జాతీయం , నానుడి, సామెత,నుడికారం తేడాలు చెప్పండి?

2,632 views
Skip to first unread message

pradeep reguri

unread,
Dec 14, 2012, 7:31:10 AM12/14/12
to sahi...@googlegroups.com
జాతీయం , నానుడి, సామెత,నుడికారం  వీటి అర్థాలు/వీటి మధ్య తేడాలు చెప్పగలరు.

--
with regards,
Pradeep



              " Avoid Plastic Save Mother earth "

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

unread,
Dec 14, 2012, 9:30:47 AM12/14/12
to సాహిత్యం
ముందు మూడింటి గుఱించి ఇక్కడ వ్రాస్తాను.

నానుడి :- ఒక సూక్తిలాంటిది. ఒక సత్యాన్ని వ్యక్తీకరిస్తుంది. ఉదా:-
ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి etc.

సామెత :- గతంలో ఎప్పుడో ఎక్కడో జాతిజీవితంలో జఱిగిన ఒక సంఘటన/దృష్టాంతం
ఆధారంగా గ్రహించిన సత్యాన్ని యతిప్రాసలతోనూ, కొన్నిసార్లు అవి లేకుండానూ
వ్యక్తీకరిస్తూ సంక్రమించిన తరతరాల అనుభవ నివేదక వాక్యం. ఈ సామెతల్లో
వర్ణించబడ్డ సంఘటనల్లాంటివి మళ్లీ మళ్లీ జఱుగుతూనే ఉంటాయి.

ఉదా:- సుబ్బిశాస్త్రికి ఏడాదికి రెండుసార్లే జలుబు చేస్తుంది,
చేసినప్పుడల్లా ఆర్నెల్లు ఉంటుంది.

ఇలాంటివి కొన్నివేలున్నాయి.

నుడికారం :- ఒక భావాన్ని చెప్పడానికి ఒక భాషవాళ్ళు తరతరాలుగా అలవాటు
చేసుకున్న విలక్షణమైన వ్యక్తీకరణపద్ధతి. దీన్ని ఇంగ్లీషులో idiom
అంటారు.

ఉదాహరణకి - I have been a lover of philately.
దీన్ని తెలుగులో "నేను స్టాంపుసేకరణల ప్రేమికుడుగా ఉంటూ వస్తున్నాను" అని
చెబితే అది తెలుగు కాదు.

దీనికి తెలుగువాళ్ళు చెప్పే పద్ధతి - "నాకు చాలాకాలంగా స్టాంపుల్ని
సేకరించడం అంటే ఇష్టం."

దీన్నే నుడికారం అంటారు. ఇది తెలియకుండా ఒక భాషలో ఎన్నిపదాలు
నేర్చుకున్నా వృథాయే.

pradeep reguri

unread,
Dec 15, 2012, 4:28:44 AM12/15/12
to sahi...@googlegroups.com
సుబ్రహ్మణ్యం గారు,
నేను ఊహించినట్టుగానే మొదటి సమాధానం మీ నుండే వచ్చింది. ధన్యవాదాలు.
మనకు ఉన్న సామెతలు, నానుడి లు ఒక్క చోట ఉన్న గూడు  ఏదయినా ఉందా? తెలిస్తే చెప్పగలరు .


14 డిసెంబర్ 2012 8:00 సా న, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com> ఇలా రాసారు :

N. Gopi Krishna

unread,
Dec 21, 2012, 6:32:32 PM12/21/12
to sahi...@googlegroups.com
Oka lamke 
http://www.telupu.com/sametalu.html
--
N. Gopi Krishna
              B. Tech (C. S. E), PMP
Associate Consultant,
Tata Consultancy Services

D. Subrahmanyam

unread,
Dec 23, 2012, 11:19:43 PM12/23/12
to sahi...@googlegroups.com
నేను 9325 సామెతలను ఒకేచోట సంపాదించి నా బ్లాగులో ఉంచాను.దయచేసి ఈ క్రింది లింకును చూడండి


సుబ్రహ్మణ్యం

D. Subrahmanyam

unread,
Dec 23, 2012, 11:20:26 PM12/23/12
to sahi...@googlegroups.com
నేను 9325 సామెతలను ఒకేచోట సంపాదించి నా బ్లాగులో ఉంచాను.దయచేసి ఈ క్రింది లింకును చూడండి


సుబ్రహ్మణ్యం

Reply all
Reply to author
Forward
0 new messages