నిజమే. మైదానంలొని మత్తేమిటో, దానికి ఒక కల్ట్ స్టాటస్ ఎందుకుందో
తెలియాలంటే, మీరు కూడా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన మరు దశాబ్ధాలలో -
ఏబై, అరవై దశాభ్దాలలో పుట్టి పెరిగుంటే తెలిసేది.
నేనీ నవల చదివి చాలా రోజులయ్యింది - కథ పూర్తిగా గుర్తులేదు. ఇక్కడ నేను
మైదానం వెనకున్న నేపధ్యం గురించే చెప్పదలచుకొన్నది. కల్ట్ స్టాటస్ ఉన్న
రచనలు గురించి తెలుసుకోవాలంటే, వాటికా స్టాటస్ తెచ్చిపెట్టిన సామాజిక
పరిస్థితులగురించి తెలియాలి కదా?
రెండో ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచమంతటా ఒకరకమైన ఉన్మాదం
నెలకొంది. అప్పటివరుకు ఉన్న పాత పునాదులన్నీ పగిలిపోయి కొత్త సమాజం
నెలకొంది. రెండు అగ్రరాజ్యాలు - ఒక పక్క కాపిలిటజమ్, మరోపక్క కమ్యూనిజం
అనే పేర్లతో ప్రపంచాన్ని రెండుముక్కలు చేసి, మరో ప్రపంచ యుద్ధం వైపు
తీసుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న తరుణం.
ప్రపంచ జనాభాకూడా ఒక్కసారిగా పెచ్చుపెరిగిపోయింది. జీవితాల్లో యాంత్రికత
ఎక్కువైపోయింది. పాత విలువలకి తిలోదాకాలిస్తూ కొత్త విలువలు తలెత్తిన
సమయం అది. మహానగరాలు, కర్మాగారాలు, చట్టాలు, అంతర్జాతీయ సమాఖ్యలు,
శాఖోపశాఖలుగా చీలిపోయిన విజ్ఞాన శాస్త్రాలు - ఎవరికీ చుట్టూ ఏమి
జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి.
ముందు తరంలో పుట్టి, ఆ విలువల్లో పెరిగిన పెద్దలు ఏ రకంగాను కొత్త
తరానికి మార్గ దర్శకత్వం వహించలేని పరిస్థితి. ఆ సమయంలోనే, మన సమాజంలో
కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి - 'మధ్య తరగతి' అనే ఒక వ్యవస్థ
పుట్టింది బహుసా అప్పుడేనేమో. ఎందుకంటే, అంతకు ముందు దాకా ఉన్న ఆర్ధిక
వ్యవస్థ అంతా తారుమారైపోయింది. ఇంట్లో పెద్దల దగ్గరనుంచి - ఏ రకమైన
వ్యవస్థనైనా తిరస్కరించటం, తిరుగుబాటు చెయ్యడం అప్పటి యువతకో ఫేషన్.
అప్పుడు పుట్టింది హిప్పి మూవ్‌మెంట్. హిప్పీలంటే సాధారణంగా మనం మాదక
ద్రవ్యాలకలవాటుపడి, రోడ్లమీద తిరుగుతూ ఉండే బికారులనే అనుకొంటాం కాని -
ఇది నిజం కాదు. మెటిరియలిజంని పూర్తిగా తిరస్కరించి, పరిపూర్ణమైన
స్వేచ్ఛని మాత్రమే కోరుకొని, దానికోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడకపోవడం
హిప్పి ఫిలాసఫి. ఉన్నదంతా అందరితోనూ సమానంగా పంచుకోవడం - లేక పూర్తిగా
వదులుకోవటం, రేపు గురించి ఎలాటి చింత లేకపోవటం, వర్తమానమే సత్యం,
భవిష్యత్తుకి ఎటువంటి విలువాలెదనుకోవటం కూడా హిప్పి ఫిలాసఫిలో మూల
సూత్రాలు.
చుట్టూ ఉన్న సమాజంలో పెరిగిపోతున్న సాంకేతిక, రాజకీయ, సాంఘిక, ఆర్ధిక
క్లిష్టతని నిరాకరించి, మానవుడు తన సహజ స్థితిలో ఉండాలనేది హిప్పీల మౌలిక
చింతన. ఈ సహజ స్థితి ఏమిటి? చీకు చింతా లేకుండా, ప్రకృతిని ఆరాధిస్తూ -
హాయిగా బతకడమే. అయితే కోరేదేముంటుంది? సౌఖ్యం (ఎక్స్‌టసి), ఆనందం (జాయ్)
- నిజంగా, పరిపూర్ణంగా ఎప్పుడు లభిస్తాయి? భవిష్యత్తుకి ద్వారాలు
మూసెస్తేనే కదా? భవిష్యత్తులేనివాడికి కర్తవ్యమేముంటుంది? భవిష్యత్తులేదు
కాబట్టి అధర్మమేలేదు, క్రౌర్యమూ, అన్యాయమూ లేవు - కాబట్టి ధర్మమూ లేదు.
ఉన్నందంతా ఒక్క క్షణం.
సౌఖ్యానికి త్యాగరాజుగారో డ్రగ్‌రెసిపీ చెప్పేరు కదా - స్వర రాగ లయ సుధా
రసమందు, వరరామ నామమనే ఖండ చెక్కర మిశ్రము చేసి భుజియించ మన్నారు.
హిప్పిలకి ఇది ఉపనిషద్వాక్యం. చేసే పనికి పూర్తిగా అంకితమైపోవడమే ఉన్న
కర్తవ్యం - దానివల్ల వచ్చే లాభనష్టాల ప్రసక్తి లేదు, అందులో మనకి
వచ్చేదేమిటన్న ప్రశ్న అసలే లేదు, పరులకి ఒనగూడే ప్రయోజనమేమిటన్న సందేహమూ
లేదు. ఈ రోజు వేళ్ళూనుతున్న సేవారంగం అనే ఆర్ధిక వ్యవస్థకి, ఓపెన్
సోర్సెస్ లాటి మూవ్‌మెంట్లకి పునాదులు పడ్డది అప్పుడు హిప్పిలవల్లే.
టిమోధి లీరే అనే ఒకాయన అమెరికాలో కొన్ని ప్రమాదకరమైన ప్రయోగాలు చేసాడు -
వికిపీడియాలో చూడండి. ఆయన గారు ప్రారంభించిన మాదక ద్రవ్యాలు, చాలా
సులువుగా హిప్పిలు కోరుకొనే 'స్థిత్'ని సంపాదించడానికి ఉపయోగపడతాయి. ఆ
మత్తులో పడిన వాళ్ళు ఎక్కువమందే అప్పట్లో.
అప్పట్లో వచ్చిన హరేరామ్-హరేకృష్ణ, సత్యం, శివం, సుందరం లాటి సినిమాలు,
ప్రేమ వివాహాలు, వర్ణాంతర, కులాంతర వివాహాలు, కడుపు చేత్తో పట్టుకొని - ఏ
మహానగరానికో కలలు పండించుకోడానికి వలసలు - ఇవన్నీ అప్పట్లో యువత
ఆదర్శాలు, పెద్దలని కలతపెట్టిన సంగతులు. యాంగ్రీ యంగ్ మాన్ అమితాబచ్చన్
సినిమాలు అప్పటి యువతయొక్క రెబెలియన్‌కి అద్దం పట్టే ఐకాన్స్.
ఇది చలం మైదానానికి నేపధ్యం. చాలామంది చెప్పినట్టు, నాకైతే చలం
సాహిత్యంలో స్త్రీ స్వాతంత్రం ఎక్కడా కనిపించలేదు. నా ఉద్దేశ్యంలో
చలానికి ఫెమినిజంతో ఎటువంటి సంబంధమూలేదు.
చలం నాకెప్పుడూ ఒక హోప్‌లెస్ రొమాంటిక్ గానే కనిపిస్తాడు. అమాయకమైన,
సుందరమైన 'సహజ స్థితి'కి ఒక సింబల్ మాత్రమే చలంగారి స్త్రీ. ఆ సహజ
స్థితి కట్టుబాట్లనే చరసాలలో బందీగా ఉంది, ఆ శృంఖలాలు విడగొట్టడమొకటే
ముక్తి మార్గం. మైదానంలో కథానాయకుడి పేరు అమర్ అని గుర్తు. అమరత్వం ఎలా
వస్తుంది? ఇంతకు మునుపు చెప్పినట్టు - భవిష్యత్తుని బందు చేస్తే
వస్తుంది. ఈ అమర్ ఎవరికీ న్యాయం చెయ్యడు, అన్యాయమూ చెయ్యడు.
స్వార్ధమూలేదు, నిస్వార్ధమూలేదు. అతనికి సమాజంతో పనిలేదు. కావల్సిందంతా
స్వేచ్ఛ, సౌఖ్యము (మెటీరియల్ సుఖం కాదు - త్యాగరాజు చెప్పిన సౌఖ్యమే),
సౌందర్యము - అంతే. ఇంకదేనికీ - కాలానికీ, జీవితానికి, శరీరానికి,
ఆరోగ్యానికి - దేనికీ ఏమాత్రమూ విలువలేదు.
ఆ సంధి యుగంలో పెరిగిన యువతని ఆ నవల ఎంతగా ప్రభావితం చేసిందో, అప్పట్లో
పెద్దలని ఎంతగా కలత పెట్టిందో - అర్ధం చేసుకోవాలంటే, పైన చెప్పిన
సామాజిక, సాంఘిక నేపధ్యాన్ని అర్ఢం చేసుకోవటం అవసరం అనుకొంటాను.
ఇంగ్లీషులో రాబర్ట్ పిర్సిగ్ రాసిన జెన్ అండ్ ఆర్ట్ ఆఫ్ మోటర్ సైకిల్
మైన్‌టెనెన్సు ఎంత కల్టు స్టాటస్ సంపాదించుకుందో, చలం మైదానానికి
తెలుగులో అటువంటి కల్టు స్టాటస్ ఉండేది ఆ రోజుల్లో. సాహిత్యపరంగా చూస్తే
చాలా లోపాయింటాయి ఇటువంటి రచనల్లో. కాని, చాలా వాటికి మనం చలాన్ని
క్షమించాలి కదా? ఒక వెల్లువలా, ప్రభంజనంలా సమకాలీన సమాజాన్ని ప్రభావితం
చేసిన రచనలన్నిటిలోనూ సాహిత్యపరమైన లోపాలుంటాయి - అది జాక్ లండన్
కావొచ్చు, లియో టాల్‌స్టాయి కావొచ్చు, చలం కావొచ్చు - మరెవరైనా
కావొచ్చు.
చివరగా, హిప్పి ఫిలాసిఫిలో ఒక దోషం ఉంది. త్యాగరాజుగారే - శాంతమూలేక
సౌఖ్యమూలేదు అని ఒక వార్నింగిచ్చేరు. శాంతి ఉండాలంటే ఎవడికి వాడు అన్ని
కట్టుబాట్లు తెంచుకొని, ఏక్‌మిరంజన్ అంటే సాధ్యం కాదు కదా? వెర్రితలలు
వేసిన హిప్పి మూవ్‌మెంటు మాదక ద్రవ్యాల మత్తులో పడి చచ్చింది. చలంగారు
శాంతికోసం అరుణాచలంలో రమణమహర్షిని ఆశ్రయించేరు. (చలం కూతురు పేరు సౌరిస్
- ఆవిడ ఆశ్రమం భీమునిపట్నంలో ఉంది. శృతిలయలు సినిమాలో సముద్రం ఒడ్డున
సత్యనారాయణ ఇల్లు సౌరిస్ ఆశ్రమమే)
చలం మహాప్రస్థానినికి రాసిన ముందుమాటలో కూడా - అతను శ్రీశ్రీ కవిత్వంలో
రొమాంటిసిసాన్నే దర్శించాడామో అనిపిస్తుంది నాకైతే.
ఇవి మైదానం మీద నాకు తోచిన నాలుగు మాటలు. మీ సందేహానికి సమాధానం
దొరికిందో లేదో నాకు తెలీదనుకోండి. నేను చెప్పింది సరియైన వివరణ అవునో
కాదో కూడా నాకు తెలియదు. చలం గురించి, మైదానం గురించి నా అభిప్రాయాలతో
ఇప్పటివరకెవరూ ఏకీభవించలేదు.
ఇక్కడున్న పెద్దలేమంటారో మరి?!
ఇక్కడ నాక్కొన్ని సందేహాలు.
కావల్సిందంతా
> స్వేచ్ఛ, సౌఖ్యము (మెటీరియల్ సుఖం కాదు - త్యాగరాజు చెప్పిన సౌఖ్యమే),
ఇది నాకు అసలు అర్ధం కాలేదు.
- స్వేచ్చ, సౌఖ్యము ఒకటేనా? లేదా స్వేచ్చ యొక్క ప్రధానోద్దేశ్యం ఎప్పుడూ
సౌఖ్యమే అయ్యుంటుందా?
లేదా స్వేచ్చ కి సౌఖ్యం బై ప్రోడక్ట్ లాంటిదా?
- ఎది మెటీరియల్ సుఖం, ఏది కాదు?
చలం మైదానం లో చెప్పింది మెటీరియల్ అనే ఇన్నాళ్ళూ అనుకొన్నాను (తప్పు,
ఒప్పు, నీతి నియమాల మీమాంస పక్కన పెడితే).
చేసే పనిలో మమేకమవ్వటం ఉదాత్తమైన స్థితి - ఇది ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే.
లాభనష్టాల సంగతటుంచితే, ఎవరి వ్యక్తిగత జీవితాన్ని, దాని పట్ల వారి
బాధ్యత ని బౌతిక సుఖం కోసం త్యజించటం అంత తెలివైన పనేనా అని?
