ఊడ్చి పెట్టిన సునామీ ,లావా వెదజల్లిన అగ్ని పర్వతం

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 4, 2024, 12:11:40 PMJun 4
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Vuppaladhadiyam Venkateswara, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, గోదావరి రచయితల సంఘం రాజమహేంద్రవరం, S. R. S. Sastri, mrvs murthy, GLN Sarma, Innaiah Narisetti

ఊడ్చి పెట్టిన సునామీ ,లావా వెదజల్లిన అగ్ని పర్వతం

అహంకారం అహంభావం అవినీతి ,నిర్మాణ లేమి ,వ్యవస్థల భ్రస్టు పట్టించటం ,లెక్కలేని తనం ,బరి తెగించటం ,శ్రేణులను రెచ్చగొట్టటం ,న్యాయ ,చట్ట రక్షణ చేయాల్సిన బలగాన్ని ఆత్మరక్షణలో ,ప్రతిపక్షాలను అణచి వేయటంలో ఉపయోగించటం న్యాయస్థానాలను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేయటం ,నిలకడ లేని తనం, బూతులు  ఆడటం ఆడించటం,అభివృద్ధి లేకుండా అప్పులు తెచ్చి తాయిలాలు పంచటం ,ప్రభుత్వానికి కళ్ళు లాంటి ఉద్యోగులను ఉపాధ్యాయులను కించపరచి అవహేళన చేయటం ,పనికిరాని చెత్త ను సలహాదార్లుగా వందలాది మందిని నియమించటం ,సభలో ఆడవారి పట్ల అసభ్య ప్రవర్తన ,అధో జగత్ సహోదరులను క్రూరంగా నీచంగా దారుణంగా బాధించటం శిరోముడ నాలు చేయించి  చేయించి వికటాట్ట హాసాలు చేయటం ,శవాలను పార్సిల్ చేయటం ,కోడికత్తి రాయి రువ్వటాలను భూతద్దాలలో చూపటం ,చంపబడ్డ బాబాయి  కేసు అయి దేళ్ళ యినా ,ముగింపు రాకుండా అడ్డుపడటం ,తల్లినీ చెల్లినీ అవమానించటం ,భార్య పెత్తనానికి లొంగిపోవటం ,చెప్పులు బూట్లు డ్రెస్ లకు లక్షలాది రూపాయలు ఖర్చుచేయటం ,అయిదు కిలో మీటర్ల దూరానికీ హెలికాప్టర్ వాడటం ,పర్యటన సమయం లో పర్యావరణాన్ని రక్షించే ప్రకృతి సంపద పచ్చని చెట్లను పొట్టన పెట్టుకోవటం, అయిదేళ్ళలో రోడ్లమీద తట్టెడు మట్టి కూడా వెయ్యకపోవటం ,చెత్తపన్ను వేయటం ,అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పొతే  సరైన సమయంలో వెళ్ళి ప్రజల యోగక్షేమాలు తెల్సుకొని  ఆదుకోవటం చెయ్యక పోవటం ,ఇచ్చేది తక్కువ బిల్డప్ ఎక్కువగా బటన్లునొక్కి చాటింపు వేసుకోవటం ,పోలవరాన్ని పూర్తి చేయకపోవటం ,మూడు రాజధానులని ఆర్భాటాలు అమరావతి ప్రజలను అయిదేళ్ళుగా చిత్ర హింసలు పాల్జేయటం ,రుషికొండకు గుండు కొట్టటం ,ఇసుక క్వారీ , సహజ సిద్ధ ఎర్రమట్టి దిబ్బలు తవ్విన్చేయటం ,విద్యుత్ పన్నులు విపరీతంగా పెంచటం ,పాత గవర్నమెంట్ కట్టించిన ఇళ్లను లబ్ధిదార్లకు ఇవ్వకపోవటం ,తానేదో పగల్దీసినట్లు ఊరూ వాడాలేని చోట్ల సెంటు భూమి ఇచ్చి ఇళ్ళు కట్టుకోమనటం కట్టకపోతే లాక్కు౦టాననడం ,ప్రభుత్వ పాఠశాలల అభి వృద్ధి చేయక వసతులు కల్పించక , విద్యార్ధుల్ని పక్క స్కూళ్ళ  లోకి తోలడం ,తెలుగు మీడియం ను కించపరచటం,ఇంగ్లీష్ ను చిన్నతరగతులనుంచే మొదలు పెట్టటం ఇంగ్లీష్ రాని వారిని నియిమించటం , రైతులు అమ్మిన ధాన్యానికి సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోవటం ,సీనియర్ సిటిజెన్స్ ల పెన్షన్ లో కోత,ఇవ్వాల్సిన డియే లు ఇవ్వకపోవటం ,రేవులు ,పోర్టు లు మొత్తలావు గాళ్ళకు దొబ్బపెట్టటం ,గంజాయి సారాయికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చటం ,ఒక్కపరిశ్రమ అయినా తేలేకపోవటం ఉన్నవి పారిపోఎట్లు కులగజ్జి పులమటం,పాతగవర్నమెంట్ లో ఆఫీసర్లు అందరూ ఒకేకులం వారని చాటి ,తను నియమించిన వారంతా తన కులపోళ్ళే అవటం,కారణం లేకుండా అరెస్టులు చేస్తూ ,పవిత్ర తిరుమలను ,అనేక దేవాలయాలను భ్రష్టు పట్టించటం నెలకోసారి ఢిల్లీ వెళ్ళి అగ్రద్వయాన్ని’’ఏదోరకం’’ గా ప్రసన్నం చేసుకోవటం ,ఉచ్చనీచాలు వదిలెయ్యటం ,ప్రభుత్వ ఉన్నతాధికార్లతో కాక సజ్జలు జొన్నలు బుగ్గలుపెగ్గులు లతో సంప్రదించి మునగటం,ఒక్క ఉద్యోగం కూడా కల్పించకపోవటం ,దిగ్రీలుపాసై ఇంజినీరింగ్ పాసై ,ఉద్యోగాలులేక వలసపోవటం  ఇవన్నీ పని చేసి  జన సునామీ సృష్టించి,ఊడ్చి పారేసింది  ఇప్పటి పాలనను .అది ప్రభుత్వం అనటానికి మనసు రావటం లేదు.ప్రజల సహనం కొంతవరకే. హద్దుమీరితే అంతు చూస్తారు సైలెంట్ గా వయొలెంట్ గా కాదు తిరిగిలేవకుండా .ఈ మహాపాపం లో ‘’మోషా’’ద్వయానికీ భాగం ఉంది .అందుకే మునిగే చిల్లు వోడ వదిలి దరిచేర్చే సైకిల్ పట్టుకున్నారు .

