శోంఠి శారదాపూర్ణ గార్లు. వీళ్లిద్దరూ విశ్వనాథవారికి
శిష్య ప్రశిష్యులు, వరుసగా. ఈ పుస్తకంలో ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థ
తాత్పర్యాలే కాకుండా, పదచ్ఛేద, అన్వయాలు, "శ్రీకాళా" వ్యాఖ్య కూడా ఉంది.
ఆనందలహరి, విశాఖపట్టణం వారి ప్రచురణ. ఈ పుస్తకం నేను '98 లో అట్లాంటాలో
జరిగిన మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో కొన్న గుర్తు. విశాలాంధ్రలో
కూడా దొరకచ్చు.
ఇవీ మేఘదూతం విశేషాలు.
-- Padma I.
07/18/07
నాబోటి వాళ్ళకి అర్ధమయ్యేలా చక్కగా గురుముఖతః చెప్పుకున్న రీతిలో
చదువుకునేలా ఉంది ఈ పుస్తకం. ఇంతమంచి వివరాలు అందజేసినందుకు మరోసారి
కృతజ్ఞతలు.
> > ప్రచురించారా?- Hide quoted text -
>
> - Show quoted text -