తెలుగు పద ప్రయోగంలో అందేహం

287 views
Skip to first unread message

నందు

unread,
Sep 20, 2018, 11:35:04 PM9/20/18
to సాహిత్యం
తెలుగు సాహిత్యం గ్రూపు సభ్యులకు నమస్కారం !

నాదొక చిన్న సందేహం దయజేసి నివృత్తి చేయగలరు. తెలుగులో తెలుసుకొను అన్న పదం ఉంది. దీన్ని వాడుకలో 'తెలుకుంటాను' అని గానీ 'తెలుసుకొంటాను' అని గానీ వాడచ్చు అని నా అభిప్రాయం. కానీ "తెలుసుకుంటాను" అని మాత్రమే వాడాలి "తెలుసుకొంటాను" అని వాడకూడదు. అది తప్పు అని మా ఆవిడ అభిప్రాయం. అందుకని నేను "తెలుసుకొంటాను", "కనుక్కొంటాను", "చూసుకొంటాను" మొదలగు పదాలు వాడినప్పుడల్లా "ఏం కొంటారు ?" అని నన్ను సరదాగా ఆటపట్టిస్తోంది. ఈ విషయమై తెలుగు ఉపాధ్యాయురాలైన మా అత్తగారిని అడగగా ఆవిడ కూడా మా భార్యనే సమర్దించి "తెలుసుకుంటాను" అనే అనాలి "తెలుసుకొంటాను" అనకూడదు అన్నారు. ఇది ఎంత వరకూ వ్యాకరణపరంగా సమ్మతము? చివరన కొంటాను అని వచ్చిన పై పేర్కొన్న పదాలన్నీ అలా పలకడం దోషమా ?

శెలవు
భవదీయుడు
ఆనంద్ రాపాక

Venkat Ramaiah

unread,
Sep 20, 2018, 11:58:30 PM9/20/18
to sahi...@googlegroups.com
వ్యాకరణానికి అభిప్రాయాలతో సంబంధం లేదు అంతేకాకుండా అంత పాండిత్యం నాకు లేదు గానీ - తెలుసుకోండి, తెలుసుకోవాలి, తెలుసుకొనుట, తెలుసుకొని వంటి పదాలే ఉన్నాయి కాబట్టి తెలుసుకొంటాను అనడం లో తప్పు లేదు అని నా అభిప్రాయం. 

--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

యశస్వి సతీశ్

unread,
Sep 21, 2018, 12:43:34 AM9/21/18
to sahi...@googlegroups.com
రెండు సమ్మతమైనవే ముద్రణలో  తెలుపుకొంటాను అని రాస్తారు, కు రాయరు, ముందు అక్షరం వల్ల (పదం కాదు) ాని చదువుకోండి 

On Fri, 21 Sep 2018 at 10:03, యశస్వి సతీశ్ <shriy...@gmail.com> wrote:
రెండు సమ్మతమైనవే ముద్రణలో  తెలుపుకొంటాను అని రాస్తారు, కు రాయరు, ముందు పదం వల్ల, కుదుపునకు తుళ్ళిపడ్డాడు అని రాస్తారు న చేర్చి, అందువల్ల అది తప్పు, ఇది ఒప్పు అని ఏంలేదు, రెండూ వాడుక లో ఉన్నవే, కరవడం కొరకడం తేడా మనం వాడుక లో ఏర్పాటు చేసుకున్నదే కదా! డిక్షనరీ అర్థం ఏదైనా, వాడుక రూఢీ చెయ్యాల్సిందే, మీదేం తప్పులేదు;  ఆనంద్ రాపాక మాండలీకపు యాసలో అసలు అది తేడాయే కాదు

--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--
సతీష్ ..

--
సతీష్ ..

గుండు మధుసూదన్

unread,
Sep 21, 2018, 6:31:59 AM9/21/18
to sahi...@googlegroups.com
వ్యాకరణంలో ’కొను’ ధాతువు మాత్రమే ఉన్నది. ఇది ధాతువునకు స్వార్థములో అనుప్రయుక్తమవుతుంది.వండు (అందరికోసం), వండుకొను (తనకోసం) లాగా.  తెలియు+ కొను = తెలుసుకొను (తెలుసుకొనెదను) అని గ్రంథాల్లో వాడాలి. ’కును’ అనేది ధాతువు కాదు. ఇది వ్యావహారికం. తెలుసుకుంటాను కూడా వ్యావహారికమే. తెలుసుకొనెద, తెలుసుకొనియెద...అనేవే గ్రాంథిక రూపాలు. తెలుసుకొంటాను...తెలుసుకుంటాను అనేవి వ్యావహారిక రూపాలు. గ్రంథాల్లో తెలుసుకొనెదను అనే వాడాలి.

-మధురకవి గుండు మధుసూదన్

21 సెప్టెం, 2018, శుక్రన 10:13 AMకిన యశస్వి సతీశ్ <shriy...@gmail.com> వ్రాసినది:

anand

unread,
Sep 22, 2018, 12:38:26 AM9/22/18
to sahi...@googlegroups.com
వెంకట్ గారు, యశస్వి గారు, మధుసూదన్ గారు చక్కగా వివరించారు,  నెనర్లు !! 

- ఆనంద్ రాపాక

Pardha saradhi Kandala

unread,
Sep 22, 2018, 5:44:05 AM9/22/18
to sahi...@googlegroups.com
గైకొనుట. లాగుకొనుట. వంటి పద ప్రయోగం గలది. కనుక.     కొనుట అన్నది కొనుగోలు అర్థాన్ని ఇచ్చు పదము కాదని నా పాండిత్యం.  

సతతం

unread,
Oct 8, 2018, 9:52:46 PM10/8/18
to sahi...@googlegroups.com
బాలవ్యాకరణరచనతో భాష ఒక చక్కని రూపు దాల్చాక ఇంకా వ్యవహారం పేరుతో దాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడం సమంజసం కాదు.
"క్రియాఫలంబు కర్తృగామి యగుచో గొనుధాతు వనుప్రయుక్తం బగు" అని బా.వ్యా.సూత్రం.
చేసిన పనిచే సిద్దించే ఫలం క్రియాఫలం.
ఆఫలం కర్తకే (చేసినవాడికే) చెందితే అంటే కర్తృగామి అయితే
కొను అనే ధాతువు ముఖ్యధాతువుకు చేర్చబడుతుంది.
వంట తనకోసం తాను చేసుకొంటే వండుకొనుచున్నాడు అవుతుంది.
ఇలాగే మిగతా ఉదాహరణలు చూసుకోండి.
కును అన్నది లేనేలేదు.
వ్యవహారం పేరుతో వాడతాను అంటే ఖండించండి.
ఇంగ్లీషులో talk అని వ్రాయను tak అని వ్రాస్తాను అంటే
ఇంగ్లీషు వాళ్ళైనా ఒప్పుకొంటారేమో కానీ మన ఇంగ్లీష్ టీచర్లు ఒప్పుకోరు కదా!
పరాయి భాషలో పనికిమాలిన నియమాలను కచ్చితంగా పాటిస్తారు.
మన భాషనైతే ఇష్టం వచ్చినట్లు మార్చేస్తారు.
కనీసం ఒప్పేమిటో తెలుసుకోరు.
నోటికొచ్చినది వ్రాసి వ్యవహారం అంటే ఎలా?
కాబట్టి వ్యాకరణవిరుద్ధమైన పదాలు వాడితే
తప్పు అని తప్పకుండా, కచ్చితంగా చెప్పండి.
గౌరవనీయులైన మీ అత్తగారితో దయచేసి కొంచెం బాలవ్యాకరణం చదవమని చెప్పండి.
విద్యార్థులకు తప్పులు చెప్పకూడదు కదా!
ఇలా చెప్పినందుకు ఏమనుకోకండి.
నొప్పిస్తే మన్నించండి.
నమస్కారాలు.

--

సతతం

unread,
Oct 8, 2018, 9:57:17 PM10/8/18

On Fri, Sep 21, 2018 at 9:05 AM నందు <anand...@gmail.com> wrote:
--

Suresh Kumar

unread,
Oct 12, 2018, 2:52:18 AM10/12/18
to sahi...@googlegroups.com
ధాన్యవాదము
Reply all
Reply to author
Forward
0 new messages