ఇక్కడ మళ్ళీ నేను మాట్లాడే భౌతిక సుఖం, మీరు చెప్పిన మెటిరియల్ సుఖం,
త్యాగరాజు అనుభవించిన తాదాత్మ్యత వీటి మధ్య విభజన రేఖ తెలుసుకోవటం ఎలా?
అమ్మో! దారి తప్పి ఎటో వచ్చేశా.
తప్పదు. దారిలో పెట్టే బాధ్యత మీదే.
--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.
వేసవిలో చన్నీళ్ళకు కుండ సరిపోతుంది.Water cooler
కావాలనుకోవటం materialism
అవుతుంది. రాముని
సన్నిధియే పెన్నిధి అనుకుని నిధి చాల సుఖమా అని ప్రశ్నించాడు
త్యాగరాజు. 1930- 1960 ల మధ్య స్త్రీ స్వాతంత్రం మృగ్యం. ఈ కాలం లో పలు అభ్యుదయవాదుల సంస్కరణలు వెలుగులోకి వచ్చాయి. విధవా వివాహం తప్పు కాదన్నారు. కన్యా శుల్కం ఉన్న రోజుల్లో చాలా మంది పెళ్ళి కాని యువకులు పాల్ఘాట్ వెళ్ళి అక్కడి అమ్మాయిలను చవకగా వివాహ మాడేవారు. తెనాలికి పాల్ఘాట్ అమ్మాయిలు ఇలా వచ్చిన వారే. కన్యా శుల్కం నుంచి వరకట్నం వైపు trend మారింది. స్త్రీకి చదువు అవసరమా కాదా అని పలు వాదోపవాదాలు జరిగేవి. దాస్యం లో మగ్గిపోతున్న మహిళను తిరగబడమని చలం ప్రోత్సహించాడు. ఫలితంగా చాలా మంది అమ్మాయిలు లేచిపోయేవారు. కూడా తీసుకు వెళ్ళిన నగలు, ధనము ఖర్చాయ్యాకా అబ్బాయి పలాయనం చిత్తగించే వాడు. అమ్మాయిల తల్లి తండ్రులు ఎలాగోల వెదికి వారి పిల్లలను ఇంటికి తెచ్చుకునే వారు. మైదానం నేను చాలాకాలం క్రితం చదివాను. భర్త sadism కు విసుగెత్తి ఒక స్త్రీ ఒక పురుషుడితో లేచి పోయి వెన్నెల రాత్రులలో ఇసుక తిన్నెలలో స్వేచ్చగా శృంగారాన్ని అనుభవిస్తుంది. ఇదే కదా జీవితం అనుకుంటుంది. కాని ఆ పర పురుషుడికి ఈమె మీద మోజు తీరిపోతే పరిస్థితి ఏమిటి? తిరగబడమన్నాడు కాని స్త్రీ కి ఆర్థిక స్వాతంత్రం ఉంటే పురుషుడి sadism కు లొంగి ఉండవలసిన అవసరం ఉండదని చలం చెప్పటం లో విఫల మయ్యాడు. ఆ కాలంలో, స్త్రీలు భర్తలకు తెలియకుండా రహస్యంగా చదివేవారు చలం రచనలను.
చలం నిజ జీవితంలో ఒక సారి ఒక వేశ్యను ఇంటికి తీసుకు వచ్చి భార్యను అన్నం పెట్టమంటాడు. దేవుడు లేడన్నట్లుగా అభిమానులను నమ్మించి, ఒక సాయంత్రం బెజ్ వాడ నుంచి రైల్ ఎక్కి రమణాశ్రమం వెళ్ళి పోయి తన అభిమానులను April fool చేశాడు.
నేనూ మైదానం చదివి చాలా ఏళ్ళయింది. నాకు గుర్తున్నంతవరకూ అందులో నాయిక ఒక
ముద్దూముచ్చటా లేని బ్రాహ్మణ మొగుణ్ణి వదిలేసి తన ఇంటికి భర్త కోసం వస్తూ
వుండిన ఒక ముస్లిం వ్యక్తితో వెళ్ళి పోతుంది. అయితే అతనికి కొణ్ణాళ్ళకు
ఇంకో యువతిమీద మోహం పుడుతుంది. మొత్తం మీద అప్పట్లో నాకర్థమయిందేంటంటే
బలమైన వాంఛా, కాంక్షా, ప్రేమ, మోహం లేకుండా భర్తతో తాళికట్టించుకొన్న
పాపానికి భార్యగా జీవించడం వ్యభిచారం లాంటిది అని.
