సూర్యుని రథసారథి యెవరు?

2,647 views
Skip to first unread message

రవి

unread,
May 2, 2012, 9:28:33 AM5/2/12
to sahi...@googlegroups.com
వ్రజతే దివి యద్గ్రహావళీచలచేలాంచలదన్తతాడనాః |
వ్యతరన్నరుణాయ విశ్రమం సృజతే హేళిహయాళికాలనామ్ ||
(నైషధీయచరితమ్ - ౨ -౮౦)

గృహపంక్తులల పైభాగమున వేగముగ చలించెడు ధ్వజముల తాడనము వలన ఆ మార్గమున సూర్యుని హయములను నడుపు రథచోదకుడైన అరుణునకు విశ్రాంతి దొరకినది.

(ఇండ్లపైన జెండాలు రెపరెపలాడుతున్నాయట. ఆ జెండాల రెపరెపలు వచ్చి సూర్యుని గుర్రాలను తోలుతున్న అరుణునికి తగిలి అతని వేగాన్ని తగ్గించి, అతనికి కొంచెం విశ్రాంతినిచ్చినాయట.అంటే ఆ ఊళ్ళో ఇళ్ళు అంతెత్తు ఉన్నాయన్నట్టు ఉత్ప్రేక్ష్య + ధ్వని).

సూర్యుని రథసారథి అనూరుడని (అంటే ఊరువులు (తొడలు) లేని వాడు) విన్నాను. ఈ శ్లోకంలో అరుణుడని ఉంది! ఎందుకలా?

సతతం

unread,
May 2, 2012, 11:37:01 AM5/2/12
to sahi...@googlegroups.com
అనూరునకే అరుణుడనే పేరు ఉంది.
అరుణుడంటే ఎఱ్ఱని కాంతి గలవాడని ఇక్కడ అర్థం .
సూర్యునకు కూడా అరుణుడనే పేరుంది.
ఈ అరుణ శబ్దానికి సంచరించువాడని అర్థం.

భవదీయుడు;
రావెమ్మెస్సారెల్.

2 మే 2012 6:58 సా న, రవి <ravi...@gmail.com> ఇలా రాసారు :

రవి

unread,
May 3, 2012, 7:59:34 AM5/3/12
to sahi...@googlegroups.com
ఈశ్వర్ గారు, ధన్యవాదాలండి.

Suresh Kumar

unread,
May 4, 2012, 4:49:04 AM5/4/12
to sahi...@googlegroups.com
మనది చాలా లోతైన సంస్కృతి కదండీ, ఇందులో సైన్సు కుడా ఉందండోయ్. 
-- 
S    u      r     e     s     h
 │▌▌│▌▌▌│▌▌│ ▌▌▌│



2012/5/3 రవి <ravi...@gmail.com>

sadhana bhat

unread,
May 10, 2012, 2:23:42 PM5/10/12
to sahi...@googlegroups.com
మిత్రమా !,
చాలా మంచి అధ్యయనం మీది . ధన్యవాదాలు.ఆ  అనూరుడు గరుత్మంతుని సోదరుడు-అని మా అమ్మ  చిన్నప్పుడు ఆ  కదా చెప్పింది. వికలాంగుడైనా సూర్య రథ చోదకోద్యోగం లభించిన మహానుభావుడు అని హరిదాసు శ్రీ కోట సత్ చితా నంద శాస్త్రి గారు ఓ సారి సెలవిచ్చారు.  

2012/5/2 రవి <ravi...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages