ఒక సమస్యా పూరణం

124 views
Skip to first unread message

swathi kumari

unread,
Dec 9, 2009, 3:45:33 AM12/9/09
to sahi...@googlegroups.com
సాహిత్యం గుంపు మిత్రులకి నమస్కారం.
నన్ను ఒకరడిగారు: ’కృష్ణ’ అనే పదానికి మాధవుడనే కాక ద్రౌపది, అర్జునుడు, నలుపు అనే అర్ధాలున్నాయి(ట) కదా. ఈ నాలుగు అర్ధాల్లో ఆ శబ్ధాన్ని ఉపయోగించి అర్జునుడు మత్స్య యంత్రాన్ని చేదించి ద్రౌపది ని పెళ్ళాడిన విషయాన్ని పద్య రూపం లో చెప్పగలారా అని. ఎవరైనా ప్రయత్నించి చూస్తారా?

--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Dec 10, 2009, 3:55:16 AM12/10/09
to sahi...@googlegroups.com

Swathi garoo,

Naaku thochina vidhanga rastunnanu. Anyadha bhavinchakandi.  indulo www.lekhini.org lo naaku Krishnudu ane maata lo "vatrasudi" ela vadalo theleeledu.

mee samasyanu ee vidhanga theta theta thetageethi lo cheptunnanu. aalakinchandi.

వలువలూడ్వగ ద్రౌపది వగచె మీదు
అర్జునుండును జెందగనధిక బాధ
నలుపురంగుల కోకలు నరయ బంపి
క్రుష్ణ దేవుదు జూపెను క్రుపను యెంతొ!


jyothi valaboju

unread,
Dec 10, 2009, 4:05:26 AM12/10/09
to sahi...@googlegroups.com
 లేఖినిలో    kRshnuDu  - కృష్ణుడు

swathi kumari

unread,
Dec 10, 2009, 11:01:00 AM12/10/09
to sahi...@googlegroups.com
బావుంది.
కానీ ’కృష్ణ’ పదమే నాలుగు సార్లు వేర్వేరు అర్ధాల్లో రావాలనేది సమస్య. ఇది రాసిన వారికి అదొక పెద్ద పని కాదులెండి.

2009/12/10 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>

Geddapu Lakshmi Prasad

unread,
Dec 11, 2009, 7:40:00 AM12/11/09
to sahi...@googlegroups.com
 
జస్ట్ ఫర్ ఫన్
   
కృష్ణను వివాహమాడంగ కృష్ణు డేగి
కృష్ణుని యనుమతిన్ గొని కేల విల్లు
దాల్చి మత్స్య యంత్రము గూల్చి ధన్యుడయ్యె
కృష్ణ దేహుడు బావ సత్ కృప కతమున
2009/12/9 swathi kumari <swathi...@gmail.com>

swathi kumari

unread,
Dec 12, 2009, 2:39:32 AM12/12/09
to sahi...@googlegroups.com
చక్కగా ఉంది పూరణ. దీని చంధస్సు ఏమిటి?
ఒక మాట మర్చిపోయాను, చివరి పాదం లో నలుపు వర్ణం గురించి కాకుండా కృష్ణ ద్వైపాయనుడైన వ్యాసుడిని ప్రస్తావించాలి.
http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3

2009/12/11 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>

kopalle maninath

unread,
Dec 12, 2009, 7:44:34 AM12/12/09
to sahi...@googlegroups.com


2009/12/9 swathi kumari <swathi...@gmail.com>

సాహిత్యం గుంపు మిత్రులకి నమస్కారం.
నన్ను ఒకరడిగారు: ’కృష్ణ’ అనే పదానికి మాధవుడనే కాక ద్రౌపది, అర్జునుడు, నలుపు అనే అర్ధాలున్నాయి(ట) కదా. ఈ నాలుగు అర్ధాల్లో ఆ శబ్ధాన్ని ఉపయోగించి అర్జునుడు మత్స్య యంత్రాన్ని చేదించి ద్రౌపది ని పెళ్ళాడిన విషయాన్ని పద్య రూపం లో చెప్పగలారా అని. ఎవరైనా ప్రయత్నించి చూస్తారా?

--


hello swathi garu!
namaste!
మీరు ఇచ్చిన పూరణ చాలా బాగుంది.
నాకు పద్యాలూ రాయటం రాదు కానీ నాకు తోచిన భాషలో రాస్తాను. .....

కృష్ణ కృష్ణున  కభి వాదమొనర్చి
కృష్ణ మత్శ్యమును శరముతో ఛేదించి
కృష్ణను పాణి గ్రహమొనర్చేనని
కృష్ణ ద్వైపాయనుడు  భారతంబున లిఖించేన్

మణినాథ్ కోపల్లె
 




 

http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

Geddapu Lakshmi Prasad

unread,
Dec 14, 2009, 12:51:10 AM12/14/09
to sahi...@googlegroups.com
ఇది తేట గీతి పద్యం ఈ ఛందస్సు లో కృష్ణ ద్వైపాయనుడిని ఇరికించడం కష్టం కాని మళ్ళీ ప్రయత్నిస్తా  

2009/12/12 swathi kumari <swathi...@gmail.com>

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Dec 14, 2009, 12:57:37 AM12/14/09
to sahi...@googlegroups.com, swathi...@gmail.com

తే!గీ! తృష్ణ మీదను కృష్ణుడు(1) గృష్ణ(2) గోర!
కృష్ణు(3)దోడుగ నేతెంచె గృపను బొంద!
సాగె గృష్ణ ద్వైపాయను సాక్షి గాను!
నల్లమబ్బులు రావించ నరయ మురళి!
మత్స్య యంత్రము ఛేదించె సత్యమనఘ!

1. ఆర్జునుడు. 2. ద్రౌపది 3. శ్రీ కృష్ణుడు.



padyam 5 paadalauga sagindi. modata ichina samasya kakunda mallee mukthayipu ivvadam tho.
rasagnulu aanandistarani, sadvimarsalu, doshalu evaina unte cheptharani asistoo.

venkatappaiah 
 


Geddapu Lakshmi Prasad

unread,
Dec 14, 2009, 4:55:25 AM12/14/09
to sahi...@googlegroups.com
కృష్ణ ద్వైపాయను అన్న చోట ఛందస్సు తప్పింది వరసగా అన్నీ గురువులై తేట గీతి నడక తప్పింది  మత్స్య యంత్రము ఛేదించె సత్యమనఘ అనే దగ్గర ప్రాస యతి సరిపోలేదు అయినా మంచి ప్రయత్నం. వదిలిపెట్టకండి (కీప్ ఇట్ అప్)

2009/12/14 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Dec 14, 2009, 5:25:05 AM12/14/09
to sahi...@googlegroups.com, lakshmipra...@gmail.com
Ok

LAKSHMI PRASAD GARU, VEELUNTE MALLEE TRY CHESTANU.

KRISHNA DWAIPAYANU KOSAM BOLDANTHA TRY CHESANU. ANNEE GURUVULE VASTUNNAYI KADA
SEESA PADYAM AITHE THAPPA ILANTIVI RAYALEMU.


OK THANKS FOR SUGGESTION

REGARDS

VENKAT

2009/12/14 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>

sudhakar valluri

unread,
Dec 14, 2009, 8:58:13 AM12/14/09
to sahi...@googlegroups.com
వేంకటప్పయ్య గారు,
చక్కగా పద్యాలు తేట తెలుగులో వ్రాయగలిగిన మీరు, ఎంచక్కగా సమాధానము, భావము/భాష్యము తెలుగులోనే వ్రాస్తే మాబోటి వారు చదవటానికి సౌకర్యముగా వుంటుంది. గమనించ గలరు.

2009/12/14 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>
Ok
LAKSHMI PRASAD GARU, VEELUNTE MALLEE TRY CHESTANU.
KRISHNA DWAIPAYANU KOSAM BOLDANTHA TRY CHESANU. ANNEE GURUVULE VASTUNNAYI KADA
SEESA PADYAM AITHE THAPPA ILANTIVI RAYALEMU.
OK THANKS FOR SUGGESTION
REGARDS
VENKAT
--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్
Reply all
Reply to author
Forward
0 new messages