Fw: [సాహిత్యం] Re: చెలియలి కట్ట

579 views
Skip to first unread message

carani narayanarao

unread,
Jul 31, 2007, 7:43:23 AM7/31/07
to sahi...@googlegroups.com
 అంక్షలు. హద్దులు, అడ్డంకులకు పర్యాయపదంగా 'చెలియలి కట్టలు  '  వాడినట్టున్నారు.

----- Forwarded Message ----
From: cbrao <cbr...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Tuesday, 31 July, 2007 2:49:57 PM
Subject: [సాహిత్యం] Re: చెలియలి కట్ట

నందిని కథలో చెలియలి కట్ట అనే పద  ప్రయోగం సవ్యంగా ఉన్నదా?

నందిని July-2003 (తానా 2003 ప్రథమ బహుమతి కథ)( pdf,html)
http://www.eemaata.com/issue27/nandini.pdf

On 7/31/07, carani narayanarao <caranina...@yahoo.co.in> wrote:
"చెలియలి కట్ట" = సముద్రపు గట్టు; వేల

(చెల్లు: నిలుపు/ ఆపు to cease
అల: తరంగము a wave
కట్ట: ఒడ్డు/గట్టు bank )

the sea-shore, (Literary meaning: "the bank where the wave stops.")
-------------------------------------------------------------------
From: cbrao <cbr...@gmail.com >
To: sahi...@googlegroups.com
Sent: Tuesday, 31 July, 2007 11:22:14 AM
Subject: [సాహిత్యం] చెలియలి కట్ట

"చెలియలి కట్ట" అంటే ఏమిటి?

5, 50, 500, 5000. Store N number of mails in your inbox. Click here.

Did you know? You can CHAT without downloading messenger. Click here

cbrao

unread,
Jul 31, 2007, 1:35:41 PM7/31/07
to sahi...@googlegroups.com
కొన్నాళ్ళ క్రితం నందిని అని ఒక కథ వచ్చింది. దానికి ఏవో పోటీల్లో బహుమతులొచ్చాయి, దాని మీద బోలెడు చర్చ జరిగింది. ఆ కథ చివర్లో రచయిత "చెలియలి కట్ట" అనే మాటని అసందర్భంగా వాడారు. ప్రముఖ కవీ విమర్శకుడూ వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక విమర్శ రాస్తూ ఈ అసందర్భ ప్రయోగాన్ని చేటలో వేసి చెరిగి వొదిలి పెట్టారు. రచన అంటే మాటలతోనే కదా పని? వాడుతున్న మాటలకి అర్థాలే తెలియక పోతే? ఇంక ఆ కథలో రసమేమి పుడుతుంది? తాళంచెవుల గుత్తి గుమ్మటంలా ఉంది అంటే అర్థం తెలుసా మీకు?
-కొత్తపాళి http://vinnakanna.blogspot.com/2007/04/blog-post_04.html
ఇందులో వాడ్రేవు చినవీరభద్రుడు గారి వాదన మీకెవరికైనా తెలుసా?

kotta pali

unread,
Jul 31, 2007, 1:50:16 PM7/31/07
to sahi...@googlegroups.com
నాకు గుర్తున్నంత వరకూ భద్రుడిగారి అభ్యంతరం ఇది -
చెలియలి కట్ట సముద్రపు అలల్ని నియంత్రించి ఉంచేది. ఒక మనిషి సముద్రంలోకి వెళ్ళాలనుకుంటే చెలియలి కట్ట అడ్డం కాదు.
కథ చివర వాక్యం నాయిక నందిని దృక్పథంలో చెప్పారు రచయిత - ఎన్ని చెలియలి కట్టలు దాటితే ఈ వజ్రం దొర్కిందో తనకి. చెలియలి కట్ట నాయికకి అడ్డం అనుకుంటే నాయిక సముద్రమా? పోనీ అదే అనుకుంటే సముద్రం గట్లొరుసుకుని ఒడ్డు మీదికి కదా వచ్చేది - అక్కడ ఏం వజ్రం దొరుకుతుంది? ఓక వేళ దొరికినా ఆ వజ్రం సంపాయించుకుని సముద్రం ఏం బావుకుంటుంది? పోనీ నాయిక మనిషే, వజ్రం కోసం సముద్రం లోకి వెళూతోంది అనుకుంటే చెలియలి కట్ట మనిషికి అడ్డం కాదు
వెరసి ఆ వాక్యంలో చెలియలికట్ట - వజ్రం అనే మెటఫర్ పండలేదు.
భద్రుడు గారు ఇన్నిమాటల్లో చెప్పలేదు గానీ, ఆయన భావం ఇది - నాకు గుర్తున్నంతలో.
కొత్తపాళీ