--ప్రసాద్
http://blog.charasala.com
cbrao Vraasenu:
దేవుడు లేడన్నట్లుగా అభిమానులను నమ్మించి, ఒక సాయంత్రం బెజ్ వాడ నుంచి రైల్ ఎక్కి రమణాశ్రమం వెళ్ళి పోయి తన అభిమానులను April fool చేశాడు.
నిజమే ఒక రచయితగానీ(మరే ఇతర కళాకారుడుగానీ) వారి రచనలని (మరే ఇతర
కళనిగానీ) కవిత్వాన్ని కవిత్వం కోసం మాత్రమే(లేక కళని కళకోసమే) అన్న
దృష్టితో నడిపినంత కాలం వారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ
పట్టించుకోరు.
చలం, శ్రీశ్రీ, గురజాడ వంటివారు కేవలం కవులంటే ఒప్పుకోడం కష్టం. కొన్ని
సిద్ధాంతాలని నమ్మి వాటిని ప్రచారం చెయ్యడం కోసం రచనలు చేసినవాళ్ళు
వీరందరూ. గురజాడ జీవితం గిరీశాన్నో, రామప్పంతులునో పోలి ఉందని
తెలిసిందనుకోండి, కన్యాశుల్కం నీరు కారిపోదా? దయ్యాలు వేదాలు వల్లిస్తే
ఎవరు హర్షిస్తారు?
On May 8, 7:30 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
@రానారె:
"రచయితగానీ (మరే ఇతర కళాకారుడుగానీ) వారి రచనలలోని పాత్రలలాగా (వారు
ప్రదర్శించే కళారూపాల లాగా) ఉదాత్తంగా జీవించాలని ఆశించడం ఎంతవరకూ
సబబు!?"
నిజమే ఒక రచయితగానీ(మరే ఇతర కళాకారుడుగానీ) వారి రచనలని (మరే ఇతర
కళనిగానీ) కవిత్వాన్ని కవిత్వం కోసం మాత్రమే(లేక కళని కళకోసమే) అన్న
దృష్టితో నడిపినంత కాలం వారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ
పట్టించుకోరు.
చలం, శ్రీశ్రీ, గురజాడ వంటివారు కేవలం కవులంటే ఒప్పుకోడం కష్టం. కొన్ని
సిద్ధాంతాలని నమ్మి వాటిని ప్రచారం చెయ్యడం కోసం రచనలు చేసినవాళ్ళు
వీరందరూ. గురజాడ జీవితం గిరీశాన్నో, రామప్పంతులునో పోలి ఉందని
తెలిసిందనుకోండి, కన్యాశుల్కం నీరు కారిపోదా? దయ్యాలు వేదాలు వల్లిస్తే
ఎవరు హర్షిస్తారు?
On May 8, 7:30pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
కొత్తపాళీ గారు..
చలం రాసింది ఎవరు మంచన్నా, ఎవరు చెడన్నా ఆయన మాత్రం చెప్పిన దాన్నే
ఆచరింఛాడు కాబట్టి తప్పు లేదు.
చివరి దశ లో రమణాశ్రమం కి వెళ్ళటం ఆయన దృక్పధం మారటం వల్ల అయుండొచ్చు.
అది ఆయన ముందు నుంచే అనుకున్నది కాదు
అని.
"కానీ ఆయన్నో వేదాలు వల్లిస్తున్న దయ్యంగా
ఈసడించడానికి బదులు హర్షించి, "మహాకవి" అనేశాం కదా. ఈనాటికీ కాదనే
వాళ్లు
లేరు.అంటే ఆయన రచనలు వెదజల్లే భావజాలానికి పెద్దపీటవేసి, ఆయన వ్యక్తిగత
జీవితాన్ని పట్టించుకోలేదు కదా. అలా పట్టించుకోవడం అనవసరం అనేది నా
అభిప్రాయం."
ఆ అన్నవాళ్ళెవరో నాకు తెలీదు కానీ శ్రీశ్రీ ని కాదనే వాళ్లు చాలామందే
ఉన్నారు. పూర్వకవుల జీవిత విధానాలని ఈసడించిన గురజాడ,కందుకూరిలు తనకు
ఆదర్శం అని చెప్పుకున్న శ్రీశ్రీ జీవన విధానాన్ని పరిశీలన చెయ్యడం
అహేతుకం ఎంత మాత్రం కాబోదు.
ఐనా ఇవన్నీ పక్కనబెట్టినా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తన కవిత్వం ద్వారా
ప్రజలకి బోధించేవాడు అందులోని మంచి చెడులు ప్రత్యక్షంగా తెలుసుకోకుండా
ప్రజల మీద ప్రయోగం చెయ్యడం బాధ్యతా రాహిత్యమే ఔతుంది.
