అందరూ ఆహ్వానితులే..
మిత్రులారా,
'అమెరికా హాస్యబ్రహ్మ" అని కొందరి చేత పిలిపించుకోబడే వంగూరి చిట్టెన్ రాజు ..అంటే నేనే....నేను వ్రాసిన 5 నాటికలు ఎంపిక చేసుకుని తెలుగు రాష్త్రాలలో ఉన్న 5 ప్రముఖ నాటక సంస్థలు "అమెరికామేడీ నాటికోత్సవాలు" పేరిట మా కాకినాడలో సెప్టెంబర్ 6, 7, 2025 తేదీలలోనూ, తర్వాత సెప్టెంబర్ 13, 14,2025 తేదీలలో హైదరాబాద్ లోనూ ప్రదర్శిస్తున్నారు. వాటిల్లో నేను వేషాలు వెయ్యడం లేదు కానీ మొదటి వరసలో కూచుని చూస్తాను....ఎలా రాశానో, ఎలా వేస్తారో... చూద్దాం అని కుతూహలం...నా లాగా కుతూహలం ఉన్నవారు తప్పకుండా వచ్చీ నాతో పాటు చూడండి....
కాకినాడ (సెప్టెంబర్ 6-7,2025) వివరాలు జత పరిచాను...అనగా...నాటికలు, నాటక సంఘాలు, దర్శకులు,నటీనటులు, సభా విశేషాలు, ఆత్మీయ అతిధులు....వగైరా
అన్నట్టు, కాకినాడలో ప్రముఖ నటుడు, ప్రయోక్త, కవి అయిన తనికెళ్ళ భరణికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి జీవన సాఫల్య పురస్కార ప్రదానం, కాకినాడ రంగస్థల నిష్ణాతులు ఆచార్య బి.వి. రమణ మూర్తి, ఆచార్య డి.ఎస్.ఎ,మూర్తి గార్లకి యంగ్ మెన్స్ హేపీ క్లబ్ ఆత్మీయ పురస్కార ప్రదానం జరుగుతాయి.
హైదరాబాద్ వివరాలు (సెప్టెంబర్ 13-14, 2025) త్వరలోనే...
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు