తెవికీలో ఛందస్సు

67 views
Skip to first unread message

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 19, 2007, 11:33:11 AM4/19/07
to sahi...@googlegroups.com, telug...@googlegroups.com
మిత్రులారా,
 
తెవికీలో ఛందస్సు అంటే ఏమిటో చెప్పబడలేదు. నేరుగా గురువులు, లఘువులు, విభజన, లిప్తకాము, మాత్రలు వంటి పదాలతో తెలుసుకుందామని వచ్చేవారిని కాస్త భయపెట్టేదిగా ఉందని నా అభిప్రాయం. అసలు ఛందస్సు అంటే ఏమిటో సరళంగా చెప్పడం వల్ల దానిమీద ఆసక్తిని కలిగించి, తరువాత, వారికివారుగా గురులఘువులను గురించి తెలుసుకొనేలా చేయడం బాగుంటుందికదా! ఈ ప్రక్షాళనా కార్యక్రమాన్ని ముందుగా ఛందస్సు అంటే ఏమిటో వివరంగా ఒకటి రెండు ఉదాహరణలలో వివరించి, అక్కడి నుండి గురువు, లఘువు అనే ప్రత్యేక పేజీలకు లింకులు ఇవ్వడం మంచిపద్ధతి అనుకుంటున్నాను. ఆ పేజీలలో వాటిగురించి కూలంకషంగా వివరించడం ఆసక్తికరంగా ఉంటుందికదా!? ఛందస్సు పేజీలో ఇచ్చే వివిధరకాల ఛందోబద్ధమైన ఉదాహరణలతో ఆయా ఛందోవిభాగాలకు (ఆవె, తేగీ, సీ, చ, ఉ, శా, మ, తరళము, ....) లింకులు ఇచ్చి అక్కడికి రండి చూసుకుందాం వాటిసంగతేంటో అని పిలిచినట్లుగా ఆసక్తిగా రాయాలనే తలంపు కలిగింది నాకు. దీనికి తెవికీ మిత్రులు అంగీకరిస్తారనే అనుకుంటున్నాను.
 
అయితే, నేనిక్కడ చెప్పిన పద్ధతి సరైనదేనా అనేది మన సాహిత్యం గుంపులోని పెద్దలు తమ విమర్శలు, సలహాలు, ఆశీస్సులతో నిర్ణయించి మార్గనిర్దేశం చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఛందస్సు అంటే ఏంటో చూసిపోదాం అని వచ్చినవారిని మరిన్ని కొత్తపదాలతో భయపెట్టడంకన్నా, సరళంగా, "ఒహో, సులభంగానే ఉందే, ఇదేదో బ్రహ్మవిద్య అనుకున్నానే" అనిపించి ఆహ్వానించేలా రాద్దామని ప్రయత్నం. మనం ఉదాహరణలుగా ఇచ్చే పద్యాలు అందరికీ తెలిసినవి (ఉప్పుకప్పురంబు), సులభంగా జీర్ణమయ్యేవి(ఏమినోము ఫలమొ ఇంత ప్రొద్దొక వార్త - వింటి మబలల లార వీను లలర - మన యశోద చిన్ని మగవాని గనెనట, చూసివత్తమమ్మ సుదతులార), ఆసక్తిపుట్టించేవి(... కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్), నవ్వు తెప్పించేవి(..మామ మీసాలె భువికి శ్రీరామరక్ష) ఇలా... చదవబుల్‌గా ...      అంగీకారమైతే, మనం ముందుగా ఇక్కడ చర్చించి తరువాత తెవికీలో చేరుద్దాం.
 
"ఛందస్సు" అంటే ఏమిటో ఎక్కడైనా వివరింపబడిందా, ...బడివుంటే దాన్ని గ్రాంధికం నుండి వ్యావహారికానికి తెచ్చి, గ్రంథాలు రచించే ఆసక్తిని కలుగజేద్దాం. "ఛందస్సు అంటే ఏమిటి, అది ఎందుకు, ఎలా ఉంటుంది, దానివల్ల కవిత్వానికి వచ్చే సొగసేమిటి ....". నా ఈ సందేహాలకు, ఇంకా మీకొచ్చిన సందేహాలను జతపరచి, వీటికి సమాధానాలుగా తెలిసిన, మీరు చదివిన ఒకటి రెండు ముక్కలు అందరికీ చెప్పి, ఆరకంగా ముందుకుబోదామని గూడా నేను మీకు తెలియజేస్‌కుంట్‌నాను (మన చంద్రబాబు ఇస్టైల్). 
 
