మనం చెప్పుకో దగిన వారిలో , ప్రసిద్ధులైన కవులు ," తిరుపతి వెంకట కవులు.
" వీరినే " జంట కవులు అని కుడా అంటారన్న సంగతి జగద్విదితం .వారిలో ఒకరు "
దివాకర్ల తిరుపతి శాస్త్రి " ,మరొకరు " చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి. "
వీరిద్దరూ " తిరుపతి వేంకట కవులనీ , జంట కవులనీ " ప్రసిద్ధి కేక్కినారు.
వీరు తెలుగు సాహిత్యంలో దిట్ట. తెలుగు కవిత్వం , అవధానములు , నాటకములు ,
వీరి ప్రత్యేకత . వీరు ఇంచు మించు వందకు పైగా , తెలుగు గ్రంధాలు ,
నాటకములు , అనువాదములు , వ్రాసారు. అవధానములలో వీరి పాండిత్యం , వీరి
ప్రతిభ , చతురత , నేటికీ , సాహితీ సమాజంలో కొనియాడ దగినది. ఇప్పడికీ వీరి
నాటకముల లోని పద్యాలు { అనగా " పాండవోద్యోగ విజయము " మున్నగు
వాటిలోని } తెలుగు నాట పండిత పామరుల నోట విన బడుతూనే ఉంటాయి." బావా
ఎప్పుడు వచ్చితీవు ," జండాపై కపిరాజు , చెల్లియో చెల్లకో " మున్నగు నవి.
తిరుపతి శాస్త్రి గారూ , ౧౮౭౨[ 1872 ] మార్చి ౨౬ [26 ] న పశ్చిమ గోదావరి
జిల్లా భీమ వరం వద్ద , యండగండి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి
వెంకటావధాని గారూ గొప్ప వేద పండితుడే గాక సూర్యోపాసకుడు కూడా. ఇక తిరుపతి
శాస్త్రి గారి విద్యాభ్యాసం , " గరి మెళ్ళ లింగయ్య , బూర్ల
సుబ్బారాయుడు , పమ్మి పేరి శాస్త్రి , చర్ల బ్రహ్మయ్య శాస్త్రి , వద్ద
జరిగింది.
అయితే ఈ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద చదువుకునే రోజుల్లోనే ,
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తొ పరిచయం కుదిరింది. ఆ రోజుల్లోనే తిరుపతి
శాస్త్రి గారి వివాహం కుడా ౧౮౯౮ [ 1898 ] లొ జరిగింది .కాకపొతే వీరు
మధుమేహ వ్యాధి కారణంగా చిన్న వయసులోనే ౧౯౨౦[ 1920 ] లోనే మరణించారు.
ఇక చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు ౧౮౭౦[ 1870 ] లొ ఆగస్టు ౮[ 8 ] వ
తేదీన తూర్పు గోదావరి జిల్లా కడియం జన్మించారు. ఈయన ముత్తాతగారి తమ్మడు ,
వెంకటేశ్వర విలాసం , యామినీ పూర్ణ తిలక విలాసం వంటి మహాద్ గ్రంధాలను
రచించిన గొప్ప పండితుడు . ఆయన రచించిన తాళపత్ర గ్రంధాలు వేంకట శాస్త్రికి
అందు బాటులో ఉం డేవట . ఇకపోతే ఈయన యానాం లొ తెలుగు ,ఆంగ్ల , సంస్కృత ,
భాషలు అధ్యయనం చేసారు. ఇక వీరి గురువులు ,కానుకుర్తి భుజంగ రావు ,
అల్లంరాజు సుబ్రహ్మణ్యం , కవిరాజు , మున్నగు వారు. యితడు ౧౮ ఏండ్ల
వయస్సులోనే " యానాం వెంకటేశ్వర స్వామి గురించి " శతకం వ్రాశాడట .
అందులోని వ్యాకరణ దోషాలను గురించి , అచ్చటి పండితులు విమర్శిం చగా ,
అవమానంగా భావించి , మన వేంకట శాస్త్రి , సంస్కృత వ్యాకరణం నేర్చు
కోవడానికి వారణాసికి వెళ్లాలని నిశ్చయిం చు కొన్నాడట . కానీ ఆర్ధిక
ఇబ్బందుల వలన వెళ్ళలేక పోయాడు. అంతేగాక అతడికి పుట్టుక నుండీ ఒక కన్ను
సమస్య గా ఉండేదట.
పిమ్మట శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి వద్ద విద్యా భ్యాసం
చేస్తున్నప్పుడు , తిరుపతి శాస్త్రితో పరిచయం కావడం , ఇద్దరు
వెంకటశాస్త్రి అధ్యాపకుని వద్ద శిష్యులు గా ఉండేవారు. పిమ్మట ,
ప్రసిద్ధులైన విశ్వనాధ, వేటూరి ,పిగళి మున్నగు వారివద్ద జంట కవులుగా
ప్రసిద్ధి పొందారు.