@ఆచార్యవర్యా:
నియమాలూ నిష్టలూ ఎవరకి కావాలండి బాబూ. మీరు బొత్తిగా "సత్య" కాలం
వాళ్ళు :)
On May 11, 2:09 pm, swathi <swathikum...@gmail.com> wrote:
> ఇక్కడ రానారె, కొత్తపాళీ గార్లు చెప్పింది ఒకటి కాదని నాకనిపిస్తుంది
> రానారె..
> రచయిత రాసేదానికి చేసేదానికి సంబంధం ఉండనవసర్లేదు.ఒక వేళ ఆ రెండు వేరు గా
> ఉన్నా ఆక్షేపించకూడదు అని.
>
> కొత్తపాళీ గారు..
> చలం రాసింది ఎవరు మంచన్నా, ఎవరు చెడన్నా ఆయన మాత్రం చెప్పిన దాన్నే
> ఆచరింఛాడు కాబట్టి తప్పు లేదు.
> చివరి దశ లో రమణాశ్రమం కి వెళ్ళటం ఆయన దృక్పధం మారటం వల్ల అయుండొచ్చు.
> అది ఆయన ముందు నుంచే అనుకున్నది కాదు
> అని.
>
> On 5/11/07, సత్యసాయి కొవ్వలి <saikovv...@gmail.com> wrote:
>
>
>
>
>
> > రానారె, ఒక విషయం గమనించండి. తాను చెప్పేది, తానే చెయ్యనప్పుడు మిగిలిన
> > వాళ్ళు ఆచరిస్తారని అమ్మకం ఏమిటి? అలా ఆచరించకపోయినా పర్వాలేదు
> > అన్నప్పుడు ఎవరికైనా చెప్పడం ఎందుకు? హాయిగా తన మందు తనే కొట్టుకొంటూ
> > ఇంట్లో కూర్చోవచ్చు కదా? శ్రీశ్రీ మహాకవి. ఆయన ఒక తరానికి యుగకర్త అని
> > పిలవబడ్డాడు. అంటే సమాజానికి దారి చూపే సత్తా కలిగిన నాయకత్వస్థానంలో
> > ఉన్నవాడు. అలాటి వాడు తన ఆదర్శాలు తానే పాటించకపోయినా పర్వాలేదు అని
> > సమర్ధించడం, అందులో మీరు, కొత్తపాళీ గారు ఒకే రకం వాదనలు వినిపించడం,
> > కొద్దిగా అపశృతిగా వినిపిస్తోంది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి-
> > తాచెడ్డకోతి వనమెల్లా చెరుస్తుంది. ఈ సందర్భంలో ఓ కథ గుర్తొస్తోంది-
> > రామకృష్ణ పరమహంస దగ్గరకి ఒకావిడ తన పిల్లాడిని చూపించి స్వీట్లు మానేయమని
> > చెప్పమని కోరిందట. ఆయన ఓ నాల్గురోజుల తర్వాత మళ్ళీ తీసుకు రమ్మన్నాడట.
> > అప్పుడు, ఆయన ఆ పిల్లవాడితో బాబూ స్వీట్లు మానెయ్యి అని చెప్పాడట.
> > ఈముక్క నాల్గు రోజులక్రితమే చెప్పొచ్చుకదా అంటే, నాక్కూడా అదే బలహీనత
> > ఉంది. ఈ నాల్గురోజులు దాన్ని కంట్రోల్ చేసుకొనగలిగాను బాబుకి
> > చెప్పగల్గుతున్నానన్నాడట.
>
> --http://swathikumari.wordpress.com
> Regards,
> Swathi.- Hide quoted text -
>
> - Show quoted text -
ఆ అన్నవాళ్ళెవరో నాకు తెలీదు కానీ శ్రీశ్రీ ని కాదనే వాళ్లు చాలామందే
ఉన్నారు. పూర్వకవుల జీవిత విధానాలని ఈసడించిన గురజాడ,కందుకూరిలు తనకు
ఆదర్శం అని చెప్పుకున్న శ్రీశ్రీ జీవన విధానాన్ని పరిశీలన చెయ్యడం
అహేతుకం ఎంత మాత్రం కాబోదు.
ఐనా ఇవన్నీ పక్కనబెట్టినా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తన కవిత్వం ద్వారా
ప్రజలకి బోధించేవాడు అందులోని మంచి చెడులు ప్రత్యక్షంగా తెలుసుకోకుండా
ప్రజల మీద ప్రయోగం చెయ్యడం బాధ్యతా రాహిత్యమే ఔతుంది.
@ఆచార్యవర్యా:
నియమాలూ నిష్టలూ ఎవరకి కావాలండి బాబూ. మీరు బొత్తిగా "సత్య" కాలం
వాళ్ళు :)
రానారె,
మీరు positive గా నేను normative గా మాట్లాడుతున్నామంతే. మీది పరిశీలన,
నాది ఆకాంక్ష ( expectation ).
నా ఉద్దేశ్యం మహాకవుల మాటలు సిగరెట్ పెట్టిమీద కనిపించే చట్టబద్ధమైన
హెచ్చరికలకన్నా ప్రయోజనకారులుగా ఉంటే బాగుంటుందని. మీపన్ బాగుంది.
ఏదైనా అది వారి వ్యక్తిగతం. శ్రీశ్రీ జీవితంలాగే వాళ్ళ జీవితమూను అది.
"సహజకవి పోతన ఇందుకు మినహాయింపు."
ఈయన కూడా మొదటలో భోగినీ దండకం లాంటి కృతులు రచించి రాజులకి
అంకితమిచ్చినాయనే.
"ఎవరినీ దోపిడీ చేయలేదు. స్వతంత్రంగా రాయగలిగాడు. ఎవరి ఒత్తిడికీ
లొంగిందిలేదు."
సినిమాలలో రాసిన వాళ్ళ గురించి ఈ వాక్యాలు ఎంత వరకు నమ్మచ్చో నాకు
తెలీదు. నాస్తికుడినని చెప్పుకుంటూ రాముడి మీద పద్యాలు, హరికధలూ
(సినిమాలకోసమే అనుకోండి) రాసాడు కదా.
ఇక విషయానికి వస్తే -
మీరిచ్చిన ఉదాహరణ వేరు, బీడీలు సిగరెట్లు కాల్చద్దని చెప్పడం, ఒక
సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యడం ఒక స్థాయిలో విషయాలు కాదు. నాస్తికత్వం
బోధిస్తూ ఇంట్లో పూజలు చెయ్యడం లాంటి పనులు చాలా అనైతికం.ప్రజలని మోసం
చెయ్యడం ఔతుంది అది. ఆ రచనల వల్ల సమాజంలో జరిగే పరిణామాలకి రచయితకి కొంత
బాధ్యత ఉంటుంది కనక.
"అలాగే శ్రీశ్రీలాంటివాళ్ల (మీ భాషలో బాధ్యతారహితులు) రచనల వలన
సమాజానికి ప్రయోజనాలు ఉన్నపుడు అంతవరకే గ్రహించి బాగుపడటం మంచిది
అంటున్నాను."
నేను శ్రీశ్రీని బాధ్యతా రహితుడు అని అనలేదు. ఆయన రచనల వల్ల సమాజంలో ఏమి
మార్పులు జరిగాయో నాకు తెలీదు. కానీ తెలుగు సాహిత్యంలో ఏమి మార్పులు
జరిగాయో కొంత తెలుసు. అది అప్రస్తుతమనుకోండి. నేను మాట్లాడేది ఇలా ఇజాల
మీద రచనలు చేసే అందరి గురించీను.
సమాజానికి ప్రయోజనాలున్నపుడు తప్పక గ్రహించవలసిందే. కానీ అసలు ప్రయోజనం
ఉందో లేదో తెలియాలంటే ముందు ఆ బోధించినవాడు ఆచరించి తెలుసుకోవాలి కదా.
అది లేకుండా ఏదో పేరు రావడం కోసం ఇష్టమొచ్చినట్టు రాయడం తప్పు అని నా
అభిప్రాయం.
ఇది నా ఆకాంక్ష ఆశయాల గురించి మాత్రమే కాదండీ, ఒక రచయిత యొక్క నైతికతకి
సంబధించిన విషయం.
On May 11, 8:40 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"
వీటిని వదిలేసి కూడా బ్రతకొచ్చు.ఎవ్వరూ కాదనరు.
ఎన్నో ఉత్గ్రంధాలు అవపోసన పట్టి,మంచి ఏదో,చెడు ఏదో తెలిసి,తమకున్న
జ్ఙానన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించక పొగా,"శ్వేచ్చ" పేరు తో
విచ్చలవిది తనాన్ని ప్రొత్సహించే వారిని ఏమనాలి
వివాహ వ్యవస్థ పరమార్ధాన్ని గ్రహించక,కేవలం శారిరక సుఖమే ముఖ్యం అంటే ఏం
చెప్పగలం
ఆర్ధిక స్వాతంత్రయం అంటే ఇదే నా .......???
అందుకేనెమో ఈ సంఘసంస్కర్తలందరు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంది,చేసుకొమని
ప్రోత్సహించిందీ !!
రచయితలకు ఒక సామజిక స్పృహ ఉండక్కర లేదా??