-- రానారె
http://yarnar.blogspot.com

సత్యసాయి కొవ్వలి

unread,
Apr 20, 2007, 6:23:47 AM4/20/07
to sahityam
మీరు లెస్స పలికారు. నేను ఆపుట చూసి భయపడి మూసేసా. మీరు సూచించిన పద్ధతి
ఉపయోగకరంగా ఉండచ్చు.


Ramanadha Reddy Yarrapu Reddy Vraasenu:


> మిత్రులారా,
>

> తెవికీలో ఛందస్సు<http://te.wikipedia.org/wiki/%25E0%25B0%259B%25E0%25B0%2582%25E0%25B0%25A6%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25B8%25E0%25B1%2581>

Sriram

unread,
Apr 20, 2007, 3:01:28 PM4/20/07
to sahityam
ఏమి చెయ్యమంటారో చెప్పండి, మొదలు పెట్టెద్దాం. వికీలో ఒక విభాగం
మొదలుపెట్టడంలాంటిదేమైనా చెయ్యాలా? ఏ రకంగా మొదలు పెడదాం? కొ.పా గారూ
కొంచెం మార్గనిర్దేశం చెయ్యండి.

On Apr 20, 3:23 pm, "సత్యసాయి కొవ్వలి" <saikovv...@gmail.com> wrote:
> మీరు లెస్స పలికారు. నేను ఆపుట చూసి భయపడి మూసేసా. మీరు సూచించిన పద్ధతి
> ఉపయోగకరంగా ఉండచ్చు.
>
> Ramanadha Reddy Yarrapu Reddy Vraasenu:
>
>
>
> > మిత్రులారా,
>

> > తెవికీలో ఛందస్సు<http://te.wikipedia.org/wiki/%25E0%25B0%259B%25E0%25B0%2582%25E0%25B0...>

> >http://yarnar.blogspot.com- Hide quoted text -
>
> - Show quoted text -

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Apr 20, 2007, 5:28:47 PM4/20/07
to sahi...@googlegroups.com, telug...@googlegroups.com
స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు , ఇంచని మిత్రులందరికీ వందనాలు.
 
 
"ఛందస్సు" అంటే ఏమిటో ఎక్కడైనా వివరింపబడిందా, ...బడివుంటే దాన్ని గ్రాంధికం నుండి వ్యావహారికానికి తెచ్చి, గ్రంథాలు రచించే ఆసక్తిని కలుగజేద్దాం. "ఛందస్సు అంటే ఏమిటి, అది ఎందుకు, ఎలా ఉంటుంది, దానివల్ల కవిత్వానికి వచ్చే సొగసేమిటి ....". నా ఈ సందేహాలకు, ఇంకా మీకొచ్చిన సందేహాలను జతపరచి, వీటికి సమాధానాలుగా తెలిసిన, మీరు చదివిన ఒకటి రెండు ముక్కలు అందరికీ చెప్పి, ఆరకంగా ముందుకుబోదామని గూడా నేను మీకు తెలియజేస్‌కుంట్‌నాను (మన చంద్రబాబు ఇస్టైల్).  -- ఇదీ విషయం.
 
ఛందస్సు అంటే ఏమిటని నన్నెవరైనా అడిగితే నాకు తెలిసింది నేనిలా చెబుతాను: 
 
"తెలుగు ఛందస్సుకు ఒక మాటలో చెప్పగలిగే నిర్వచనం కన్నా, ఆ పదం యొక్క మూలాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.  మన మనసుల్లో కలిగే అన్ని రకాల భావాలను మాటల్లో వ్యక్తీకరించడానికి మనకు భాష వుంది. ఈ వ్యక్తీకరణ (Expression) ఒకోసారి చాలా అందంగా రసాత్మకంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలా వస్తుందీ రసాత్మకత అని ఆలోచిస్తే ఆ మాటల్లోని ధ్వని వినసొంపుగా ఉండటం వల్ల కావొచ్చు. వినసొంపుగా ఉండటమనే లక్షణాన్ని చిన్న పిల్లలు కూడా గ్రహించగలరు. ఉదాహరణకు :
 
చిట్టి చిలకమ్మా
అమ్మ కొట్టిందా
తోటకెళ్లావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కు మింగావా
 
చిలక, తోట, గూడు, గుటుక్కు అంటే ఏమిటో తెలియని పిల్లలు కూడా సులభంగా గుర్తు పెట్టుకొని, ఇష్టంగా పాడుకొనే పాట. ఈ పాటలోని సొంపు ఏమిటి? ఎందుకంత సులభంగా గుర్తుండిపోతుంది? కారణాలు బహుశా ఇవి కావొచ్చు:
 
1. ప్రతి వాక్యానికీ చివరున్న దీర్ఘం - చిలకమ్మా, కొట్టిందా, కెళ్లావా, తెచ్చావా, పెట్టావా, మింగావా అంటూ. ఇది ఒక రకమైన ప్రాస. (ప్రాస ఛందస్సులో ఒక ముఖ్య భాగం.)
2. చిట్టి-కొట్టి, తోట-తెచ్చు, గూడు-గుటుక్కు ఇలా పలకడానికి ఒకేలా ఉన్నవి వెంటవెంటనే రావడం.
3. ముఖ్యంగా చివర్లో వచ్చే ఆ గుటుక్కుమింగావా అనే గమ్మత్తైన మాట.
 
ఇలాంటి లక్షణాలు ఒక చిన్న భావ వ్యక్తీకరణ(expression)కు సొంపును తెస్తున్నాయి. ఏమిటీ లక్షణాలు అని ఆలోచించి, వాటిని గుర్తించి, ఒక క్రమంలో పెట్టడం జరిగింది. ఇలా ఏర్పరచిన కొన్ని క్రమపద్ధతులకు లోబడి, మనకు తెలిసిన భాషను ఉపయోగించి ఏదైనా ఒక భావాన్ని వ్యక్తపరిస్తే అది సొంపుగా వినబడేలా రూపొందించిన కొన్ని ప్రాథమిక సూత్రాలను అన్నిటినీ కలిపి ఛందస్సు అంటాం. కవితలన్నీ ఛందస్సుకు లోబడే ఉండాలని నిబంధన ఏమీ లేదు. ఛందస్సుకు లోబడిన భావము మరింత చక్కగా వినడానికీ, చదవడానికి బాగుంటుంది. గుర్తుండిపోతుంది.
 
ఛందస్సు ఒక మూస, ఒక నమూనా, ఒక నడక, ఒక గతి. దాన్ననుసరించి నడచిన పదాల అల్లిక కవిత్వం అవుతుంది. ఆ పదాల అల్లిక భావయుక్తమైనదైతే అది రాణిస్తుంది. (అందం - చందం అంటాం. ఒక మంచి భావము అందమైతే ఛందస్సుకు లోబడినప్పుడు దానికి చందం అబ్బుతుందనుకోవచ్చు.)
 
శ్రీశ్రీ అనగానే అందరికీ గుర్తుకువచ్చే "కుక్కపిల్లా - అగ్గిపుల్లా - సబ్బుబిళ్లా" ప్రాసకు తోడు భావం గొప్పది గనక ఆ కవిత్వం ప్రజల్లో నిలబడింది.
ప్రాస మనందరికీ తెలిసిన ఒక ఛందో ప్రక్రియ. ప్రాసలో కొన్ని రకాలున్నాయి. వాటిని ఫలానా పేజీలో ఉదాగరణలతో సహా వివరించడం జరిగింది. 
ప్రాస కాక ఛందస్సులో ఇంకా ఏమున్నాయ్? యతి అనేది ఒకటుంది. యతి అంటే....ఇది...ఇది...ఇది... మరిన్ని ఆసక్తికర విశేషాలకు ఫలానా పేజీ .
 
ఛందస్సు ఒక నడక, ఒక గతి అన్నాం. ఎలా నిర్దేశిస్తాము ఆ నడకను (నడకల వయ్యారాన్ని - ఇది కొంచెం ఎక్కువైందిలెండి)? ఎలాగంటే ఒక పాటకు తాళం నడకలాగా ఒక పద్యానికి కూడా ఛందస్సు నిర్దేశించిన నడక ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం.
 
"ఇంత బతుకు బతికి ఇంటెనక చస్తివే" - అనేది చూడండి. ఒక వేమన పద్యం ప్రారంభమైనట్లుగా లేదూ? అవును మరి. అది ఆటవెలది పద్యానికి మొదటి లేదా మూడవ పాదముగా పనికొస్తుంది. పాదమంటే లైను - వేమన పద్యాలన్నా ఆటవెలదులు. ఆటవెలది నాలుగు పంక్తు(లైను)ల పద్యం. ఒకో పంక్తినీ పాదము అంటారు.
ఇలాంటి పద్యాలు ఆటవెలది లక్షణాలేమిటో (లింకు) తెలుసుకొన్నాక, మీరు రాయవచ్చు. ఇప్పుడో నిజమైన వేమన పద్యాన్ని, ఇందులో "యతి"ని చూద్దాం.
 
అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డ వారి నెల్ల దొలగ గొట్టు!
చెప్పు దినెడు కుక్క చెఱకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ!!
 
ఈ పద్యంలో ప్రతి పాదములోనూ - మొదటి గణము మొదటి అక్షరానికీ, నాలుగవ గణము మొదటి అక్షరానికీ యతి ఉంది.
గణము అంటే ఏంటో తర్వాత చూద్దాం, ముందిది గమనించండి.
1వ గణము   -    4వ గణము
అల్ప లోని అ - కధికా లోని క(అ)
దొడ్డ లోని దొ - దొలగ లోని దొ
చెప్పు లోని చె - చెఱకు లోని చె
విశ్వ లోని వి - వినుర లోని వి
 
కొంచెం అర్థమైంది కదా? యతి గురించి పూర్తి వివరాలు -- ఫలానా పెజీలో ఉన్నాయి. ప్రాసయతి అంటే ఏమిటో కూడా అక్కడే ఉంది.
వేమన పద్యాల్లోని (అనగా ఆటవెలది పద్యాలు) సొంపు ప్రధానంగా వాటి "యతి" లేక/మరియు "ప్రాసయతి" మూలముగా వస్తుంది.
 
ఇక గణము అంటే ఏమిటో కూడా పై ఉదాహరణతో ఈపాటికే అర్థమై ఉంటుంది.
గణమంటే ఒక పదమే కానక్కర లేదు. పై ఉదాహరణలో "కధికా" చూశారుగా.
గణము అంటే ఏమిటి, ఒక పాదంలోని ఒక్కో గణమును ఎలా గుర్తించాలనేది చాలా సులభం - ఈ పేజీ చూడండి. (ఇందులో గణ విభజన, గురువు, లఘువు)
 
ఇందాక, వేమన పద్యాలన్నీ ఆటవెలదులు అన్నాం. ఆటవెలది లక్షణాలేమిటి? ఇక్కడ చూడండి - తెలిసిపోతుంది. ఉదాహరణలతో సహా వివరణ ఉందక్కడ.
 
సరే, ఆటవెలదులు కాక ఇంకే మున్నాయి? తెటగీతి, సీసపద్యము, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్తూలము, మత్తకోకిలము, తరళము మొ. [లింకులు]
[ఛందస్సును గురించిన మరిన్ని ఉపకరణాలు, ఇంటర్నెట్ వనరులు]
అయ్యా అదీ.
 
ఇంతటితో ఛందస్సు అనే తెవికీ పేజీ సమాప్తము.
 
ఛందస్సును గురించి మన యువకులకు ఆసక్తికలిగేలా, సులభంగా అర్థమయ్యేలా ఇలా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు అనిపిస్తుంది నాకు (దీన్ని దిద్దడానికి నా సహవిద్యార్థులు, పెద్దలు ఉన్నారన్న ధైర్యంతో). కానీ ఇది మన తెవికీ శైలికి లోబడే ఉందా? నా భాషను మరీ ఇంత వ్యావహారికంలో ఉంచకూడదేమో, అవసరమైన చోట్ల మారుద్దాం. విజ్ఞాన సర్వస్వం అనేది శైలికి ప్రాధాన్యతనిచ్చి, ఉపకరించకుండా ఉండిపోతే లాభం లేదు కదా !?
 
ఛందస్సు అంటే ఏమిటో మీ మాటల్లో తెలియజేయ మనవి, లేదా, నా మాటల్లోనే దిద్దుబాట్లు సూచించండి.
 
ఇప్పుడు దీన్ని గురించి మిత్రులేమనుకుంటున్నారో నాకు తెలియాలి తెలియాలి తెలియాలి [3 times :) ]
Message has been deleted

Sriram

unread,
Apr 21, 2007, 6:48:35 AM4/21/07
to sahityam
చక్కగా రాసారు రానారె. ఇది వికీలో పెట్టండి. నేను కూడా నాకు తోచినట్టు
రాసి చూపిస్తాను. అక్కడనుంచి మరిన్ని పుటలు లంకె వేసి తయారు చేద్దాం.

ఇంకా, పద్యమనగానే ప్రస్తుతం ఎక్కువగా ఉన్న అభిప్రాయం అదొక పనికిరాని
ప్రక్రియ అనీ, అసలు పద్యాలలో మంచి సాహిత్యం లేదనీ వీటికన్నింటికీ మించి
అర్ధం కావనీను. ఈ అభిప్రాయం మార్చగలగాలి. అర్ధం కాదు అని ఒక్కమాటతో ఎంత
పదసంపదని కోల్పోతున్నామో తెలియచేయాలి.

జీఆర్‌యీ లాంటి పరీక్షల కోసం అక్కల్లేని ఆంగ్లపదాలు బట్టీ పట్టే వారికి
ఆన్లైన్ నిఘంటువు వాడి పద్యాన్ని అర్ధంచేసుకోడం కష్టం కాదు కదా.
సాహిత్యాభిమానం ఉండాలి అంతేనన్న సంగతి అందరికీ అర్ధమయ్యేలా చెయ్యాలి. మన
తెలుగు భాష అస్థిత్వానికి పద్యం పచ్చగా ఉండడం ఎంత అవసరమో కూడా చెప్పాలి.

On Apr 21, 2:28 am, "Ramanadha Reddy Yarrapu Reddy"


<iamramuh...@gmail.com> wrote:
> స్పందించిన మిత్రులకు కృతజ్ఞతలు , ఇంచని మిత్రులందరికీ వందనాలు.
>

> *"ఛందస్సు" అంటే ఏమిటో ఎక్కడైనా వివరింపబడిందా, ...బడివుంటే దాన్ని గ్రాంధికం


> నుండి వ్యావహారికానికి తెచ్చి, గ్రంథాలు రచించే ఆసక్తిని కలుగజేద్దాం. "ఛందస్సు
> అంటే ఏమిటి, అది ఎందుకు, ఎలా ఉంటుంది, దానివల్ల కవిత్వానికి వచ్చే సొగసేమిటి
> ....". నా ఈ సందేహాలకు, ఇంకా మీకొచ్చిన సందేహాలను జతపరచి, వీటికి సమాధానాలుగా
> తెలిసిన, మీరు చదివిన ఒకటి రెండు ముక్కలు అందరికీ చెప్పి, ఆరకంగా
> ముందుకుబోదామని గూడా నేను మీకు తెలియజేస్‌కుంట్‌నాను (మన చంద్రబాబు ఇస్టైల్).

> -- ఇదీ విషయం.*

Reply all
Reply to author
Forward
0 new messages