సంధిప్రేలాపన

140 views
Skip to first unread message

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Oct 31, 2008, 10:14:45 PM10/31/08
to sahityam
గుంపుకు దణ్ణాలు.

విజ్ఞులార,

'సంధిప్రేలాపన' అనే పదబంధాన్ని విన్న వెంటనే మీ మనసుల్లో మెదిలే సంభాషణలు, పుస్తకవాక్యాలు, గేయాలు, పద్యపాదాల్లాంటివేమైనా ఉంటే కొంచెం బయటపెట్టి, ఏయే సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారో నాకు కొంచెం మార్గదర్శనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విడివిడిగా సంధి, ప్రేలాపనలకు నాకు అర్థాలు తెలుసును. సంధిప్రేలాపన సంగతేమిటి? 'మంగళంపాడటం' అనే మాటను వ్యంగ్యార్థంలోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు, సంధిప్రేలాపనకు కూడా ఒక నేపథ్యం, మరో వ్యంగ్యార్థం ఇలా ఏమైనా ఉన్నాయా ... దయచేసి మీకు తెలిసింది నాకూ చెప్పండి.

--
~రానారె~

sudhakar valluri

unread,
Nov 1, 2008, 1:09:30 PM11/1/08
to sahi...@googlegroups.com
'సంధిప్రేలాపన' అంటే పోగాలం దాపురించి అసందర్బ ప్రేలాపన చెయ్యటము. పురాణకాలములో దేవదానవ యుద్దాలలో రాక్షసులు చేసే భీషణ ప్రతిజ్ఞలు, నవీన కాలములో అయితే సినిమాలలో ప్రతినాయకులు చేసే వికటాట్టహసాలు.
   

2008/11/1 Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com>



--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

audiseshareddy kypu

unread,
Nov 2, 2008, 12:30:55 AM11/2/08
to sahi...@googlegroups.com
avasana kaalam daggara padi tanaki ika kOlukOni stitilO EdEdO chEstaani maaTlaaDe daanini dandhi prElapana ani cheppa vachhunEmO..!

2008/11/1 sudhakar valluri <vsk...@gmail.com>

bharath

unread,
Nov 3, 2008, 12:12:37 AM11/3/08
to సాహిత్యం
సంధి ప్రేలాపన అంటే

నేను అనుకోవడము
అసందర్భము గా మాట్లాడుట అని...
సంధి ప్రేలాపన చేసే వాళ్ళని
అసందర్భ ప్రేలాపి అని అంటారు కదా...

On Nov 1, 7:14 am, "Ramanadha Reddy Yarrapu Reddy"

swathi

unread,
Nov 7, 2008, 3:42:12 AM11/7/08
to sahi...@googlegroups.com
కాదు. చనిపోయేముందు పరిసర పరిజ్ఞానం కోల్పోయి ఒకదానికొకటి సంబంధం లేని
మాటలు గొణగటాన్ని అలా అంటారు.

2008/11/3 bharath <nune...@gmail.com>:

--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

Geddapu Lakshmi Prasad

unread,
Nov 8, 2008, 3:25:07 AM11/8/08
to sahi...@googlegroups.com
 సంధి అంటే జీవన్మరణ సంధికాలం అని అర్ధం. రోగం ముదిరి మరణాసన్న కాలాన్ని సంధి అంటారు.  ప్రేలాపన అంటే ఎక్కువగా పొంతన లేకుండా మాట్లాడడం అని అర్థం. పోగాలం దాపురించి అర్థరహితంగా నోటికి వచ్చినట్లు మాట్లాడడాన్ని సంధి ప్రేలాపన అని అంటారు.

2008/11/7 swathi <swathi...@gmail.com>

devara narusu

unread,
Nov 8, 2008, 3:51:10 AM11/8/08
to sahi...@googlegroups.com
నమస్కారములు.
నిజమే సంధి ప్రేలాపన సమయంలో తెలివి వుండదు. ఏమి చేస్తున్నదీ, ఏమి మాట్లాడుతున్నదీ తెలీదు. మరాణానికి ముందు అలా ప్రవర్తిస్తే అందరికీ తెలిస్తుంది ఆ మనిషి ఎంత కాలం బతికేదీ ఎందుకంటే   మా చిన్నతనంలో ఇటువంటి సంఘటన ఒక స్ర్తీ విషయంలో జరిగింది. చుట్టూ జనం గుమ్మి గూడారు తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్ధితి. చివరికి ఆమె    మరణించింది. 
నా అభిప్రాయం నిజము కావచ్చు, కాకపోవచ్చు. నా అనుభవం మాత్రం రాస్తునా్నను.

 

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Nov 11, 2008, 10:58:05 AM11/11/08
to sahi...@googlegroups.com
సంధిప్రేలాపన అంటే ఏమిటో తెలిసింది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా స్వాతిగారికి, లక్ష్మీప్రసాద్ గారికీ.

--
~రానారె~

2008/11/8 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages