తెలుగులో గొప్ప నవలలు?

623 views
Skip to first unread message

nagaraj

unread,
May 3, 2007, 6:08:52 AM5/3/07
to sahityam
పనిలేని మంగలాడు పిల్లిబుర్ర గొరిగినట్టు - ఏం తోచటంలేదు, అందుకే ఇలా మన
గుంపునోసారి కెలుకుదామనిపించింది.

తెలుగులో కథలు చాలా ఎక్కువగానే ఉన్నాయి, అందులోనూ, ప్రపంచ సాహిత్యానికి ఏ
మాత్రం తీసిపోని గొప్ప కథకులు మనకి చాలా మందే ఉన్నారు. కథకున్నంత స్థాయి
తెలుగులో నవలలకుందంటారా?
మనకి గొప్ప నవలలు - పది కాలాలు పాటు నిలిచేవి ఎన్ని ఉన్నాయి?

తెలుగు సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన నవలలు పట్టి ఒకటి తయారు
చేద్దామా?

నాకు గుర్తున్నవి కొన్ని:
వీరేశలింగం - రాజశేఖర చరిత్ర
విశ్వనాధ - వేయిపడగలు
తాపీ ధర్మారావు - ??
అడివి బాపిరాజు - నారాయణరావు
తెన్నేటి సూరి - ఛెంఘీజ్‌ఖాన్
బుచ్చిబాబు - చివరకు మిగిలేది
గోపిచంద్ - అసమర్ధుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా
మహీధర రామమోహనరావు - కొల్లాయి గట్టితేనేమి
దాసరధి రంగాచార్య - మాలపల్లి (?)
రంగనాయకమ్మ - బలిపీఠం, స్వీట్‌హోం (?)
కుటుంబరావు: చదువు
వడ్డెర చండీదాస్: హిమజ్వాల
నోరి నరసింహశాస్త్రి: నారయణభట్టు, తిక్కనమీద, ఎర్రాప్రగెడ మీద రాసిన నవలల
పేర్లు గుర్తులేవు, ధూర్జటి, కవిద్వయము
చలం: మైదానం


ఇంకా...???

యండమూరి, యద్దనపూడి, మాదిరెడ్డి, మల్లాది, ఆనందారామం, వాసిరెడ్డి
సీతాదేవి, బీనాదేవి - వీరందరికీ క్లాసికల్ స్టేటస్ ఇవ్వొచ్చా?

kotta pali

unread,
May 3, 2007, 7:23:36 AM5/3/07
to sahi...@googlegroups.com
మంచి లిస్టండీ నాగరాజు గారూ.

అన్నట్టు, మొన్నెప్పుడో కిరణ్ పద్యం మీదా మీ వ్యాఖ్య .. వాడిన పూల అగరు ధూపాలు .. ఉక్కిరిబిక్కిరి చేసింది.

నోరి వారి చారిత్రక నవలలు రెండు ఈ మధ్యనే చదివాను. ఒకలాంటి అభిరుచి ఉన్న పాఠకులు సరదాగా చదువుకోవచ్చు గానీ అవి ఏ వధంగానూ సెమినల్ వర్క్సు కాదు.

మాలపల్లి రాసింది ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు.
రంగనాయకమ్మ ముఖ్య నవల జానకి విముక్తి అని తెలిసిన వారంటారు.

దాశరథి - చిల్లర దేవుళ్ళు
ఉప్పల లక్ష్మణరావు - అతడు ఆమె
రావూరి భరద్వాజ - పాకుడు రాళ్ళు
వాసిరెడ్డి సీతాదేవి - మట్టిమనిషి
రావి శాస్త్రి - ??

యద్దనపూడి సెక్రటరీ, యండమూరి తులసీదళం రెండు వేర్వేరు ప్రభంజనాల్ని సృష్టించాయి, ఆ వెల్లువలో వచ్చిన నవలలకి ఆ రెండూ మంచి ఉదాహరణలు కూడా. కానీ "మంచి నవల" కావాలని చూస్తే నేను యద్దనపూడి కీర్తి కిరీటాలు, యండమూరి రాధా-కుంతి ఎన్నుకుంటాను.




