విరాటపర్వం

49 views
Skip to first unread message

jyothi valaboju

unread,
Jun 24, 2009, 4:49:54 AM6/24/09
to sahi...@googlegroups.com

నిన్న వార్తలలో చూసాను. సకాలంలో వానలు పడకుంటే విరాటపర్వం చదివితే వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇది మూఢ నమ్మకం కాదు, నిజంగా జరుగుతుంది అంటున్నారు గ్రామస్తులు. ఇదెలా సాధ్యం. విరాతపర్వానికి, వానకు సంబంధమేంటి???

--
జ్యోతి వలబోజు
http://jyothivalaboju.blogspot.com
http://shadruchulu.com

v.b.d.rao ballepalli

unread,
Jun 24, 2009, 8:43:22 AM6/24/09
to sahi...@googlegroups.com
ధార్మికుల విజయం సృష్టికి సంతోషకారకం . పాపభారం పెరగటము వల్న వానలు కురవవు .కనుక ధర్మాత్ములైన పాండవుల విజయాన్ని గురించే ఈ పారాయణం .దీనివలన వర్షాలు కురవటం .ఎన్నోసార్లు నిరూపించబడినది. ఐనా జెరూసలెం వెల్లి ప్రార్ధనలు చేయటం వలన  వర్షాలు పడి రాష్టం సుభిక్షం గావున్నదని ఈరాష్ట్ర అధినేత అన్నప్పుడు రాని సందేహం ,అనుమానం ఈ విషయం లో కలిగినది ,ఇదీ మనఖర్మ .ఏంచేద్దాం

2009/6/24 jyothi valaboju <jyothiv...@gmail.com>

jyothi valaboju

unread,
Jun 24, 2009, 10:03:20 AM6/24/09
to sahi...@googlegroups.com
 దుర్గేశ్వర గారు, వై.ఎస్.ఆర్ ఆ మాటలు అన్నాడని నాకు తెలిదు.. ఈ సంగతి నిన్న వార్తలలో చూస్తె తెలిసింది అందుకే అడిగాను. కాని వానలకు విరాట పర్వానికి మాత్రమె సంబంధముందా. అటువంటి గాధలు వేరే లేవా అని ??

Aasish Pappu

unread,
Jun 24, 2009, 10:14:33 AM6/24/09
to sahi...@googlegroups.com
రుక్మిణి కళ్యాణం చదివితే పెళ్ల్లి జరుగుతుందని ...
ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చదవాలి అని ...
సర్పదోషం ఉంటె భాగవత కథలు వినమని ...

ఇలా కొన్ని కొన్ని నమ్మకాలు ఉన్నాయి ... ఒక విధంగా ఇలాంటివి మంచి నమ్మకాలే .. మనిషి అగమ్యగోచరంగా ఉన్నప్పుడు మానసిక స్థితిని మెరుగు పరచడానికి ఇలాంటి కథలు పురాణాలు చాల బాగా ఉపయోగపడతాయి అని నా అభిప్రాయం.

-ఆశీష్



24 జూన్ 2009, 10:03 am న, jyothi valaboju <jyothiv...@gmail.com> ఇలా రాసారు :

 దుర్గేశ్వర గారు, వై.ఎస్.ఆర్ ఆ మాటలు అన్నాడని నాకు తెలిదు.. ఈ సంగతి నిన్న వార్తలలో చూస్తె తెలిసింది అందుకే అడిగాను. కాని వానలకు విరాట పర్వానికి మాత్రమె సంబంధముందా. అటువంటి గాధలు వేరే లేవా అని ??






--
Aasish Kumar Pappu

v.b.d.rao ballepalli

unread,
Jun 24, 2009, 11:57:19 AM6/24/09
to sahi...@googlegroups.com
భగవంతుని ఆశ్రయించి చేసే ఎప్రార్ధనైనా పదిమంది మే లు కోసం కోరి చేస్తే తప్పని సరిగా ఫలితాన్నిస్తాయి. అది ఏమత ప్రకారమైనా సరే .అన్నది నా అభిప్రాయం

2009/6/24 Aasish Pappu <aas...@gmail.com>

obul

unread,
Jun 25, 2009, 11:25:21 PM6/25/09
to సాహిత్యం
విరాట పర్వంలోని పంచమాశ్వాసంలో అనావృష్టి, కరువు, వర్షాల ప్రస్తావన ఉండటం
వల్లే వర్షాలు పడనప్పుడు ప్రజలు విరాట పర్వం చదవడం ఆనవాయితీగా వస్తోందని
నా అభిప్రాయం . ఉత్తరగోగ్రహణంలో విజయం సాధించామన్న సమాచారం తెలుసుకున్న
మత్స్య దేశాధిపతి విరటుడు ఆ ఆనంద సమయంలో కంకుభట్టు (ధర్మరాజు)తో
జూదమాడేందుకు ఉపక్రమిస్తాడు. ఆ సమయంలో సైరంధ్రి (ద్రౌపది) కూడా
అంతఃపురంలోనే ఉంటుంది. తన కుమారుడైన ఉత్తరుని పరాక్రమం వల్లే ఉత్తర
గోగ్రహణం లో కౌరవులు ఓటమి పాలయ్యారని విరటుడు కంకుభట్టుతో అంటాడు.
విరటుని అభిప్రాయంతో కంకుభట్టు ఏకీభవించడు. బృహన్నల (అర్జునుడు) గొప్పతనం
వల్లే విజయం సంభవించి ఉంటుందని అంటాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం
జరుగుతుంది. విరటుడు ఆగ్రహావేశుడై తన చేతిలోని సారెతో కంకుభట్టు నుదిటిపై
బలంగా కొడతాడు. కంకుభట్టు నుదిటి నుండి రక్తం చిందుతుంది. అక్కడే ఉన్న
సైరంధ్రి వారిద్దరినీ సమీపించి పక్కనే ఉన్న బంగారు కలశం లోని నీటితో
కంకుభట్టు నుదిటిని తుడిచి రక్తం స్రవించకుండా చీరకొంగుతో గాయాన్ని
అదిమి పడుతుంది. అలా ఎందుకు చేశావని విరటుడు కంకుభట్టును ప్రశ్నిస్తాడు.
అప్పుడు సైరంధ్రి ..
"విమల వంశంబున బుణ్యవృత్తమున వరలు నీతని రక్తంబు వసుమతీశ !
ధరణిపై ఎన్ని బిందువుల్ దొరగె నన్ని వర్షములు గలుగు నిందనా వర్ష భయము
"
అని అంటుంది.
- కల్మశంలేని వంశంలో మంచి నడవడికతోనూ ధర్మంగా జీవించే ఇతడి రక్త
బిందివులెన్ని భూమి మీద పడితే అన్నేల్లు ఈ దేశంలో అనావృష్టి కలుగుతుందని
పై పద్యం అర్థం .
ధర్మపరులైన వారిని హింసిస్తే ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయనే
హెచ్చరికను ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
విరాటపర్వం చదవడం ద్వారా ప్రజల్లో ధర్మనిరతి పెరుగుతుందని, తద్వారా
ప్రకృతి పులకించి వర్షాలు కురుస్తాయనే సందేశం విరాటపర్వంలో ఇమిడి ఉందని
భావించవచ్చు.

-తవ్వా ఓబుల్ రెడ్డి

padma kala

unread,
Jun 26, 2009, 4:44:34 AM6/26/09
to sahi...@googlegroups.com
ఓబుల్ రెడ్డిగారూ .. మంచి విషయాలు చెప్పారు.

26 జూన్ 2009, 8:55 am న, obul <tavvaob...@gmail.com> ఇలా రాసారు :

Appaji Posina

unread,
Jun 27, 2009, 10:59:56 AM6/27/09
to sahi...@googlegroups.com
chalaa manchi vishayam chepparu obul reddy garu

2009/6/26 padma kala <kala.p...@gmail.com>



--
appaaa
Reply all
Reply to author
Forward
0 new messages