http://kottapali.blogspot.com
http://vinnakanna.blogspot.com
http://telpoettrans.blogspot.com

Ready for the edge of your seat? Check out tonight's top picks on Yahoo! TV.

radhika rimmalapudi

unread,
Jul 31, 2007, 5:01:39 PM7/31/07
to sahi...@googlegroups.com
భోజనం చివరిలో పోసిన మజ్జిగ చెలియలి కట్టలు దాటితే  వచ్చిన ఆ అతిధి ఇంక వెళ్ళవచ్చని అర్దం అని చిన్నప్పుడు ఎప్పుడో తెలుగు మాష్టారు చెప్పినట్టు గుర్తు.అలాగే కన్నీళ్ళు చెలియలి కట్టలు దాటాయి అన్న ప్రయోగాలు కూడా చాలా కవితల్లో,కధల్లో చదివాను. ఇవన్నీ సరయినవేనా?

Jabalimuni putrevu

unread,
Jul 31, 2007, 7:42:12 PM7/31/07
to sahi...@googlegroups.com
గాలి గుమ్మటము అన్న మాట నేను విన్నాను."బెలూన్‌" అన్న ఆంగ్ల పదానికి బదులు దీనిని ఆ సందర్భములో వాడేరు.తాళం చెవుల గుత్తి గుమ్మటము లాగ వుందంటే ఆ గుత్తిలో తాళాలు యెక్కువగా వుండి అది బెలూన్‌ లాగ వుబ్బి  కనిపించి వుండ వచ్చు.
జాబాలిముని

nagaraj

unread,
Aug 2, 2007, 9:57:22 AM8/2/07
to sahityam

సముద్రుడు - ఒక్క ప్రళయ సమయంలో తప్పించి- చెలియలి కట్ట దాటకూడదనే నియమం
ఉన్నది. ఈ నియమం ప్రకృతి సముద్రుడికి చేసిన శాసనం (రామాయణం - యుద్దకాండ).
సముద్రుడు చెలియలికట్ట అతిక్రమిస్తే ప్రళయం సంభవిస్తుంది, లేదా - ప్రళయం
సంభవించినప్పుడు మాత్రమే సముద్రుడు చెలియలికట్టని అతిక్రమిస్తాడు.

సాంఘికమైన కట్టుబాట్లు, నియమాలు ఇలాటి చెలియలికట్టలే. పదిమంది
కలసికట్టుగా ఒక నియమాన్ని అతిక్రమిస్తే విప్లవం వస్తుంది, ఒకమనిషి
అతిక్రమిస్తే ఆ మనిషి జీవితంలో ఒక ప్రళయం సంభవిస్తుంది.

నందిని కథలో, నందిని కొన్ని నియమాలని అతిక్రమించింది, అందుమూలంగా తన
జీవితంలో ఉత్పన్నమైన ఆటుపోట్లని ఎదుర్కొని విజయం సాధించింది. ముఖ్యంగా
మూడు నియమాలని ఆవిడ అతిక్రమించింది. ఆడది పెళ్ళి చేసుకోవాలి అనేది ఒకటి,
పెళ్ళికాకుండా ఒక పురుషుడుతో కాపురం చెయ్యకూడదనే నియమం మరొకటి, తన కులం,
మతం, దేశానికి చెందనివాడిని పరిణయమాడకూడదన్న నియమం మూడోది.

అందువల్ల - ఎన్ని చెలియలుకట్టలు దాటితే ఆ వజ్రం తనకు దొరికిందో అనే
వాక్యం సముచితమే అని నా అభిప్రాయం. సాధారణంగా, నియమం అతిక్రమించడాన్ని -
గీత దాటడం, లేక లక్షణరేఖ అతిక్రిమించడం అనే ఉపమానంతో చెప్తారు. కాని ఈ
కథలో నందిని స్త్రీ స్వేచ్ఛని పూర్తిగా నమ్మిన వ్యక్తి, అందుకని ఆవిడ
"గీత" దాటడమనే ఉపమానాన్ని కలలో కూడా ఊహించలేదు. చెలియలకట్ట ఉపమానం
అతికినట్టుగా లేదుకాని, అసంధర్భంగా మాత్రం లేదు.

రాధికగారి సందేహం:
అతిధికి కూడా కొన్ని నియమాలున్నాయి - సరిగా గుర్తులేదు కాని - మూడు
పూటలో, ఆరుపూటలో మాత్రమే అతిధి ఉండవచ్చు. ఆ నియమం తప్పినప్పుడు - కంచం
అంచు అనే చెలియలి కట్ట దాటేటట్టుగా మజ్జిగ పోసి (కంచంనిండిపోయి, కిందకి
కారిపోయేటట్టుగా మజ్జిగ పొయ్యడమనేది - వడ్డన మర్యాదని అతిక్రమించడమేకదా?)
- ఆ అతిధికి అయ్యా, ఇక నువ్వు దయచెయ్యవలసిన సమయం మించిపోయింది సుమా అని
గుర్తు చెయ్యడం.

నాగరాజు.

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Aug 2, 2007, 11:31:37 AM8/2/07
to sahi...@googlegroups.com
రాధికగారి సందేహం:
అతిధికి కూడా కొన్ని నియమాలున్నాయి - సరిగా గుర్తులేదు కాని - మూడు
పూటలో, ఆరుపూటలో మాత్రమే అతిధి ఉండవచ్చు. ఆ నియమం తప్పినప్పుడు - కంచం
అంచు అనే చెలియలి కట్ట దాటేటట్టుగా మజ్జిగ పోసి (కంచంనిండిపోయి, కిందకి
కారిపోయేటట్టుగా మజ్జిగ పొయ్యడమనేది - వడ్డన మర్యాదని అతిక్రమించడమేకదా?)
- ఆ అతిధికి అయ్యా, ఇక నువ్వు దయచెయ్యవలసిన సమయం మించిపోయింది సుమా అని
గుర్తు చెయ్యడం.

నాగరాజు.
 
నాగరాజుగారి వివరణకు చిన్న సవరణ. కొన్ని దశాబ్దాల కిందటి వరకూ అతిధికి ఆకు(అరటి/విస్తరి)లో వడ్డించడం జరిగేది. ఆకులో మజ్జిగ నిలవదు గనుక అన్నమో, సంగటిముద్దో ఒకచిన్న మడుగులాగా చేసుకుంటే, అందులో మజ్జిగ పోసేవారు. అది కట్టదాటి ఆకును దాటేలోపు కలిపేసుకోవడం జరిగేది. ఇలా మజ్జిగన్నం కలుపుకోవడానికి సహకరిస్తూ కొద్దికొద్దిగా మజ్జిగపోయడం మర్యాద. కట్టదాటేలా మజ్జిగపోయడం అంటే, సామెత చెప్పినట్టు - "మూణ్ణాళ్లకు మురికి చుట్టం" అయ్యాడని ఆ అతిధి గ్రహించాలని.

--
~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

cbrao

unread,
Aug 2, 2007, 12:34:27 PM8/2/07
to sahi...@googlegroups.com
రచయిత తన ఊహా శక్తి, సృజనాత్మకత ఉపయోగించి, చెలియలికట్ట కు సామాజిక కట్టుబాట్లు దాటటం అనే కొత్త అర్థం వచ్చేలా పద ప్రయోగం చేయటం జరిగింది. ఇది పాఠకులకు అర్థమయ్యే రీతిలో వాడటం జరిగింది.కాని సాంప్రదాయ అర్థాన్ని దాటి రచయిత కూడా చెలియలి కట్ట దాటారని, వాడ్రేవు చినవీరభద్రుడు గారు అభిప్రాయపడటం జరిగింది.