మనుషులకు కట్టుబాట్లు ఉండక్కర లేదా....జంతువుల లాగా బ్రతకడమేనా స్వేచ్చ
అంటే ?
ఎందుకనో ఎక్కువమందికి "స్త్రీ స్వేఛ్ఛ" అనగానే "బరితెగింపు", "లేచిపోవడం", "విశృంఖల శృంగారం", "చెడి పోవడం", "సాంసారిక విలువల హననం", "కుటుంబ పతనం" ..... గుర్తుకు వస్తాయి.
ఇప్పుడు మాగాడికున్న స్వేఛ్ఛ వల్ల ఇవనీ జరగనప్పుడు ఆడదానికిచ్చే స్వాఛ్ఛ వల్లనే ఇవన్నీ జరుగుతాయా? మగాడికున్న స్వేఛ్ఛనే ఆడాదానిక్కూడా వర్తింప జేస్తే బ్రంహ్మాండం బ్రద్దలవుతుందా? సమాజం తల్లక్రిందులవుతుందా?
ఒక స్వేచ్చా ప్రవక్త, ఒక హృదయవాది, ఒక సత్యాన్వేషి, ఒక ప్రకృతి ఆరాధకుడు, ఒక స్వాప్నికుడు,
ఒక గొప్ప సాహితీ శిల్పి, ఒక ప్రేమపిపాసి…ఈ 'ఒక…' లన్నీ కలిపి ఒక్క్డైన వ్యక్తి చలం. ' నే ప్రేమించని
సమయంలో బతికిలేనన్న మాట ' అని తనని తను నిర్వచించుకున్న శిఖర సమానుడు. పరస్పర
మానవ సంబంధాల్లోని పెత్తనం నుంచి విముక్తి కలిగించి దాని స్థానంలో ప్రేమను పాదుకొల్పడం
ద్వారా స్త్రీ పురుషులకొక ఆనందమయ లోకాన్ని సృష్టించాలని యత్నించిన సాహితీ యుగకర్త,
వైవాహిక ధర్మాల మీద,స్త్రీ పురుష సంబంధాన్ని నిర్దేశించే సూత్రాల మీద, దాడి చేసి కొత్త జ్ఞానంతో
జీవితపు కోణాలను వెలిగించి తెలుగు వాళ్ళకు కొత్త జీవిత దృక్పధాన్ని, తెలుగు సాహిత్యానికొక
కొత్త చైతన్యాన్ని ఒసగిన రచయిత గుడిపాటి వెంకట చలం.
On May 11, 2:09 pm, swathi <swathikum...@gmail.com> wrote:
> ఇక్కడ రానారె, కొత్తపాళీ గార్లు చెప్పింది ఒకటి కాదని నాకనిపిస్తుంది
> రానారె..
> రచయిత రాసేదానికి చేసేదానికి సంబంధం ఉండనవసర్లేదు.ఒక వేళ ఆ రెండు వేరు గా
> ఉన్నా ఆక్షేపించకూడదు అని.
>
> కొత్తపాళీ గారు..
> చలం రాసింది ఎవరు మంచన్నా, ఎవరు చెడన్నా ఆయన మాత్రం చెప్పిన దాన్నే
> ఆచరింఛాడు కాబట్టి తప్పు లేదు.
> చివరి దశ లో రమణాశ్రమం కి వెళ్ళటం ఆయన దృక్పధం మారటం వల్ల అయుండొచ్చు.
> అది ఆయన ముందు నుంచే అనుకున్నది కాదు
> అని.
>
ఇంటర్నెట్ లో (ఈమాట లేదా రచ్చబండ ?) ఎక్కడో ఈ వ్యాసం ఉందని నా నమ్మకం.
వెతికి దొరికితే లింకు పోస్ట్ చేస్తాను.
- అక్కిరాజు భట్టిప్రోలు
దీన్ని తెలుగులోకి మార్చడం మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. తెలియక
పోతే... ఈ లింకు వాడొచ్చు...
http://geocities.com/vnagarjuna/padma.html
- అక్కిరాజు భట్టిప్రోలు
స్త్రీ,శృంగార స్వేఛ్చా వాది , అభ్యుదయ రచయిత చలం. చూడండి.
http://deeptidhaara.blogspot.com/2007/06/blog-post_13.html#links
దొరికింది లింకు. చంద్ర కన్నెగంటి ఈ వ్యాసాన్ని RTS లో తెలుసా లో పోస్టు
చేసారు.
http://groups.yahoo.com/group/telusa/message/2979
దీన్ని తెలుగులోకి మార్చడం మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. తెలియక
పోతే... ఈ లింకు వాడొచ్చు...
http://geocities.com/vnagarjuna/padma.html
- అక్కిరాజు భట్టిప్రోలు