బిలహరి అనే పేరు వినగానే గుర్తొచ్చే సినిమాపాట "నీతోనె ఆగేనా సంగీతం ...". రుద్రవీణ సినిమాలో ఆ సన్నివేశానికి తగిన సాహిత్యం: "పేరులేక పేదదౌనా మ్రోగుతున్న వానవీణ .... వినమ్రతే త్యజించితే విషాదమే ఫలంకదా! నీతోనె ఆగేనా ...". ఆ సినిమాకు రుద్రవీణ అనే పేరు ఎందుకు పెట్టారో తెలీదు. కానీ, రుద్రవీణాస్వనాన్ని గిటారుపై పలికించిన ఈ "
ప్రసన్న"ను మీరు చూసేఉంటారనుకుంటాను. బిలహరి రాగాన్ని పాశ్చాత్యవాయిద్యంపై ఇంత
అద్భుతంగా పలికించవచ్చని ఇప్పుడే తెలిసింది.
--