Ahhh...imagining that irresistible "new car" smell?
Check out new cars at Yahoo! Autos.

nagaraj

unread,
May 3, 2007, 8:02:48 AM5/3/07
to sahityam
తప్పులు సవరించినందుకు ధన్యవాదాలు కొత్తపాళీగారు.
నోరి వారి చారిత్రక నవలల్లో చరిత్ర కన్నా కల్పనే ఎక్కువుంటుందనా వాటిని
సెమినల్ వర్క్స్ కాదన్నది?
రంగనాయకమ్మ జానకి విముక్తి చాలా కాలం క్రితం మార్క్సిజం వేడిలో
ఉన్నప్పుడు చదివేను. ఆవిడ మాగ్నమ్-ఓపస్ కదా ఆ నవల?
ఆ నవల ఏదో వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, పాఠకులు భరించలేక
దానిని ఆపుచేయించేరని నేనో కథ విన్నాను - నిజమేనా?
యధ్దనపూడి నవలల్లో నాకైతే జాహ్నవి చాలా నచ్చింది అప్పట్లో.
యండమూరి రాధా-కుంతి నేను చదివిన గుర్తులేదు. ఈ సారి చదువుతాను. నాకు అతని
నవలల్లో నిశ్శభ్ధం నీకు నాకు మధ్య చాలా ఇష్టం. యండమూరు రాసిన కథలు చాలా
గొప్పగా ఉంటాయి - ముఖ్యంగా, ఆ ఒక్కటి అడక్కు, పురుషోత్తమరావు ఫొటో
(పురుషోత్తముడి ఫొటో?)

Veeven (వీవెన్)

unread,
May 3, 2007, 8:47:45 AM5/3/07
to sahi...@googlegroups.com

kotta pali

unread,
May 3, 2007, 10:06:20 AM5/3/07
to sahi...@googlegroups.com
దాందేముంది సార్, మంచి టాపిక్కు మొదలెట్టారు.

అన్నట్టు కొన్ని విజయనగరం (ఇజ్జీనారం??) కొచ్చినులున్నాయి, మిమ్మల్ని అడగొచ్చా?
 
నోరి వారి చారిత్రక నవలలు - నేను చదివిన రీప్రింట్లలో వారి అబ్బాయి ముందుమాటలాగా రాస్తూ మా నాయనగారు చాలా శాసనాలూ అవీ లోతుగా పరిశోధించి రాశారు అని వెల్లడించారు. specific incidents దగ్గరికి వస్తే మనకి ఆయా కాలాలగురించి నిర్ధిస్టమైన దాఖలాలు లేవని నా అభిప్రాయం. అంచేత చరిత్ర పాలు తక్కువై కల్పన ఎక్కువైనా పరవాలేదు. నాకొచ్చిన గొడవ ఇది - నవల అనేటప్పటికి దానికొక ప్రాతిపదిక ఉండాలి - ఊరకే జరిగిన విషయాలని ఇలా జరిగిందని ఏకరువు పెట్టడం కాక మొత్తమ్మీద ఒక పథకం, ప్రణాళిక ఉండాలి, పాత్రలూ, సన్నివేశాలూ దానికి తగ్గట్టు మలుచుకోవాలి. నేను చదివిన రెండు నవలల్లోనూ ఇది లోపించింది. కాపోతే శ్రీనాథ కవిసార్వభౌముడులో ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడి చాటువులు కొన్ని, ఆహా ఆయన ఇలాంటి సందర్భంలో ఇవి చెప్పుండచ్చు అనుకునేట్టుగా రాశారు.
 
జానకి విముక్తి బహుశా పురాణం సుబ్రహ్మణ్యశర్మ సంపాదకుడుగా ఉన్నటైములో ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చి ఉండొచ్చు. దాన్ని ఆపటం గురించి ఆందోళన విషయం నాకు తెలీదు. ఆవిడ రచనలన్నీ కొన్నాను ఒకప్పుడు. రామాయణ విషవృక్షం మొత్తం దీక్షగా చదివాను నాలుగేళ్ళ క్రితం. కొన్ని ఘట్టాలు చాలా బాగా రాసింది. జానకి విముక్తి చదవడానికి ఇంకా సమయం రాలా :-)
యద్దనపూడివన్నీ చదివాననుకున్నానే? జాహ్నవి గుర్తు రావట్లేదు. కీర్తికిరీటాలు నాకిష్టవైన నవలే కానీ - ఆవిడ రచనల్లో బెష్టు అని చెప్పుకోవాలంటే "మీనా" సరైనదేమో. ఉత్తమపురుష కథనంలో సమర్థవంతంగా నడిపించిన నవలల్లో అదొకటి.
 
లోపల ఘనమేమీ లేకుండా చాలా బరువున్నట్టు భ్రమింపచెయ్యడంలో యండమూరి అఖండుడు. చిరుచిరు సంఘటనలతో పాఠకుల మనసు చలించేట్టు రాయడంకూడా అతనికి తెలుసు. ఐతే నా ఉద్దేశంలో రాధా-కుంతి నవల, అతను రాసిన కొన్ని నాటికలు ఈ టెక్కునిక్కులకి అతీతంగా రాశాడని.
 
మిగతా సభ్యులు కూడా నిద్ర మేల్కొని పాల్గొంటే బాగుంటుంది.

nagaraj

unread,
May 3, 2007, 10:32:26 AM5/3/07
to sahityam

kotta pali Vraasenu:

>
> అన్నట్టు కొన్ని విజయనగరం (ఇజ్జీనారం??) కొచ్చినులున్నాయి, మిమ్మల్ని అడగొచ్చా?
>

అడగండి మేషారూ, ఓ రెండురోజులు పెద్దగా పనేం లేదు. మీతో ముచ్చట్లకంటే
కోరేదేం ఉంటుంది?
నాకు తెలిసినవైతే తప్పకుండా చెప్తాను, తెలియనవైతే తెలిసినవాళ్ళనడిగి
తెలుసుకొందాం..

swathi

unread,
May 3, 2007, 10:48:22 AM5/3/07
to sahi...@googlegroups.com
కొమ్మూరి వేణు గోపాల్రావు గారి పెంకుటిల్లు కూడ మంచి నవలల కిందకి వస్తుంది.
ఇక గోపి చంద్ గారు రాస్తూ మధ్యలో ఆపేసిన ఆయన ఆఖరి నవల యమపాశం. ఇది కూడా
చదవవలసిన పుస్తకం.
ఇక యండమూరి దగ్గరకొస్తే మెలోడ్రామా, కమర్షియల్స్ వదిలేస్తే, గొప్పగా
చెప్పుకోదగ్గవి:
ఋషి
ప్రేమ
ఆనందోబ్రహ్మ
అంతర్ముఖం
అనైతికం, మంచు పర్వతం, ధ్యేయం.

యద్దనపూడి వి కొన్ని చాన్నాళ్ళ క్రితం చదివా కానీ అంత గుర్తుండిపోయేలా
ఏమీ అనిపించలేదు.
ఇప్పుడు చదివితే ఏమైన తెలియొచ్చేమో.

రంగనాయకమ్మ గారి స్వీట్ హోం చాలా బాగుంటుంది ముఖ్యం గా అనుదులోని హాస్యం,
సున్నితత్వం.

మైదానం గురించి మాట్లాడితే ఎన్నో విషయాలు మాట్లాడాల్సొస్తుందేమో.
అది నిజం గా చదవవలసిన పుస్తకమా కాదా అంటే చెప్పటానికి నా ఆలోచనా పరిధి చాలదేమో.
ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటో ఎవరైనా చెప్తే తెలుసుకోవాలని ఎప్పట్నుంచో
అనుకుంటున్నాను.

ప్రస్తుతానికింతే.

--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

kotta pali

unread,
May 3, 2007, 11:49:02 AM5/3/07
to sahi...@googlegroups.com
కె ఎన్ వై పతంజలి రచనలు చదువుతున్నాను. ఈయన తూర్పు రాజుల కుటుంబంలో పుట్టాడు. ఈ కుటుంబాల నేపథ్యంలో కొన్ని నవలికలు రాశాడు - రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, మొదలైనవి - వీటన్నిట్లో ఒకదానికోటి లింకులుంటాయి .. అవే పాత్రలు మళ్ళీ మళ్ళీ వస్తూంటాయి, కథలో ఒకదానికోటి సంబంధం లేకపోయినా. నిజానికి కథంటూ కుడా పెద్ద ఏముండదు ఒక్కోసారి - కేవలం, ఒక అంతరించిపోతున్న జాతి జీవనవిధానాన్ని రికార్డు చెయ్యటానికి ఈ నవలికలు రాశాడేమో అనిపిస్తుంది.
ఈ కథలన్నీ ఆలమండ అనే గ్రామంలో జరుగుతాయి. ఇది నిజంగా ఉందో లేదో తెలీదు. చోడవరం తాలూకా, విజయనగరం పట్టణాల ప్రసక్తి బాగా వస్తుంది. పూసపాటి, ఉప్పలపాటి, కాకర్లపూడి వంశాభొధి చంద్రులు కథలనిండా ఉంటారు.
నన్ను బాగా ఆశ్చర్య పరిచిన విషయమేంటంటే ఇందులో రాజులు మాట్లాడే భాషలో చాలా చోట్ల కన్యాశుల్కంలో రావప్పంతులు, గిరీశంల సంభాషణలు గుర్తొస్తాయి.
బేహద్బీ, దేవిడీ మన్నా, బారికి - ఇలాగ బోలెడు. నా మొదటి కొచ్చెను - జనం నిజంగా ఇలా మాట్లాడతారా?
రెండు - అప్పల్నాయుడు అని పేరున్న వ్యక్తిని వెలమలని చెబుతాడూ కథకుడు - ఇది నిజమా? అంటే వీళ్ళు బొబ్బిలి వెలమల జాతి వారా? ఒక వేళ ఐతే వీళ్ళకి మాత్రం రాజసానికి, గొప్పలకీ, పౌరుషాలకీ తక్కువేముంది?
ఆయన రాసిన కొన్ని మాటలు అర్థం కాలేదు. అలాగే కొన్ని సంగతి సందర్భాలు కూడా .. తెలిసినవాళ్ళని అడిగి తెలుసుకుందామని. అవి ఇంటికెళ్ళాక పుస్తకం చూసి రాయాల్సిందే!
ఉంటాను ప్రస్తుతానికి. 

