" 'మామిడి పండు' అనే మాటకు సమానార్థకమైన మాట భారతదేశంలోని ప్రతి భాషలోను వుంది. కాని, యూరప్ లోని యే భాషలోను లేదు. యెందుకు లేదంటే, యూరప్ లో మామిడి పండే లేదు గనుక.ఇంగ్లీషువాళ్ళు మనదేశానికి వచ్చినప్పుడు మామిడి పండును/ కాయను చూసి, తమిళంలోని 'మాంగాయ్'నుండి mango అనేమాట సృష్ట్తించుకున్నారు.....అలాగే, యూరప్ లో వున్న పండ్ల పేర్లు మన భాషల్లో లేవు.యెందుకు లేవంటే ఆ పండ్లే మనకు లేవు గనుక.... వస్తువే లేకపోతే దానికి పేరు వుండడం సాధ్యం కాదు గదా.వస్తువు ప్రత్యక్షంగా లేకపోయినా, ఊహలో వున్నా సరే, మనుషులు దానికి పేరు పెట్టుకోగలరు.స్వర్గం, నరకం, దేవుడు, దయ్యం, అప్సరస, బడబాగ్ని లాంటి పదాలు ఇలా పుట్టినవే.
ఈ విషయాలు చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఎక్కడో చదివాను అరబిక్ లో ఒంటెకు 700 దాకా పర్యాయ పదాలున్నాయి అలాగే ఉత్తర ధృవంలో మాట్లాడే ఇనుక్టూట్ లో మంచుకు 200 దాకా పదాలున్నాయని. నన్ను బాగా ఇబ్బంది పెట్టేది weather కి climate కి atmosphere కి నిర్ధిష్టమైన తెలుగు పదాలు లేకపోవటం. ఇకపోతే ఆ చివర్లో గాలి, వాయువు పర్యాయపదాలన్నారు. అది కాస్తా అలోచించాల్సిందే. గాలి వీస్తుంది అని అంటారు కానీ వాయువు వీస్తుంది అని అనరు కదా (ఖచ్చితంగా వీటి అర్ధంలో తేడాలుండాలే)
12:01 AM
పదాలే ఏం ఖర్మ! అసలు కాలాలే tenses భాషల మద్య వేరు కదా!
--ప్రసాద్
http://blog.charasala.com
5:27 AM
అ)చాలా ఇంగ్లీషు మాటలకు తెలుగులో సరైన మాటలు లేవు.ఇంగ్లీషులోనే కాదు, యే
భాషలోనైనా యితర భాషల్లోలేని పదాలు కొన్నైనా వుంటాయి.(మన తెలుగులో అటువంటి
పదాలు అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు,మేనత్త, పెద్దమ్మ, పిన్నమ్మ, మేనమామ,
పెద్దనాన్న,చిన్నాన్న.రవి గారన్నట్లు అరబిక్ లో ఒంటెకు 700పర్యాయ
పదాలు,ఉత్తర ధ్రువం లో మంచుకు 200 పదాలు ఇవే బాపతు).
1) ఓ జాతి
నివసించే భూభాగపు శీతోష్ణస్థితులను బట్టి,భౌగోళిక పరిస్థితులను బట్టి వీటి
పై అదారపడ్డ దాని జీవిత విధానం బట్టి దాని భాష వుంటుంది.యూరోప్ లోని భౌతిక
పరిస్థితులకూ, మనుషుల జీవిత విధానానికి,మనదేశంలోని భౌతిక పరిస్థితులకూ,
మనుషుల జీవిత విధానానికి మధ్య చాలా భేదం వుంది.భాషల మధ్య బేధానికి ఇదో
కారణం.
2)భాషల భేదానికి మరో కారణం, ఆ భాషలు మాట్లాడే జాతుల వికాసంలో
భేదమే. గత 4శతాబ్ధాలుగా యూరోపియన్ జాతులు అభివృద్ధి చెందినంతగా ప్రపంచలోని
యితర జాతులు అభివృద్ధి చెందలేదు.అందువల్లనే యూరోపియన్ భాషలు వికసించినంతగా
ఇతర భాషలు వికసించలేదు.
ఇంగ్లీషులో పదాల సంఖ్య పది లక్షలకు
చేరిందంటే, ఆ భాషలో లేని పదాలను ఇతర భాషలనుంచి ధారాళంగా తీసుకోబట్టే కదా.
మనమూ, మడికట్టుకోకుండా, మన భాషలో లేని పదాలను, ఇతర భాషలనుండి తీసుకోవడంలో
తప్పేమి లెదు. కానీ అటువంటి పదాలను ఎవరు ప్రమాణీకరిస్తారు?
ఆ)weather
కి climate కి atmosphere కి నిర్ధిష్టమైన తెలుగు పదాలు లేకపోవటం నిజమే!
atmosphere-
నభోవరణం, వియత్తు, వియత్వరణం;climate-వాతావరణం,శీతోష్నస్థితి;
weather-దైనందిన వాతావరణం అనొచ్చు.
ఇ)గాలి, వాయువుల విషయానికొస్తే: గాలి తెలుగు పదం, వాయువు సంస్కృత పదం. అదే తేడా.
ఈ)నిజమే.తెలుగులో కాలములు మూడే -వర్తమాన కాలం, భూత కాలం, భవిష్యత్కాలం. కొందరు నాలుగవదిగా తద్ధర్మ కాలం చేరుస్తారు.
ఇంగ్లీషులో
కూడా మూడు కాలలే- present tense, past tense, future tense న్నూ. అదనంగా
వాటికి మళ్ళీ 4 రూపాలు(aspects) ఉన్నాయి -simple, continuous,
perfect,perfect continuous, అలా మొత్తం (3x4)12 ఔతాయి.
1)ఇంగ్లీషులోని simple past,past perfect,present perfect, తెలుగులో భూతకాలము (ఉదా:తిన్నాను);
2)ఇంగ్లీషులోని
past continuous, past perfect continuous, present continuous,present
perfect continuous, తెలుగులో వర్తమానకాలము (ఉదా:తింటున్నాను)
3)ఇంగ్లీషులోని simple present, simple future, future perfect తెలుగులో భవిషత్కాలము.(ఉదా:తింటాను)
4)ఇంగ్లీషులోని future continuous, future perfect continuous తెలుగులో భవిషత్కాలము (ఉదా:తింటుంటాను)