భవదీయుడు

已查看 313 次
跳至第一个未读帖子

Achyuth Prasad Pavirala

未读,
2010年3月31日 17:09:272010/3/31
收件人 sahi...@googlegroups.com
సభ్యులకి నమస్కారం,
 
భవదీయుడు అను పదానికి అర్ధం తెలుపగలరు.  
 
నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో (సందర్భోచితంగా) చేసిన ప్రయత్నం ఇది:
భవదీయుడు = భవత్ + విధేయుడు = your's obidiently
 
ఇక్కడ "భవదీయుడు" ని విడదీసిన విధానము మరియు "భవత్ = your's" రెండూ కూడా crude guesses మాత్రమే.
 
నా తప్పులు మన్నించి సరిదిద్దు ప్రార్ధన.
 
నెనర్లు
అచ్యుత్

టేకుమళ్ళ వెంకటప్పయ్య

未读,
2010年4月6日 02:00:132010/4/6
收件人 sahi...@googlegroups.com、pavi...@gmail.com

భవత్ అంటె నీవు, మీరు, జరుగుచున్న కాలం అని అర్ధము.

అదే భవదీయ అంటే  నీది అని అర్ధం

ఐతే తెలుగు లో ("డు, ము, వు, లు") ప్రధమా విభక్తి చేయడంతో

భవదీయుడు అయింది.  అంటే....  మీ యొక్క అని మాత్రమే 

విధేయుడు అని అర్ధము తీసుకోరాదు అని నా అభిప్రాయం.

విజ్ఞులు ఏమంటారో మరి చూడాలి.

వెంకటప్పయ్య.


2010/4/1 Achyuth Prasad Pavirala <pavi...@gmail.com>

Rajeswari Nedunuri

未读,
2010年4月6日 09:35:092010/4/6
收件人 sahi...@googlegroups.com
భవదీయుడు అన్న పదానికి అర్ధం దొరకలేదు కానీ భవము =పుట్టుక ,సంసారము,ప్రాప్తి,శుభము ,సత్తా అని ,భవత్ =కలుగుచున్న,పుట్టుచున్న, అనీ,భవదీయము =మీది ,అనీ,విధేయము = సాసింప తగినది , విహిత కార్యము అనీ విధేయుడు = సేవకుడు  చెప్పినట్లు వినువాడు అనీ ఇలా అర్ధాలు ఉన్నాయి.నాకు తెలిసినది రాసాను.పొరపాటు ఉంటే మన్నించ గలరు

2010/4/6 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>

Geddapu Lakshmi Prasad

未读,
2010年4月6日 10:59:362010/4/6
收件人 sahi...@googlegroups.com
భవదీయుడు లో విధేయ శబ్దం లేదు. భవత్=నీ లేదా మీ అని అర్థం. భవదీయుడు అంటే నీవాడు లేదా మీ వాడు  అని అర్థం. మనం తెలుగులో ఉత్తరం వ్రాసినపుడు "మీ" ఫలానా అనడానికి బదులు సంస్కృతం లో "భవదీయుడు" ఫలానా అని వ్రాస్తారు అంతే. అస్మదీయుడు అనే పదం కూడా ఇలాంటిదే. దీనికి మనవాడు అని అర్థం. భవత్ అంటే జరుగుతున్న కాలం అనే అర్థం లేదని నా అభిప్రాయం. 
2010/4/1 Achyuth Prasad Pavirala <pavi...@gmail.com>
సభ్యులకి నమస్కారం,

sudhakar.btm

未读,
2010年4月7日 00:39:282010/4/7
收件人 sahi...@googlegroups.com
అవును ఇది సరియగు సమాధానంగ వున్నది,
సంస్కృతం లో "భవదీయుడు" అని వ్రాయడం నేను చదివాను,
ఇది "నీ శ్రేయోబిలాషి " అర్ధం అని నా అభిప్రాయం.
ఎమైన  తప్పులు ఉంటే మన్నించమని  ప్రార్ధన.

ఇట్లు,
-సాయి సుదాకర్ 
2010/4/6 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>



--
Thanks,
-S

Dr.R.P.Sharma

未读,
2010年4月6日 22:25:342010/4/6
收件人 సాహిత్యం
అయ్యా !
ఆసక్తికరమైన చర్చ జరిగింది. మొదటే టేకుమళ్ళవారు సరిగానే వివరించారు.
భవదీయుడు పదం తెలుగు నిఘంటువుల్లో దొరకకుంటే దొరకక పోవచ్చుగాక.
ఎందుకంటే -
మనం వినే ఇటువంటి సంస్కృతపదాలు చూడండి.
దేశీయ పదజాలం, రాష్టీయ అసమానతలు, మానవీయ సంబంధాలు, జతీయ సంపద మొదలైనవి.
(స్పష్టత కోసం వేరేపదాలతో సమసించిన పదాలను ఇచ్చాను.) వీటిని
దేశ+ఈయ; రాష్ట్ర+ఈయ; మానవ+ఈయ; జాతి+ఈయ అనే విధంగా విభజించాలి.
ఇందులో మొదటిది పదం(ప్రకృతి).రెండవది ప్రత్యయం. ‘ఈయ’ అనేప్రత్యయానికి పై
ఉదాహరణలవల్ల
‘సంబంధించిన’ అనే అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి-
భవదీయ< భవత్+ ఈయ అని విభజించాలి.
ఇందులో భవత్ అనేది టేకుమళ్ళవారు చెప్పినట్టు ...‘తమరు’ అనే అర్థం ఇచ్చే
శబ్దం. దాన్ని భవచ్ఛబ్దం అంటారు.
దీనికి సంస్కృతంలో మూడులింగాల్లోనూ రూపాలున్నాయి.
పుం. భవాన్ భవన్తౌ భవన్త: .........
స్త్రీ . భవతీ భవత్యౌ భవత్య: ........
నపుం. భవత్ భవతీ భవంతీ ........
కాబట్టి - భవత్+ఈయ> భవదీయ= తమరి (Yours)...
ఇక నిఘంటువుల్లో సాధారణంగా మూలపదం మాత్రమే ఇస్తుంటారు. దాని మీద
ప్రత్యయాలు చేరగా ఏర్పడే
కృత్తద్ధిత పదాలు అన్నీ ఇయ్యకపోవచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ఇందుకు కొంత
మినహాయింపు.

ఇంకా భవ శబ్దానికి 1.పుట్టుక 2. సంసారం మొ. అర్థాలూ ఉన్నాయి.
భవత్ శబ్దానికి ‘జరుగుచున్న కాలం’ అనే అర్థం లేకపోయి ఉండవచ్చని
గెడ్డపువారు అభిప్రాయపడినారు.
కాని, జరుగుచున్న/జరగబోయే/జరిగిన అనే అర్థాల్లో ఉంది.
సంస్కృతంలో ‘భూ’ ధాతువు(క్రియ) ఉంది. దానికి ‘సత్తాయాం’ అని అర్థం. సత్తా
అంటే ‘స్థితి’(Status).
మనం వాడే ‘భూత,భవిష్యత్’ పదాలు ఆ ధాతువునుండి పుట్టినవే.వర్తమాన అనే
పదమొక్కటి ‘వృతూ వర్తనే’ అనే వేరొక ధాతువునుండి పుట్టినది.
ఇక ‘అస్మదీయ’ అనే పదం విషయానికి వస్తే..
అస్మద్ శబ్దం (అహం=నేను అనేది ఈ శబ్దరూపమే)పై ఈయ చేరిన రూపం.
-------------------------------------------------------------------
సంస్కృతాంధ్రపుస్తకాల భాండాగారం
http://teluguthesis.com

回复全部
回复作者
转发
0 个新帖子