మాయా బజార్ లో, పింగళి గారన్నట్లు, మనం సృష్టించక పోతే, కొత్త పదాలు, కొత్త అర్థాలు ఎలా వస్తాయి?  నందిని రచయిత వీరతాడుకు అర్హుడవునో కాదో పాఠకులే చెప్పాలి.    

carani narayanarao

unread,
Aug 3, 2007, 4:25:37 PM8/3/07
to sahi...@googlegroups.com

రచయిత ఉపయోగించిన 'చెలియలి కట్ట ' , నా దృష్టిలో ఓ అపప్రయోగమే!

కడలి, చెలియలి కట్ట దాటిందంటే ఏ ఉప్పెనో,సునామీనో సృష్టిస్తుంది.

ఈ ప్రకృతి వైపరీత్యంవల్ల అపారమైన ఆస్తినష్టం, ప్రాణ హానీ కలుగుతాయి.దాన్నుండి కోలుకోవడానికి ఏండ్లు పూండ్లు పడతాయి.

నందిని విషయంలో చెలియలి కట్ట దాటడంవల్ల, ఎటువంటి ఉపద్రవాలు జరగలేదు. నందిని స్నేహితురాలు కాస్త సణిగిందేమో, అంతే! తల్లితండ్రులు ఆత్మహత్యలేమీ చేసుకోలేదు. చెళ్ళెళ్ళకు పెళ్ళిళ్ళాగిపోవడం, ఉంచుకున్నవాడు ఉడాయించడం, సంఘ బహిష్కరణలు - అటువంటిదేమి జరగలేదే! పోనీ నందిని భారతదేశంలో ఉండిఉంటే పెళ్ళిపెటాకులు లేకుండా ఓ మగాడితో సహజీవనం చేసుండేదా? అమెరికాలో పెళ్ళిపెటాకులులేకుండా ఓ ఆడ మగ సహజీవనం చెయ్యడం సర్వసాసాధారణం! అక్కడ అది ఎవ్వరూ పట్టిచ్చుకోరు. ఇదే నందిని భారతదేశంలో చేస్తే, హద్దులు దాటిందనవచ్చు , కానీ అమెరికాలో కాదు.

నందిని తల్లితండ్రులు అమెరికాకొచ్చి, ఇంచక్కా సంతోషంగా నందిని, మార్క్ లతో ఉన్నారు . గొణుగుడు, సణుగుడు ఇంత కూడా లేదు. నందిని ఆస్తి , అంతస్తులను, ఓ అందమైన (తెల్లటి అమరికన్) అబ్బాయిని  సంపాయించుకొంది (స్వదేశంలో, నందిని అనాకారితనానికి అబ్బాయి దొరకడమే అరుదై ఉండేది). ఆ అమరికన్ అబ్బాయీ, నందినిని పెళ్ళిచేసుకోడానికి తయారుగా ఉన్నాడు. చక్కటి బాబు.అన్నీ హ్యాప్పీసే! సుఖాంతమే!

కాబట్టి నందిని దాటింది 'చెలియలి కట్టలు ' కాదు.

నందిని జీవితం అతలకుతలమై,విషాదాంతమై ఉంటే  'చెలియలి కట్టలు '  దాటిందనే సామ్యం సరిపోయుండేది!

------------------------------------------------------------------------

Get the freedom to save as many mails as you wish. Click here to know how.

radhika rimmalapudi

unread,
Aug 4, 2007, 10:19:37 AM8/4/07
to sahi...@googlegroups.com

ఆంక్షలు,హద్దులు అని వాడే చోట్ల చెలియలికట్టలు అని వాడడం పల్లెటూళ్ళల్లో సహజం.[పైన ఒక చోట మీరు కూడా ఆ మాట అన్నారు]మరి ఇక్కడ కూడా రచయిత అదే వుద్దేస్యం లో వాడారనుకోవచ్చు కదా.ఎక్కడో చదివాను"అదిమిపెట్టిన దు:ఖం చెలియలి కట్టలు దాటింది" అని[అచ్చూ ఇవే పద ప్రయోగాలు కాదనుకుంటాను.సరిగా గుర్తులేదు.భావం మాత్రం ఇదే.] ,అలాగే అతిధి-భోజనం లో కూడా చెలియలి కట్టలు వాడతారని అందరికీ తెలిసిందే[ఈ దారం లోనే మాట్లాడుకున్నాము] మరి ఇక్కడ ఉపద్రవాలేవీ జరిగినట్టు కాదుకదా.నాకు వీటి గురించి పెద్దగా తెలియదు.తప్పు గా అడిగి వుంటే పెద్దలు మన్నించాలి.
On 8/3/07, carani narayanarao <caranina...@yahoo.co.in> wrote:

రచయిత ఉపయోగించిన 'చెలియలి కట్ట ' , నా దృష్టిలో ఓ అపప్రయోగమే!

కడలి, చెలియలి కట్ట దాటిందంటే ఏ ఉప్పెనో,సునామీనో సృష్టిస్తుంది.

ఈ ప్రకృతి వైపరీత్యంవల్ల అపారమైన ఆస్తినష్టం, ప్రాణ హానీ కలుగుతాయి.దాన్నుండి కోలుకోవడానికి ఏండ్లు పూండ్లు పడతాయి.

నందిని విషయంలో చెలియలి కట్ట దాటడంవల్ల, ఎటువంటి ఉపద్రవాలు జరగలేదు. నందిని స్నేహితురాలు కాస్త సణిగిందేమో , అంతే! తల్లితండ్రులు ఆత్మహత్యలేమీ చేసుకోలేదు. చెళ్ళెళ్ళకు పెళ్ళిళ్ళాగిపోవడం, ఉంచుకున్నవాడు ఉడాయించడం, సంఘ బహిష్కరణలు - అటువంటిదేమి జరగలేదే! పోనీ నందిని భారతదేశంలో ఉండిఉంటే పెళ్ళిపెటాకులు లేకుండా ఓ మగాడితో సహజీవనం చేసుండేదా? అమెరికాలో పెళ్ళిపెటాకులులేకుండా ఓ ఆడ మగ సహజీవనం చెయ్యడం సర్వసాసాధారణం! అక్కడ అది ఎవ్వరూ పట్టిచ్చుకోరు. ఇదే నందిని భారతదేశంలో చేస్తే, హద్దులు దాటిందనవచ్చు , కానీ అమెరికాలో కాదు.

నందిని తల్లితండ్రులు అమెరికాకొచ్చి, ఇంచక్కా సంతోషంగా నందిని, మార్క్ లతో ఉన్నారు . గొణుగుడు , సణుగుడు ఇంత కూడా లేదు. నందిని ఆస్తి , అంతస్తులను, ఓ అందమైన (తెల్లటి అమరికన్) అబ్బాయిని  సంపాయించుకొంది (స్వదేశంలో, నందిని అనాకారితనానికి అబ్బాయి దొరకడమే అరుదై ఉండేది). ఆ అమరికన్ అబ్బాయీ , నందినిని పెళ్ళిచేసుకోడానికి తయారుగా ఉన్నాడు. చక్కటి బాబు.అన్నీ హ్యాప్పీసే! సుఖాంతమే!

కాబట్టి నందిని దాటింది 'చెలియలి కట్టలు ' కాదు.

నందిని జీవితం అతలకుతలమై, విషాదాంతమై ఉంటే  'చెలియలి కట్టలు '  దాటిందనే సామ్యం సరిపోయుండేది!

kotta pali

unread,
Aug 4, 2007, 10:58:17 AM8/4/07
to sahi...@googlegroups.com
నారాయణ రావుగారు,
మీరు నందిని పాత్రని తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. అఫ్కోర్సు, ఒకే కథని ఒకే పాత్రని వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా గ్రహించవచ్చు - దేన్నైనా అర్థం చేసుకోడానికి ఒకే సరైన పద్ధతి ఉండక్కర్లేదనుకోండి.
చెలియలి కట్ట సరైన ప్రయోగమా కాదా అన్న విషయం ఒక నిమిషం పక్కకి పెట్టండి.
నందిని పాత్రని గురించి నాకు తోచిన విషయాలు.
1) భారత దేశంలోనే ఉన్నా నందిని బహుశా ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగేదనే నేను అనుకుంటున్నా. ఐతే ఆమె ఆలోచనలకి తగిన మగవాడు పెళ్ళి అక్కర్లేకుండా తోదు ఉండగలిగే మగవాడు దొరకడం కష్టం.
2) అమెరికాలో ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడం "చెలియలి కట్ట దాటినట్టు కాదు" అన్నారు మీరు. ఇండియాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి, అమెరికాలో అయినా తింబక్తూలో ఐనా అటువంటి నిర్ణయం తీసుకో గలగడం చాలా రివొల్యూషనరీ అని నమ్ముతాను నేను. అదీ గాక, ఈ కథలోనే, నందిని-మాధవి ల మధ్య సంభాషణలో నందిని ఈ విషయంగా ఎంత అంతస్సంఘర్షణ పడిందో స్పష్టంగా తెలుస్తోనే ఉంది.
3) మీరు చెప్పిన ఉపద్రవాలు వస్తే - వాటిని తట్టుకుని నిలిస్తే - అప్పుడు తాత్కాలిక అవసరాల కోసం ధీరోదాత్తంగా ప్రవర్తించినట్టు అవుతుంది. వేరే ప్రేరణ ఏదీ లేకుండా ఒక మనిషి "ఇది సత్యం, ఇది ధర్మం, నేను ఇలా చెయ్యాలి" అనుకోవటం అదీ నిజమైన ధీరోదాత్తత.
ఎనీవే .. ఏంటో అసలు టపిక్కు ని వొదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నా. ఈ చర్చ మరీ గందరగోళంగా తయారవుతున్నట్టు ఉందా? ఐతే క్షమించాలి.
భవదీయుడు,
కొ.పా.
----- Original Message ----
From: carani narayanarao <caranina...@yahoo.co.in>
To: sahi...@googlegroups.com
Sent: Friday, August 3, 2007 4:25:37 PM
Subject: [సాహిత్యం] Re: Fw: [సాహిత్యం] Re: చెలియలి కట్ట

రచయిత ఉపయోగించిన 'చెలియలి కట్ట ' , నా దృష్టిలో ఓ అపప్రయోగమే!

కడలి, చెలియలి కట్ట దాటిందంటే ఏ ఉప్పెనో,సునామీనో సృష్టిస్తుంది.

ఈ ప్రకృతి వైపరీత్యంవల్ల అపారమైన ఆస్తినష్టం, ప్రాణ హానీ కలుగుతాయి.దాన్నుండి కోలుకోవడానికి ఏండ్లు పూండ్లు పడతాయి.

నందిని విషయంలో చెలియలి కట్ట దాటడంవల్ల, ఎటువంటి ఉపద్రవాలు జరగలేదు. నందిని స్నేహితురాలు కాస్త సణిగిందేమో, అంతే! తల్లితండ్రులు ఆత్మహత్యలేమీ చేసుకోలేదు. చెళ్ళెళ్ళకు పెళ్ళిళ్ళాగిపోవడం, ఉంచుకున్నవాడు ఉడాయించడం, సంఘ బహిష్కరణలు - అటువంటిదేమి జరగలేదే! పోనీ నందిని భారతదేశంలో ఉండిఉంటే పెళ్ళిపెటాకులు లేకుండా ఓ మగాడితో సహజీవనం చేసుండేదా? అమెరికాలో పెళ్ళిపెటాకులులేకుండా ఓ ఆడ మగ సహజీవనం చెయ్యడం సర్వసాసాధారణం! అక్కడ అది ఎవ్వరూ పట్టిచ్చుకోరు. ఇదే నందిని భారతదేశంలో చేస్తే, హద్దులు దాటిందనవచ్చు , కానీ అమెరికాలో కాదు.

నందిని తల్లితండ్రులు అమెరికాకొచ్చి, ఇంచక్కా సంతోషంగా నందిని, మార్క్ లతో ఉన్నారు . గొణుగుడు, సణుగుడు ఇంత కూడా లేదు. నందిని ఆస్తి , అంతస్తులను, ఓ అందమైన (తెల్లటి అమరికన్) అబ్బాయిని  సంపాయించుకొంది (స్వదేశంలో, నందిని అనాకారితనానికి అబ్బాయి దొరకడమే అరుదై ఉండేది). ఆ అమరికన్ అబ్బాయీ, నందినిని పెళ్ళిచేసుకోడానికి తయారుగా ఉన్నాడు. చక్కటి బాబు.అన్నీ హ్యాప్పీసే! సుఖాంతమే!

కాబట్టి నందిని దాటింది 'చెలియలి కట్టలు ' కాదు.

నందిని జీవితం అతలకుతలమై,విషాదాంతమై ఉంటే  'చెలియలి కట్టలు '  దాటిందనే సామ్యం సరిపోయుండేది!

------------------------------------------------------------------------

From: cbrao <cbr...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Thursday, 2 August, 2007 10:04:27 PM
Subject: [సాహిత్యం] Re: Fw: [సాహిత్యం] Re: చెలియలి కట్ట

రచయిత తన ఊహా శక్తి, సృజనాత్మకత ఉపయోగించి, చెలియలికట్ట కు సామాజిక కట్టుబాట్లు దాటటం అనే కొత్త అర్థం వచ్చేలా పద ప్రయోగం చేయటం జరిగింది. ఇది పాఠకులకు అర్థమయ్యే రీతిలో వాడటం జరిగింది.కాని సాంప్రదాయ అర్థాన్ని దాటి రచయిత కూడా చెలియలి కట్ట దాటారని, వాడ్రేవు చినవీరభద్రుడు గారు అభిప్రాయపడటం జరిగింది.

మాయా బజార్ లో, పింగళి గారన్నట్లు, మనం సృష్టించక పోతే, కొత్త పదాలు, కొత్త అర్థాలు ఎలా వస్తాయి?  నందిని రచయిత వీరతాడుకు అర్హుడవునో కాదో పాఠకులే చెప్పాలి.    

On 8/2/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com> wrote:
రాధికగారి సందేహం:
అతిధికి కూడా కొన్ని నియమాలున్నాయి - సరిగా గుర్తులేదు కాని - మూడు
పూటలో, ఆరుపూటలో మాత్రమే అతిధి ఉండవచ్చు. ఆ నియమం తప్పినప్పుడు - కంచం
అంచు అనే చెలియలి కట్ట దాటేటట్టుగా మజ్జిగ పోసి (కంచంనిండిపోయి, కిందకి
కారిపోయేటట్టుగా మజ్జిగ పొయ్యడమనేది - వడ్డన మర్యాదని అతిక్రమించడమేకదా?)
- ఆ అతిధికి అయ్యా, ఇక నువ్వు దయచెయ్యవలసిన సమయం మించిపోయింది సుమా అని
గుర్తు చెయ్యడం.

నాగరాజు.
 
నాగరాజుగారి వివరణకు చిన్న సవరణ. కొన్ని దశాబ్దాల కిందటి వరకూ అతిధికి ఆకు(అరటి/విస్తరి)లో వడ్డించడం జరిగేది. ఆకులో మజ్జిగ నిలవదు గనుక అన్నమో, సంగటిముద్దో ఒకచిన్న మడుగులాగా చేసుకుంటే, అందులో మజ్జిగ పోసేవారు. అది కట్టదాటి ఆకును దాటేలోపు కలిపేసుకోవడం జరిగేది. ఇలా మజ్జిగన్నం కలుపుకోవడానికి సహకరిస్తూ కొద్దికొద్దిగా మజ్జిగపోయడం మర్యాద. కట్టదాటేలా మజ్జిగపోయడం అంటే, సామెత చెప్పినట్టు - "మూణ్ణాళ్లకు మురికి చుట్టం" అయ్యాడని ఆ అతిధి గ్రహించాలని.

--
~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

Get the freedom to save as many mails as you wish. Click here to know how.

Park yourself in front of a world of choices in alternative vehicles.
Visit the Yahoo! Auto Green Center.
Reply all
Reply to author
Forward
0 new messages