ప్రకాశం పంతుల గారి ‘’దార్శనిక ప్రకాశం ‘’-3(చివరి భాగం )
బందరులో ఆంధ్రరత్న భవన౦ లో ఒకసారి ప్రకాశంగారిని బ్రహ్మయ్య గారు కలిసిమాట్లాడగా ‘’బ్రహ్మయ్యా !ఆ పాత మండువా ఇంట్లోనే ఉంటున్నావా ?కొత్త డాబా కట్టావా ?’’ఆని అడిగితె ‘’పంతులుగారూ !బ్రహ్మయ్యలోనూ మార్పులేదు ఆయన ఇంటిలోనూ మార్పు లేడు ‘’అనగానే కళ్ళు చెమ్మగిలి తుడుచుకొన్నారు ఆంధ్రకేసరి .మద్రాస్ లోకార్పోరేషన్ వారు ఆంధ్రకేసరి విగ్రహాన్ని 45వేల రూపాయలతో నెలకొల్పారని అందరూ సంతోషించారు .ఈ పని కాంగ్రెస్ అధికారం లో ఉండగానే ఏనాడో జరిగి ఉండాల్సింది .ఈ సంకల్పం కామరాజ నాడార్ ది .ఆచరణ ముఖ్యమంత్రి అన్నా దురై ది .దీనికి కారణాలు చాలాఉన్నాయి . ఆయన ముఖ్యమంత్రి అవటమేకాదు ,సైమన్ కమిషన్ బహిష్కరణలో మద్రాస్ ప్రజలకు నాయకత్వం వహించటం ,తుపాకి తన గుండె ఎదురుగ నిల్పి గర్జించటం ,అశేష ఖ్యాతి భారత జాతికి కల్గించటం వగైరాలు .ఈ ఘట్టాన్నిప్రతిబింబించే విగ్రహాన్ని మద్రాస్ హైకోర్ట్ ప్రాంగణంలో కూడా పెట్టాలని బ్రహ్మయ్య గారు కోరారు .ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో 25-3-1968న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రకేసరి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించి ఘన నివాళులుఅర్పించారు .దీన్ని లోక సభ స్పెకర్ సంజీవ రెడ్ది గారుఆవిష్కరించటం చారిత్రాత్మకం ..
బ్రహ్మానందరెడ్డి ,సంజీవరేద్దిగార్లు ప్రకాశం గారిచే ప్రభావితులైన వారు .ఒకరు ముఖ్యమంత్రి ,ఇంకొకకరు లోక సభ స్పీకర్ గా ఎదిగినవారు .ఈ ఇద్దరి రూపం లో ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుగారి తపస్సు సత్ఫలితాలనిచ్చిందని సంతోష ఆనందాలు వ్యక్తం చేశారు వారికి అంతే వాసులైన రైతుపెద్ద ,పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారు .
ఆధారం -రైతుపెద్ద శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ''నా జీవన నౌక
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-12-25-ఉయ్యూరు .