అసలు మొదటి నుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేదట. మరి
చెళ్ళ పిళ్ళ వారు ఉపన్యాసా లివ్వడం , మెరుపులా పద్యాలల్లడంలో దిట్ట.
అయితే ఒకసారి వినాయక చవితి ఉత్సవాల్లో చందాలు వసూలు చేయడం కొరకని ,
ఒకరిని మించి మరొకరు , తమ ప్రతిభను ప్రదర్సిం చారట. దాంతో వారి స్నేహం
మరింత బలపడింది. తుదకు వెంకటశాస్త్రి వారణాసి వెళ్ళి తిరిగి వచ్చాక ,
ఇద్దరు జంటగా కాకినాడలో ., శతావధానం ప్రదర్సిం చారు. తరువాత జీవితాంతం ,
వారిరువురు ఒకరి కొకరు తోడుగా జంట కవులుగానే మిగిలి పోయారు. తిరుపతి
శాస్త్రి మరణా నంతరం కుడా వెంకటశాస్త్రి తన రచనలను జంట రచనలు గానే
ప్రచురిం చాడు.
ఇద్దరు కలసి అసంఖ్యాక మైన అవధానములు చేసి , అనేక సన్మానములు , పలు
ప్రసంసలు అందు కొన్నారు. అడయార్ వెళ్ళినపుడు ,అనిబిసెంట్ ప్రసంసలు
పాడారు. అంతేగాక " వేంకట గిరి , గద్వాల , ఆత్మకూరు , విజయ నగరం ,
పిఠాపురం . మున్నగు సంస్థానాలలో తమ తమ ప్రతిభను ప్రదర్శించి సత్కరింప
బడటమే గాక , ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి " కళా ప్రపూర్ణ " బిరుదును
పొందారు. పోలవరం జమీందారు వారి ప్రతిభను గుర్తిచి ," ఎడ్విన్ ఆర్నాల్డ్ "
రచించిన " లైట్ ఆఫ్ ఆసియా " అనే గ్రంధాన్ని తెలుగులోకి అనువదించ మని
కోరగా , ౧౯౦౧ లొ కాకినాడకు నివాసం మార్చి , ౧౮౮౯లొ పిఠాపురం రాజు
ప్రారంభించిన సాహితీ పత్రికను నిర్వ హించి ," బాల రామాయణం ,ముద్రా
రాక్షసం , మృచ్చ కటికం , వంటి గ్రంధాలను తెలుగులోనికి అనువదించారు. ఇక
వీరి రచనలు , సంస్కృతంలో ౧౦ ది స్వతంత్ర రచనలు , ౧౫. అనువాదములు, ౨౫.
ఠాగూర్ కదలు [ ఆంగ్లము నుండి తెలుగు లోనికి ] ఇంకా స్వతంత్ర కవితా
రచనలు , నాటకములు , తెలుగు వచన రచనలు.
ఇక పొతే వీరి రచన నుండి మచ్చుకి కొన్ని
" అమ్మా సరస్వతీ ! నీ దయ వలన మేము ఎన్నో సన్మానాలు అందు కొన్నాము. " అంటూ
చెప్పిన పద్యము.
ఏనుగు నెక్కినాము , ధరణీం ద్రులు మ్రొక్కగ నిక్కినాము స
న్మానము లందినాము బహుమానములన్ గ్రహియించి నార మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయం బొనర్చి ప్ర
జ్ఞాన విధులంచు జేరు గొనినాము నీవలనన్ సరస్వతీ !
ఇక కవులకు మీసా లెందుకు .? అని ఎవరొ ఆ క్షేపిం చగా , తెలుగు లోను
సంస్కృతం లోను మమల్ని మించిన వారెవరైనా ఉంటే , మీసాలు తీసి మొక్కుతామని
సవాలు చేస్తూ చెప్పిన పద్యం చూడండి
దోస మటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచి నారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా
రోసము కల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము దీసి మీ పద సమీపములం దలుంఛి మ్రొక్కమే ! అంటూ చమత్క రించారు .
ఇకపోతే మనందరి నోటా నిరంతరము పలికెడి పద్యాలు " పాండవోద్యోగ విజయం
లోనివి.
బావా ఎప్పుడు వచ్చితీవు ? సుఖులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీవాల్ల భ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖో పెతులే
నీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె ? నీ తేజంబు హెచ్చిం చున్ .
అల్లాగే " చెల్లియో చెల్లకో , జెండాపై కపిరాజు " మున్నగు ప్రసిద్ధ మైన
పద్యాలు మనందరికీ విదితమే
ఇంతటి ప్రసిద్ధ కవులే మనమందరము నిరంతరము తలచుకునే జంట కవులు . వారె "
దివాకర్ల తిరుపతి శాస్త్రి .చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.