 రైతుల గోడు పట్టదా ,రోజుకోమాటా ,రాజ్యాంగం ఉందన్న స్పృహ వద్దా .ఆలయాలు కట్టిస్తే ఎడాపెడా పద్మలురత్నాలు విదిలిస్తే వోట్లు రాలతాయా ? రాజ్యా౦గ౦  కల్పించిన హక్కులని మారుస్తామంటారా ?ఒకమతం పై మరోదాన్ని రెచ్చ గొడ తారా ,ఇడి,సిఐ డిలు ప్రయోగించి  భయోత్పాతం సృష్టిస్తారా ? ప్రశ్నిస్తే నేరమా ?చట్టసభల్లో చర్చించరా ?పదేళ్లలో కనీసం పది ఉద్యోగాలిచ్చారా ?గుడులు చుడుతూ క్షణానికి డ్రెస్ మారుస్తూ  వందలాది నిపుణులతో మీకుఅనుకూలమైంది ప్రచారం చేయిస్తూ ,చానళ్ళు కొనేసి బాకాలు వాయి౦పజేస్తూ,అవినీతి పరులని దేశం దాటిస్తూ ,జిఎస్ టి ,పేరిట లక్షలాది కోట్లు సాధిస్తూ ,మీ రాష్ట్రం వాడికే ఎయిర్ పోర్ట్ లుపోర్టు లు అప్పగించి సాధారణ పౌరుల్ని దగ్గరకు కూడా రానీక ,ప్రెస్ మీట్ లు  లేక ‘’మంకీ ‘’బాత్ తో సొల్లు కారుస్తూ ,ప్రజలనాడిని పట్టలేని అగ్ర ద్వయం పెద్ద పీటీ దెబ్బ తిన్నారు .యువకులకు నాయకత్వమిచ్చి పక్కకు తప్పుకొంటే దేశానికి మీకూ మంచిది .దేశాన్ని యేలేవాడికి కొంచెమైనా అక్షరజ్ఞానం ఉండాలి లేకపోతె ఇదే తంటా .కుర్రాడు పనికి రావు అన్నవాడు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి ఇల్లు ఖాళీ చేయించి అవమానపరిస్తే  తండ్రిని , తాతను నిత్యం అవమానిస్తూ వెటకారంగా నవ్వుతూ హేళన చేస్తే ,సైలెంట్ కిల్లర్ లా కూతమికట్టి చాపకింద నీరులా విజ్రుమ్భించి చార సౌ సేఊపర్ ,త్రీఫిఫ్టి అని ప్రగాల్భాలను పలికిన కమలం వాదిమాది పోయే దాకా తెచ్చాడు .అసలు విషయాలు ప్రజలకు నిరంతరం చానల్స్ ద్వారా ఎరుకపరచి చైతన్యవంతులను చేసిన శ్రీ పరకాల ప్రభాకర్ ,మాహువా మీడియా అద్భుత కృషి చేసి వంకర తీశారు .

 ఇంతటి కల్లోలం లో పరాకు అండగా నిలచిన ఆంధ్రజ్యోతి ,ఈనాడు మహాన్యూస్ ,టీవీ 5 ఈనాడు పత్రిఅక్ చానళ్ళు ప్రజలభుజం కాచాయి .మార్గ నిర్దేశం చేశాయి .కర్తవ్యమ్ బోధించాయి .ముఖ్యంగా ఆర్ కె ,సాంబశివరావు ,మూర్తి ల సేవను ఎంతకొని  యాడినా తక్కువే .అలాగే విశ్లేషకులు అడుసుమిల్లి ,కృష్ణకుమారి ,సిఎస్ వగైరాలు అభినందనీయులు .ఎన్నో ఆటుపోట్లకు ఎదురు నిలిచి పోరాడారు ఏడాదిన్నరకాలంలో ప్రజలు ,అమ్ముడు పోని మీడియా  ,ఎనలేని సేవ చేశారు .ఇతర దేశాలనుంచి వచ్చిన  ఎంఆర్ ఐ లు  ఇండియాలోని ఐటి ఉద్యోగులు అందించిన సహకారంచరిత్రలో నిలిచిపోయే అపూర్వఘట్టమే .ఇందులో సందట్లో సడేమియా అన్నట్లు ఎన్నో ప్రీ పోల్స్,ఎగ్జిట్  పోల్స్ ,బాబాల ప్రవచనాలు ఓడిపోతాడని పూర్తిగా తెలిసినా బ్లఫ్ మాస్టర్స్గా అవతారాలు ఎత్తటం చూసి విసుగు చెందారు ప్రజలు .అయితే మన రాష్ట్రం విషయంలో మిస్టర్ కేకే చేసిన నిష్పాక్షిక సర్వ్ ఫలితాలు మహాద్భుతంగా ఉన్నాయి అతడికి మనసారా అభినందనలు .

 పాతగాయాలు మాన్పుకొని రాష్ట్రం అభివృద్ధి వైపుకు  విజనరీ బాబు ఆధ్వర్యంలో ముందుకు సాగాలని కోరుకొందాం .పోయిన మన వైభవం అంతా మళ్లీ ప్రత్యక్షంగా దర్శిద్దాం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-24-ఉయ్యూరు .


--
Reply all
Reply to author
Forward
0 new messages