----- Original Message ----
From: nagaraj <nagaraj...@gmail.com>
To: sahityam <sahi...@googlegroups.com>

cbrao

unread,
May 3, 2007, 12:10:44 PM5/3/07
to sahi...@googlegroups.com
విశాల నేత్రాలు మరో అద్భుతమైన జానపద నవల.క్రిష్ణం
రాజు ఆ నవలను సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు.  

nagaraj

unread,
May 3, 2007, 12:48:07 PM5/3/07
to sahityam
ఆలమండ అనే గ్రామం నిజంగానే చోడవరం దగ్గర ఉంది.

మీరు ఉటంకించిన ఇంటి పేరున్న వారందరూ - పూసపాటి, ఉప్పలపాటి, కాకర్లపాటి -
మొదలైన ఇంటిపేర్ల వారందరూ - రాజులు, వెలమ దొరలే. విజయనగరం రాజుల ఇంటిపేరు
పూసపాటే కదా?

విజయనగరం వైపు ఒక పద్ధెనిమిది ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చేయి.
వీళ్ళంతా మొదట తంజావూరు ప్రాంతం వాళ్ళు, ముందుగా తూర్పుగోదావరి, అమలాపురం
మండలంలో స్థిరపడ్డారు - అక్కడనుంచి కొంతమంది విజయనగరం వలస వచ్చేరట.
ద్రావిడులు మాట్లాడుకొనే భాష గురజాడ కన్యాశుల్కంలో వాడిన భషే. అన్నని ఆచ
అని, తమ్ముడిని తంబి అని పిలుస్తారు. వచ్చేవుషే, ఉన్నాయిష లాటి మాటలు,
పింజారి ము- - లాటి తిట్లు వాడతారు. ఇప్పుడు లేవనుకోండి - కాని నా
చిన్నప్పుడు నేనిలాటి మాటలు విన్నాను. అజ్జాడ, లోగీస, వెదురుపర్తి,
కసింకోట, కలవరాయి లాటి అగ్రహారాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు.

గ్రామాల్లో రాజులు, వెలమదొరలు మాట్లాడే భాష మీరన్నట్టే ఉంటుంది -
బారెకాడు, దేవిడీ మున్నా లాటి మాటలు వాడుకలో ఉన్న మాటలే.

వెలమదొరలకి పౌరషానికేం తక్కువలేదు. మన సినిమాల్లో చూపించే సీమ రెడ్లకేం
తీసిపోరు. అయితే, జమీందారి రద్దు చట్టాలు వచ్చేక, చాలా మంది భూములు,
పుట్రలు కోల్పోయి, నడ్డి విరిగి - పూర్వ వైభవాన్ని కోల్పోయేరు. ఇప్పటికీ
బాగా మోతుబరి వెలమలు చాలా రాజసంగానే ఉంటారు. కొంతమంది అటుపక్కనుంచి
వచ్చిన రాజకీయ నాయకులు వెలమ దొరలే. ఇంట్లో ఘోషా ఎక్కువే. పిల్లలని తండ్రి
కూడా 'మీరు' అని పిలవడం లాటి ఆచారాలున్నాయి. ఇప్పుడు వ్యాపారాల్లోకి
వచ్చేక బాగా మారిపోయింది.

చితికిపోయిన వాళ్ళు - పాపం చాలా దీనావస్థలో ఉంటారు. ఒకప్పుడు బాగా
బతికి, జమీందారీలు, కొలువులు పోయేక చతికిలపడ్డ వంశాలు, కుటుంబాలు
అన్నిచోట్లా ఉన్నాయి కదా? తూర్పుగోదావరిలో సేనాపతుల కథ సుమారుగా ఇలాటిదే
అనుకొంటాను. ఉన్నదంతా పూర్తిగా తుడుచుపెట్టుకుపోయి - జీవచ్చవాలగా
బతుకులీడుస్తున్నవాళ్ళు ఎందరో.

Reply all
Reply to author
Forward
0 new messages